Friday, June 25, 2021

ఆణి ముత్యాలు.

నేటి ఆణి ముత్యాలు.

మన శక్తి కన్నా,
సహనం చాలాసార్లు మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది.

బయట కనిపించే మురికిగుంతల కన్నా,
మనసులో మాలిన్యం ఉన్న వ్యక్తులతో చాలా ప్రమాదం.

వికశించే పుష్పం నేర్పింది
తనలా అందంగా జీవించమని.

రాలిపోయే ఆకు నేర్పింది
జీవితం శాశ్వతం కాదని.

ప్రవహించే వాగు నేర్పింది
అవరోధాలు దాటి వెళ్ళమని.

మెరిసే మెరుపు నేర్పింది
క్షణ కాలమైనా ప్రకాశించమని.

డబ్బుతో పొందగలిగేది ఏది శాశ్వతం కాదు
కానీ మనసుతో పంచె స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి.

ఎంతమంది హృదయాలను మనం గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే...
ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు..
మనకంటే మంచివారు ఇంకెవ్వరూ ఉండరు.

నిన్ను తిట్టేవారందరూ నీ శత్రువులు కాదు
నిన్ను మెచ్చుకున్న వారందరూ నీ మిత్రులు కాదు

కష్టం మిత్రుడిని చూపిస్తుంది
కన్నీరు శత్రువును గుర్తిస్తుంది


"హృదయం కూడా భూమి లాంటిదే.
ద్వేషం అనే మొక్కను నాటితే విషం చిమ్ముతూ పెరుగుతుంది.
ప్రేమ, విశ్వాసం అనే విత్తనాలను నాటితే సమాజానికి పనికివచ్చే మొక్కలను ఇస్తుంది."

శుభోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment