Friday, June 25, 2021

జీవితం వడ్డించిన విస్తరి కాదు

జీవితం వడ్డించిన విస్తరి కాదు
🕉️🌞🌎🏵️🌼🚩

జీవితం కొందరికి వడ్డించిన విస్తరిగా అనిపిస్తుంది. ధనమే జీవితానికి పరమావధిగా భావిస్తుంటారు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటే, లోకమంతా రంగులమయంగా కనిపిస్తుంది. డబ్బు అలా విసిరేస్తే కొండమీది కోతి అయినా ఇలా దిగివస్తుందని తలపోస్తారు. దిలాసాగా జీవితం గడిపేస్తుంటారు. ఏదో అనుకోని సంఘటన... వూహించని జీవన ఉత్పాతం... సంభవిస్తుంది. అనుకోని కష్టాలు ఎదురవుతాయి. అసలలాంటి బాధలు ఉంటాయని కూడా ఆలోచించి ఉండం. ఎలా ఆ కష్టాల నుంచి బయటపడటం అని... అప్పుడు.. అప్పుడు ఆలోచిస్తాం. మనిషి హాయిగా జీవించేయడానికి బాసటగా ఉన్నవారిని అకస్మాత్తుగా కోల్పోవచ్చు. కలలోనైనా వూహించని సంఘటన జరిగి సర్వస్వాన్నీ పోగొట్టుకోవచ్చు. అప్పుడిక కష్టాలన్నీ మనలను వెన్నంటే ఉంటాయి. నడి సముద్రంలో చిక్కుకొన్న మనిషిలా ఆశలు కొలబోతాయి. ఒడ్డున పడటం మన వీలు కాదని అనుకొంటున్న సమయంలో. అప్పుడు మన మనసులో శతకోటి ఉపాయాలు మెదులుతాయి. ఏదో ఒక యుక్తి వల్ల జీవితంలో ఆలంబన లభిస్తుంది. ఆ కష్టసమయంలో మనం చేసే ప్రయత్నమే మన అదృష్టంగా మారుతుంది. ఆ అదృష్టమే కష్టాల కడలినుంచి తీరానికి చేరుస్తుంది.

ఆ కష్టం సంభవించే దాకా మనిషికి తాను అలాంటి ప్రయత్నం చేయగలనని తెలియదు. కష్టమే మన ప్రయత్నానికి వూతమై అదృష్టవంతుణ్ని చేస్తుంది. ప్రారంభంలో మనిషి, అన్ని చతుష్పాద (నాలుగు కాళ్ల) జంతువుల్లాగానే భూమిపై తిరిగేవాడని మానవ ఆవిర్భావ సిద్ధాంతాలు తెలుపుతున్నాయి. కష్టాలను దూరం చేసుకొనే ప్రయత్నంలోనే సుఖాల అన్వేషణ చేశాం. నేడు సుఖంగా మనుగడ సాగించగలిగే సౌకర్యాలను
సమకూర్చుకొని అదృష్టవంతులమయ్యాం ! మనిషికి కష్టాలే లేకపోతే సుఖాలను శోధించే అవసరమే ఉండేది కాదు. శారీరక, ఆర్థిక, మానసిక, సామాజిక కష్టాల బారిన పడినంత మాత్రాన మనిషి నిరుత్సాహపడకూడదు. మనిషిలోని ఆలోచన, ఉద్వేగాలు ఎంతో గొప్పవి ఎప్పుడూ కష్టాలకు భయపడుతూ బతకడం మానవనైజం కాదు

మనిషి తనకు కలిగిన కష్టాలను దూరం చేసుకొనే అశక్తుడిగా మారినా వెరవడు. తన సృష్టి ఎలా జరిగిందో తెలుసుకొని అందుకు కారకుడైన అంతర్యామిని గ్రహించగలిగాడు. తన బాధలను, తాను తీర్చుకోలేని కష్టాలను గ్రహించగలిగాడు. తన బాధలను, తాను తీర్చుకోలేని కష్టాలను దైవానికి విన్నవించుకొనేందుకు ప్రార్థనను సృజించగలిగి మహా అదృష్టవంతుడయ్యాడు తనను అన్ని విధాలా కష్టాలనుంచి కాపాడగలిగే దైవం ఉన్నాడనే భావన మనిషికి ఎనలేని ధైర్యాన్ని ఇస్తుంది.. కష్టాల్లోనూ, అన్నిరకాల బాధల్లోనూ దైవాన్ని శరణువేడి ప్రార్థిస్తే మనిషికి లభించే ధైర్యం మహనీయమైనది. ఆ ధైర్యమే మనిషికి శ్రీరామరక్ష, చీకట్లు ఆవహించగానే ఆ .కష్టాన్ని తీర్చుకోవడానికి వెలుగులను సృష్టించుకుని అదృష్టవంతుడయ్యాడు. ప్రయత్నం చేస్తే చెడుకాలం తొలగి మంచికాలం వస్తుందని తెలుసుకొన్నాడు. సృష్టినీ సృష్టికర్తనూ తెలుసుకోగలిగాడు. ఒంటరిగా జీవించే కష్టాలకు దూరం కావడం కోసం సమాజాన్ని

సృష్టించుకొన్నాడు. ద్వేషం కష్టాలకు కారణమని గ్రహించి ప్రేమించడంలోని గొప్పతనాన్ని తెలుసుకొని అదృష్టవంతుడయ్యాడు ప్రేమించి ప్రేమను పొందడంలో దైవత్వం ఉందని తెలుసుకొన్నాడు. ప్రేమవల్ల త్యాగం, త్యాగంవల్ల నిర్మలత్వం, నిర్మలత్వం వల్ల దైవత్వం సిద్ధిస్తుందని గ్రహించాడు. అన్నింటికీ ఆ దైవమే ఉన్నాడనే భావననూసృజించుకొని మనిషి మహా అద్భుతమైన ధైర్యవంతుడయ్యాడు. ధైర్యం మనిషిని శక్తిమంతుడిని చేసే అదృష్టానిస్తుంది. కష్టకాలాల్లో ఎంతటి బాధలనైనా ఎదుర్కొని ముందుకు సాగే శక్తిని దైవబలం మనిషికిస్తుంది. జటిలమైన సమస్యలనైనా పరిష్కరించుకోగలిగే యుక్తి మనిషికి దైవం ఉన్నాడనే భావనవల్ల కలుగుతుంది

కష్టాలతో ఎంత పోరాడగలిగితే అంత బలం మనిషికి లభిస్తుంది. కష్టాలే మనిషి విజయానికి సోపానాలు మనిషిలోని నిద్రాణమైన భావం, యుక్తి, శక్తి- కష్టాలు సంభవించినప్పుడే ఉత్తేజితమవుతాయి. అలాంటి పరిస్థితుల్లోనే మనిషి కొత్త జీవితాన్ని ఆవిష్కరించుకోగలుగుతాడు. ఎంతో అదృష్టవంతుడవుతాడు. అందుకే కష్టాలకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే... కష్టాలే అదృష్టాలు

సేకరణ. మానస సరోవరం

Source - Whatsapp Message

No comments:

Post a Comment