Sunday, June 13, 2021

జీవిత సత్యాలు.

జీవిత సత్యాలు.

నిందించడం తేలిక, నిందను భరించడం కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం కష్టం.

అబద్ధం చెప్పడం తేలిక, నిజాన్ని దాచడం కష్టం. ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరిపోతాయి.

అలాగే భరిస్తున్నారు కదా అని బాధపెడితే బంధాలు కూడా తెగిపోతాయి.

జీవితం (Life) ఎప్పుడూ ఒకేలా ఉండదు.

కొన్ని రోజులు మనమెంతో ఆనందంగా జీవిస్తే .. మరికొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ మనకే ఉన్నాయని అనిపిస్తుంది.

ఎప్పటికప్పుడు జీవితమనేది కొత్తగానే కనిపిస్తుంది.

కొందరు వయసు పెరుగుతుంటే.. కష్టాలు తగ్గుతాయేమోనని అనుకుంటారు. కానీ అందరి విషయంలోనూ ఇది సరికాదు. 

అయితే పెరిగే వయసుతో పాటు.. ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్తాం.

మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment