💖💖 *"314"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"వద్దనుకుంటున్నా కోరికలు పెరుగుతుండటం, శాంతిని ఆశిస్తున్నా అది దూరం అవుతుండటం ఏమిటి ?"*
**************************
*"కోర్కెలకు కారణం అసత్యదృష్టి. అట్టి అసత్యదృష్టిని తొలగించేవాడే గురువు. ప్రతిరోజూ నిద్రలో అప్రయత్నంగా మనసు అహంకార రహిత స్థితి పొందుతుంది. మెలకువలోనూ ఆ స్థితిని సాధించేందుకు అవరోధంగా ఉన్నది మనలోని కోరికలే ! గురువు అనుగ్రహాన్ని ఆశించడం అంటే మనసు యొక్క స్వచ్ఛతను కోరుకోవటమే. నిరంతరం శాంతిగా ఉండాలన్న అభిలాష కలగటం గురువు యొక్క తొలి అనుగ్రహం. ఆ శాంతి కోసం సాధన సాగటం మలి అనుగ్రహం. పరిపూర్ణ శాంతిని పొందటమే గురువు యొక్క పూర్ణానుగ్రహం. శుభేచ్ఛ కలిగింది మొదలు అది నెరవేరేవరకు లభించే పరిణామాలన్నీ మనపై గురువు చూపించే కనికరమే. ఈ సత్యాన్ని సదా మననంచేసే సంపూర్ణ శరణాగతి మనందరికీ అలవడాలన్నది భగవాన్ శ్రీరమణమహర్షి బోధనల్లోని అంతర్యం. తన సాధన ఎలా సాగుతుందోనన్న సంశయం ప్రతి సాధకుడికీ ఉంటుంది. రోజురోజుకు మనసు శాంతిని పొందటమే ఏ సాధకుడికైనా కొలమానం అవుతుంది !"*
*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
No comments:
Post a Comment