Monday, June 14, 2021

భగవంతుడు సర్వాంతర్యామి అంటారు కదా. హృదయంలో ఉండే హరిని వెతకటానికి మనుషులు ఎంతో కష్టపడి దేవాలయాలకు వెళ్లడం దేనికి?

🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

🕉️ఒక శిష్యుడు గురువుగారి ని అడిగిన ప్రశ్న....🕉️

భగవంతుడు సర్వాంతర్యామి అంటారు కదా. హృదయంలో ఉండే హరిని వెతకటానికి మనుషులు ఎంతో కష్టపడి దేవాలయాలకు వెళ్లడం దేనికి?


📚✍️ మురళీ మోహన్

👌గురువు గారి జవాబు:
ముఖం మన దగ్గరే ఉంది.
కానీ మన కంటికి మన ముఖం కనిపించదు. కనపడడానికి అద్దం లో చూసుకొంటాము,
అద్దంలో ప్రాణం లేదు,
కంటికి ప్రాణం ఉన్నా ప్రాణం లేని అద్దంపై ఆధారపడితేనే మన ముఖం మనకు కనిపిస్తుంది.

అలాగే తెలుసుకోవాల్సిన మనం ఇక్కడే ఉన్నాం.
తెలియదగిన దేవుడు ఇక్కడే ఉన్నాడు. కానీ ఆ తత్వం చూడాలంటే ఈ రెండు కాకుండా మనకి ఏదయినా ఒక అద్దం లాంటిది కావాలి, అదే విగ్రహం ....

భగవంతుడు అంతటా ఉంటాడు అనుకున్నప్పుడు విగ్రహంలోనూ ఉంటాడు.
అందులో భగవంతుడిని చూసే భక్తి మనకి కావాలి.
మనలోన భక్తి, విగ్రహం ఈ రెండు అద్దం లాంటి ఫలితాన్నిస్తుంది....
అప్పుడే భగవంతుడి సాక్షాత్కారం పొందవచ్చు....
అందుకే గుడికి వెళ్ళాలి....

🌸 దైవదర్శనం తరువాత 🌸

మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ.
అది ఏమిటంటే..!

"అనాయాసేన మరణం
వినా ధైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం."

మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.

దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి.

"అనాయాసేన మరణం"

నాకు నొప్పి లేక బాధ కానీ లేని
మరణాన్ని ప్రసాదించు.

"వినా ధైన్యేన జీవనం"

నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,
నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.

"దేహాంతే తవ సాన్నిధ్యం"

మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను
నిన్ను దర్శించుకునే విధంగా దీవించు.

"దేహిమే పరమేశ్వరం"

ఓ ప్రభూ నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.

1)అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు.నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.

2)ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.

3) నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా
ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.

ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాధిస్తాడని మరువకండి. 🌹🌞

Source - Whatsapp Message

No comments:

Post a Comment