Monday, June 14, 2021

మంచి మాట...లు

బుధః%
ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం ।
సౌమ్యం సౌమ్య (సత్వ) గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ॥

ఆత్మీయ బంధుమిత్రులకు సౌమ్య వాసరః (బుధవారపు)శుభోదయ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబసభ్యులకు పార్వతి తనయులు విగ్నేశ్వరుడు సుబ్రమణ్యస్వామి హరిహర సుతుడు అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...

బుధవారం :- 09:06:2021
ఈ రోజు AVB మంచి మాట...లు

సామాన్యుడు - మీరు ఇంత అందంగా శిల్పాలను ఎలా చెక్కగలుగు తున్నారు?
శిల్పి - అందమైన శిల్పాలు ఆ రాళ్లలో దాగి ఉన్నాయి, నేను చేసేదల్లా ఎక్కువ ఉన్న రాతిని తొలగించడమే . అదే విధంగా మనలో ఆనందం నిండుగా ఉంది, చేయవలసిందల్లా బాధలను తొలగించు కోవడమే.

నీ స్నేహాన్ని పువ్వుతో పోల్చకండి వాడి పోతుంది , మంచుతో పోల్చకండి కరిగిపో తుంది , ఆకుతో పోల్చకండి రాలి పోతుంది , నీ నవ్వుతో పోల్చండి శాశ్వతంగా నిలిచిపోతుంది .

కరోనా సెకెండ్ వేవ్ మరియు ధర్థ్ వేవ్ అంటూ ఆందోళన చెందకుండా పిల్లలని రోజూ గంటైనా ఎండలో ఆడుకొనివ్వండి తిరగనివ్వండి నువ్వులు , బెల్లం ఉండలు , వేరుశనగ ఉండలు రోజూ పెట్టండి పండ్లు , మజిగ , రాగిజావ , అరటి పండ్లు బాగా అలవాటు చేయండి పెసర బద్ద పరిమాణం పచ్చ కర్పూరం రోజు ఒకసారి తప్పనిసరిగా తినిపించండి , అన్ని వేవ్ లు తోకముడుస్తాయి పచ్చ కర్పూరం క్రిమి సంహారిణి

జీవితం ఒక ప్రయాణం‌ మాత్రమే, ఇక్కడ నీ పనులు ముగించుకుని తర్వాత తిరిగి వచ్చిన చోటికి వెళ్ళి పోతావు . నీ నిజాధామం నీవు ఎక్కువ కాలం నివసించేది ఈ ప్రపంచం కాదు ! కీర్తి ప్రతిష్టలు ధన సంపాదన కోసం కాదు ? నీవు ఇక్కడికి వచ్చింది ధర్మాన్ని అందించడానికి సంతోషాన్ని నలుగురికి పంచడానికి మాత్రమే అని గమనించండి
సేకరణ ✒️మీ ఆత్మీయ బంధుమిత్రుడు..
AVB సుబ్బారావు 💐🤝

Source - Whatsapp Message

No comments:

Post a Comment