Sunday, June 27, 2021

జీవిత సత్యాలు.

జీవిత సత్యాలు.

ఏడు తరాల కోసం ఎంత ఆర్జిస్తే మాత్రం ఏం లాభం ....

రెండో తరానికి నువ్వు కట్టిన ఇంట్లో ఫొటో పెట్టే ఆసక్తి లేనప్పుడు.....


నీ మూడో తరానికి నీ పేరే గుర్తు పెట్టుకునే జ్ఞాపక శక్తి లేనప్పుడు.....

సంపాదన మానేయడం కాదు.

మితిమీరి సంపాదించటం మానేయడం ఉత్తమం..


సూర్యుని బొమ్మను చూపించి సూర్యకాంతి వస్తుంది అంటే రాదు....

హోటల్‌లో సర్వరు వంటల పట్టిక ఎంతసేపు ఏకరువు పెట్టినా

ఆకలి తీరటం కాని, రుచిని ఆస్వాదించటం కాని జరుగదు....

అదే విధంగా

వంటకు కావలసిన పప్పు, ఉప్పు, బియ్యం, కారం, చింతపండు, కాయగూరలు, నూనె వగైరా అన్నీ ఉన్నా

తింటానికి కావలసింది తయారుకాదు.....

అగ్ని లేకపోతే పదార్థాలన్నీ కూడా వాటి పూర్వస్థితిలోనే ఉండిపోతాయి.....

పొయ్యి కింద నిప్పుపెట్టి, పదార్థాలను అన్నిటిని తగుపాళ్ళలో ఉపయోగించి వంట చేసినప్పుడే కదా..

కావలసిన రుచి, తింటానికి పదార్థం లభిస్తుంది.

పదార్థాలు పక్వం అవ్వటానికి, ఆహారం తినటానికి నిప్పు ఎంత అవసరం అయిందో

అదే విధంగా

ఆత్మానందాన్ని అనుభవించటానికి

ఆత్మజ్ఞానం కూడా అంతే అవసరం అయి ఉంది....


" ఎదుటోడి తప్పును గుర్తించేవాడు మేధావి.

తన తప్పును గుర్తించేవాడు జ్ఞాని.


దౌర్భాగ్యం ఏమిటంటే మనచుట్టు మేధావులకు కొదవలేదు.

జ్ఞానులకు ఉనికి లేదు "


" నిజాన్ని మార్చే శక్తిఈ ప్రపంచంలో ఎవరికి లేదు.

కానీ

ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. "

అర్థం అయిన వారికి జవాబు ఇస్తే చర్చ బాగుంటుంది.

అర్థం కాని వారికి జవాబు ఇస్తే వాదన జరుగుతుంది.
                             
లక్ష్య వస్తువుపై ఏకాగ్రత పెంచుకోవడానికి ముందు

మీరు ఇతర విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకోవాలి.


దీరులు ...సమర్థులైన అయిన కార్యసాదకులకే అదృష్టం అనుకూలిస్తుందీ .

దైర్యసాహసాలతో కడవరకు ప్రయత్నాన్ని కొనసాగించే వారికే విజయం వరిస్తుంది..


" కల అంటే నిద్ర వచ్చేది కాదు,

నిద్రపోనివ్వకుండా చేసేది. "

నిజం నిలకడగా నివాసం
ఉండాల్సింది

మనిషి హృదయంలో.....
పైపై పెదవులపై కాదు...


మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండి కాదు.....

నాణ్యమైన మట్టి!

అలాగే ......

పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు
సంస్కారం

ఉషోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment