మనిషి ఏ విషయాల్లో అసంతృప్తి చెందకూడదు..వేటి విషయంలో ఇక చాలు అని అనుకోకూడదు..ఆచార్య చాణక్య ఏం చెప్పారు?
సంతృప్తి అనేది మనిషికి కచ్చితంగా ఉండాల్సిన లక్షణం. సంతృప్తికి కొలమానం ఉండదు. ఒకటి దొరికితే, మరోటి కావాలనిపిస్తుంది. అది దొరికితే ఇంకోటి.. ఇలా కోరికల చిట్టా పెరిగిపోతూనే ఉంటుంది సంతృప్తి లేకపోతే. కొన్ని విషయాల్లో మనిషి సంతృప్తి చెందకపోతే కనుక.. జీవితమంతా అసంతృప్తితో బాధాకరంగా సాగుతుంది. ఇక కొన్ని విషయాల్లో మాత్రం సంతృప్తి చెందనే కూడదు. దానితో జీవితం అక్కడే ఆగిపోతుంది. సంతృప్తి-అసంతృప్తి మధ్య ఉండే తేడా తెలిసి.. దేనిని ఎక్కడివరకూ పొందాలో తెలుసుకుని మసలుకునే వారికి జీవితం సాఫీగా ఆనందంగా సాగిపోతుంది. ఆచార్య చాణక్య సంతృప్తి అనేదానిపై ప్రత్యేకంగా వివరించారు. చాణక్య విధానం పదమూడో అధ్యాయంలో 19వ చనంలో, ఆచార్య చాణక్య ఏ విషయాలలో మనం సంతృప్తి చెందాలి అనే విషయంపై స్పష్టంగా చెప్పారు.
1.ఆచార్య చాణక్య వివరించిన దాని ప్రకారం, మీ మనస్సుకు భార్య అందంగా లేకపోయినా, మీరు సంతృప్తి చెందాలి. ఏది జరిగినా, వివాహం తరువాత, ఒక పురుషుడు ఇతర మహిళల వెనుక ఎప్పుడూ పరిగెత్తకూడదు, లేకపోతే, అతని జీవితం నాశనమవుతుంది. ఒక వ్యక్తి తన భార్య బాహ్య సౌందర్యం కంటే ఎక్కువగా మానసిక సౌందర్యాన్ని చూడాలి. సున్నితమైన భార్య ఏ వ్యక్తి జీవితాన్ని అయినా సంతోషపరుస్తుంది.
2. మీకు ఏ ఆహారం దొరికినా, మీరు దానిని దేవుని ప్రసాదంగా ఆనందంగా అంగీకరించాలి. అంత అదృష్టం లేని చాలా మంది ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి ఆహారం విషయంలో కోర్కెలు కలిగినపుడు.. దొరకిన ఆహరం నచ్చలేదనిపించినపుడు, ఆ వ్యక్తుల గురించి ఆలోచించండి. మీకు లభించినది దేవుని చిత్తం నుండి. దాన్ని ఆనందంతో స్వీకరించడం నేర్చుకోండి.
3. ఎవరైనా తన వద్ద ఉన్న డబ్బుతో సంతృప్తి కలిగి ఉండాలి. ఎక్కువ డబ్బు కావాలనే కోరికతో, తప్పు చేయకూడదు, మరెవరి డబ్బు వైపు చూడకూడదు. ఈ అలవాట్లు జీవితంలో సమస్యలను సృష్టిస్తాయి, తరువాత ఇవి చాలా ఇబ్బందికి గురి చేస్తాయి. దుఃఖం కలిగిస్తాయి. అందువల్ల, మీ ఆదాయంతో సంతృప్తి చెందడం నేర్చుకోండి అలాగే మీ ఆదాయానికి అనుగుణంగా డబ్బు ఖర్చు చేయండి.
ఒక వ్యక్తి సంతృప్తి చెందాల్సిన విషయాలు ఇవి. కానీ కొన్ని విషయాలు ఎప్పుడూ అసంతృప్తిగా ఉండాలి, అంటే, ఇంకా ఎక్కువ చేయాలనే ఉద్దేశం ఎప్పుడూ ఉండాలి. ఆచార్య చాణక్య చెప్పినదాని ప్రకారం, ఏదైనా నేర్చుకునే విషయంలో సంతృప్తి చెందకూడదు. నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. ఎప్పుడూ ఎదో ఒక విషయం గురించి తెలుసుకుంటూ ఉండాలి. ఇక విరాళాలు లేదా దానం ఇవ్వడం విషయంలో కూడా సంతృప్తి కూడదు అంటారు ఆచార్య చాణక్య. అదేవిధంగా పూజలు.. జపాలు ఎప్పుడు ఇక చాలు అని అనుకోకూడదు. ఎందువలన అంటే, ఇవి ఎంత ఎక్కువగా ఆచరిస్తే అంత ధర్మాన్ని కూడగట్టుగోగలుగుతారు. తద్వారా గౌరవాన్ని సంపాదించుకుంటారు.
సేకరణ. మానస సరోవరం 👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment