Friday, June 25, 2021

నేటి జీవిత సత్యం.

🌹నేటి జీవిత సత్యం.

దూరంగా ఉన్నప్పుడు అందరూ మనవాళ్ళే !దగ్గరకు వెళ్ళాక తెలుస్తుంది..?ఎవరూ మన వాళ్ళు కాదని !!
నమ్మి, ఎవరితో ఏది చెప్పకండి,ఎందుకంటే,అందరి నిజస్వరూపం సమయం వచ్చినప్పుడే బయటపడుతుంది..

మెడలో వేసుకునే బంగారాన్ని బట్టి,బ్రతుకులో బలాలు లెక్కగట్టకు ! రోల్డ్ గోల్డ్ బతుకులు..చాలానే ఉన్నాయి నేటి సమాజంలో..!! ఎన్ని అభినందనలు వచ్చాయన్నది కాదు..?ఎంత మందిని "ఆలోచింప చేసింది" అన్నదే ముఖ్యం..ఇదే "సోషల్ మీడియా"లో పాటించాల్సిన సూత్రం..


🍃🌹కాలం ఎప్పుడు గిర్రునతిరుగుతూనే ఉంటుంది

త్రాడు వదిలిన బొంగరంలా! కాలాన్ని కాపాడుకోవాలి కంటిపాప లా

ఎల్లప్పుడూ,ఎందుకంటే పసిడి కన్నా,మేలిమి వజ్రం కన్నా, విలువైనది కదా!!!

కాలాన్ని ఒడిసి పట్టుకుంటే ఆనందాన్నిస్తోం ది.అశ్రద్ధ చేస్తే విషాదాన్ని నింపు తుంది.కాలాన్ని అందుకోవాలనే ఆలోచన చేసెకంటే శ్రమ,శక్తితో సక్రమంగా వినియోగించుకుంటే నీ జీవన గమనం సులభమౌతుంది.

కాలం జీవనవాహినిలా తెరలు, తెరలుగా నిరంతరం సాగుతూనే వుంటుంది.ఆపగలిగే శక్తి లేని మనిషి దాని విలువ తెలుసుకొని నడిస్తే అతడు ఎందరికో "మార్గదర్శి" కాగలడు..

శుభోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment