🍁మనోబలం🍁
✍️ మురళీ మోహన్
👌 మనిషి మనుగడకు, విజయసాధనకు శారీరకబలం అవసరమే కాని అంతకంటే ముఖ్యంగా కావాల్సింది- మనోబలం. మనోబలం వల్లే మనిషి తాను కోరుకున్న లక్ష్యాలను చేరుకోగలడు. మానసిక బలహీనుడు ఏ పనీ ఆరంభించడు. ఆరంభించినా అందులో మనసు లగ్నం చేయలేడు. మనసే అన్నింటికన్నా బలీయమైంది. మనోబలం నిండుగా ఉన్నవాడే అసలైన బలవంతుడు. స్థిరచిత్తం కలిగిన బలవంతుడు ఎలాంటి కార్యాన్నయినా సాధించగలడని భాస్కర శతక కారుడు చెబుతాడు.
మన పురాణ గాథలు గమనిస్తే మనోబలంతో మహాకార్యాలు సాధించిన మహనీయులెందరో కనిపిస్తారు. వారు ఈ నేల తల్లిని పునీతం చేసి లోక కల్యాణం కోసం పాటుపడ్డారు.
సగరులను తరింపజేయడానికి గంగను దివి నుంచి భువికి తీసుకు వచ్చిన భగీరథుడి మనోబలం సామాన్యమైనది కాదు. అతడు తన పూర్వీకులు సాధించలేని కార్యాన్ని పట్టుదలతో పూర్తి చేసి శాశ్వత కీర్తి పొందాడు.
జాంబవంతుడి ప్రేరణతో సీతాన్వేషణకు పూనుకొన్న హనుమంతుడు మనోబలంతోనే శతయోజన పర్యంతమైన సముద్రాన్ని లంఘించాడు. సీత జాడ తెలుసుకుని రామ కార్యాన్ని పూర్తి చేశాడు. భక్తికి, సంకల్పానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. గురువు ద్వారా శిక్షణ పొందలేకపోయినా నిరాశ చెందక మొక్కవోని సాధనతో ఏకలవ్యుడు గొప్ప విలుకాడు కాగలిగాడు.
మనోబలం మనిషికి సంకల్పాన్ని కలిగిస్తుంది. ఆ వ్యక్తిని విజయతీరం వైపు నడిపించి ఆశయసిద్ధికి తోడ్పడుతుంది. మనిషిని మనీషిగా మారుస్తుంది. మనోబలం కలవారు మౌన గంభీరులై ఉంటారు. నిరంతరం కార్యనిర్వహణలో నిమగ్నులై ఉంటారు.
మనోబలం ఉన్నా బాగా శ్రమించి పనిచేస్తేనే ఆశించిన ఫలితం దక్కుతుంది. విత్తనం నాటాలంటే ముందు నేలను బాగా పదును చేయాలి. నీరు అందించాలి. మేలిమి విత్తనాలు నాటాలి. మొలకెత్తాక ఎరువులు వేయాలి. మొక్క ఎదిగేవరకు కాపాడాలి. అప్పుడే మంచి ఫలితం వస్తుంది కదా.
ఒక్కొక్కప్పుడు మనిషి తొలి ప్రయత్నంతో లక్ష్యాన్ని సాధించలేకపోవచ్చు. అంతమాత్రాన నిరాశ చెందకూడదు. లక్ష్యసాధనలో ఎన్నో రకాల పరీక్షలు ఎదురవుతాయి. వాటిని తట్టుకోవాలి. అడ్డంకులను అధిగమించాలి.
ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకుని శ్రద్ధ, అవగాహనతో ముందుకుసాగాలి. అప్పుడే అతడు విజేత కాగలుగుతాడు.
విశ్వవ్యాప్తమైన ఆకాశాన్ని చూసి భయపడి చిన్న పిచ్చుక ఎగరడం మానదు. మనోబలంతో, తనకున్న చిన్న రెక్కలతోనే ముందుకు సాగుతుంది. అలాగే అనంత సాగరాన్ని చూసి చేపపిల్ల భయపడదు. చిన్న మొప్పలతోనే ఈదడం ప్రారంభిస్తుంది. మనిషి కూడా మంచి ఆలోచనతో, పట్టుదలతో లక్ష్యసాధనకు కృషి చేయాలి. దారి పొడుగునా ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే అసాధ్యాలు సుసాధ్యాలవుతాయి.
పరుగుపందెంలో కిందపడినవాడు బాధపడుతూ ఉంటే అక్కడే చతికిలపడతాడు. మనోబలంతో లేచి శక్తి కూడదీసుకుని విజృంభిస్తే చివరికి అతడు అందరికంటే ముందుగా నిర్దేశిత లక్ష్యం చేరుకుంటాడు. మనిషి తాను బలహీనుడిని అని ఎప్పుడూ అనుకోకూడదు. తోడ్పాటు కోసం ఎదురుచూడక ప్రయత్నశీలుడై లక్ష్యసాధనకు కృషిచేయాలి.
ఎన్నో బాలారిష్టాల్ని అధిగమించి ఎదిగిన వృక్షం తన నీడను తాను వాడుకోదు. తన ఫలాలు తాను భుజించదు. ఓ వృక్షంలా, ఓ నదిలా మనిషి కూడా మనోబలంతో ముందుకుసాగి విశ్వ శ్రేయస్సు కోసం పాటుపడాలి. ఎందరో శాస్త్రవేత్తలు, నాయకులు శారీరక వైకల్యాలను అధిగమించి మనోబలంతో మానవాళికి సేవచేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి మనిషీ సేవాతత్పరతతో ముందుకు సాగి శాశ్వత కీర్తిని పొందాలి!👍
Source - Whatsapp Message

No comments:
Post a Comment