జన్మరాహిత్యం
➖➖➖✍️
ఈజన్మలొనే - మరుజన్మ లేకుండా చేసుకోవాలంటే!!!
మానవ జన్మ దుర్లభమైనది, ఇట్టి జన్మను ఆధ్యాత్మిక సాధన ద్వారా సార్థకం గావించుకోవాలి..!
మానవుడు ప్రతి రోజూ ఎన్నో పనులలో మునిగి తేలుతుంటాడు. పనికిరాని విషయాలు ఎన్నో చర్చిస్తుంటారు. సీరియళ్లు, సినిమాలు పదే పదే చూస్తుంటారు.
కాని దేవుడి ముందు కూర్చోడానికి "తీరిక దొరకడం లేదండీ" అని అంటుంటారు.
తీరిక లేక కాదు, అలా కూర్చోవడానికి మనసు అంగీకరించక, ‘అటువంటి కోరిక లేక’ అంటే బాగుంటుంది!
మనం వృధాగా గడిపే సమయంలో కొంచెం సమయం అయినా ‘భగవద్ధ్యానంలోనో, భగవచ్చింతనలోనో గడపాలి!’ అనే కోరిక కలిగితే, ఆ కోరికకు అనుగుణంగా తగిన అభ్యాసం చేస్తే మిగిలిన భారం భగవంతుడు చూసుకుంటాడు.
కానీ ఇవేవీ మనం చేయము, కానీ భగవంతుడు మనల్ని ఉద్దరించేయాలి అని ఆశిస్తాం! జరిగే పనా ఇది!!? మనం కొంత సాధన చేస్తే దానికి భగవంతుని అనుగ్రహం తోడై ఉంటుంది.
మనసా వాచా కర్మణా భగవంతునికి శరణాగతులమై ఉంటే దైవానుగ్రహము చేత మరుజన్మ లేకుండా మంచి మార్గం వేసుకోవచ్చు...✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
No comments:
Post a Comment