Friday, June 25, 2021

మంచి మాట.. లు

శుక్రః
హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుం ।
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ॥

లక్ష్మీ శ్లోకః
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం ।
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం ।
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం ।
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం

ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు. పార్వతి గాయత్రీ సరస్వతి లక్ష్మి అమ్మ వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...
శుక్ర వారం --: 25-06-2021 :--
ఈ రోజ్ AVB మంచి మాట.. లు

ప్రతి రోజు సూర్యుడు ఉదయిస్తాడు ఇది సత్యం .. నువ్వు ఎదగటానికి కూడా అవకాశాలు వస్తుంటాయి.. వాటిని పట్టుకుంటావో వదిలేస్తావో అనేది ని ఇంగితం బట్టి ఉంటుంది.. ఉపయోగించుకోవడానికి ప్రయత్నించ్చు.. అదృష్టం అనేది రోజు రాదు.. అది వచ్చినదాకా ఊరుకోకుండా నువ్వు ఏదో ఒక ప్రయత్నాం కొనసాగించాటమే ని కష్టానికి ప్రతిఫలం అదృష్టం రూపంలో అప్పుడు వస్తుంది

అవసరానికి మించి ఖర్చు చేయటం అన్నివిధాలా అనర్థంఅందునా ప్రస్తుత పరిస్థితులలో ముఖ్యంగా ..

. అలానే కోల్పోయిన దానిని తిరిగి పొందటం కూడా కష్టమే అది మనిషి అయినా వస్తువు అయినా

మనిషి చుట్టూ మంచి చెడు కష్టం నష్టం ప్రేమ ద్వేషం అన్నీ ఉంటాయి దేన్ని వదిలేస్తాం దేన్ని తీసుకుంటాం అన్నదాన్ని బట్టే మన సంతోషం ఆధారపడి ఉంటుంది .

మనం ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళకింద , మన ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది . సంపాదించింది ఏదీ మనది కాదు . ఒక మంచి తనం ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప . నువ్వు నిజాయితీగా ఉంటే నీతో చాలా మంది మిత్రులు ఉండకపోవచ్చు . కానీ ఖచ్చితంగా సరైన వ్యక్తులే నీకు మిత్రులుగా మిగులుతారు .

మంచి చేసే అలవాటున్నవారికి
మంచిని అభినందించే లక్షణమున్న వారికి మనసు హాయిగా ఉంటుంది.
సాటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే తమ జీవితం కూడా ఆనందమయం అవుతుంది .

పనికిరాని వస్తువులు ఇంటికి బరువు పనికిమాలిన ఆలోచనలు మనసుకు బరువు పరులసొమ్ము ఆశించేవాడు భూమికి బరువు

సేకరణ ✒️మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🤝

Source - Whatsapp Message

No comments:

Post a Comment