[9/3, 06:55] +91 73963 92086: జీవితాన్ని పూర్తి తప్పుగా అర్థం చేసుకున్న వారి నుంచే ‘వైరాగ్యం’ అనే మాట వస్తుంది. ఇలాంటివారి మూలంగానే ప్రపంచంలో చాలామందికి ఆధ్యాత్మికత పట్ల ఒక విధమైన ఏవగింపు వచ్చేసింది. అసలు, ‘ఆధ్యాత్మికత’ అంటే ఏమిటి? ‘ఆధ్యాత్మికత’ అంటే ఆకాశం వైపో, నేల వైపో చూస్తూ ఉండడం కాదు. ప్రార్థన చేయడం కాదు, గుళ్ళకూ, గోపురాలకూ వెళ్ళడం కాదు. అది భౌతికమైన పరిమితులకు అతీతమైన ఒక అనుభవం. ఆ అనుభవంలో ప్రయాణిస్తూ ఎలాంటి హద్దులూ లేని చోటుకు లేదా స్థితికి మనం చేరుకుంటాం. ఆ స్థితే అంతిమమైన, దివ్యమైన స్వేచ్ఛ!
‘ఆధ్యాత్మికత’ అన్నది ‘జీవితం పట్ల ఏ ఆసక్తీ లేని వారికేనని’ ప్రస్తుతం చాలామంది అనుకుంటున్నారు. ఇది పొరపాటు. నిజానికి ‘ఆధ్యాత్మికత’ అంటే, ఈ సృష్టిలోని ప్రతిదాన్నీ మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారని అర్థం. ‘ఆధ్యాత్మికత’ అంటే, మీ ఆసక్తి కేవలం భౌతిక జీవితం గురించే కాదు, జీవితంలోని అన్ని కోణాల గురించీ అని.
ఈ ప్రపంచంలో అత్యంత దురుపయోగమవుతున్న పదం ‘ఆధ్యాత్మికత’. కొన్నిసార్లు అజ్ఞానంవల్ల, అనేకసార్లు కావాలనే ఈ పదాన్ని సదుపయోగమో, దురుపయోగమో చేస్తున్నారు. ఈ దురుపయోగం కారణంగా అందరిలో ఎంత గందరగోళం ఏర్పడిందంటే అందరూ దానివల్ల ప్రయోజనమేమైనా ఉందా, లేదా అని సందేహించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇది చాలా అనిశ్చిత స్థితిని ఏర్పరిచింది.
చాలామందిని వెంటాడే ఒక ప్రశ్న... ఆధ్యాత్మికత అంటే ఏమిటి? అని. మహోన్నతం, అనంతం, అంతిమం అయిన స్వేచ్ఛ వైపు చేసే ప్రయాణమే ఆధ్యాత్మికత. మన భారతదేశంలో 1947కు ముందు ‘స్వేచ్ఛ’ అనే భావనకు నిర్వచనం ప్రజల దృష్టిలో అర్థం వేరేగా ఉండేది. ‘‘బ్రిటిష్ వారు ఈ దేశం వదిలి వెళ్ళిపోతే, మనందరం స్వేచ్ఛ పొందుతాం’’ అనే ఆలోచన అందరిలో మెదిలేది. బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు. సరే, ఇప్పుడు మనం స్వేచ్ఛగా ఉన్నామా?
కానీ, కొందరు అర్థం చేసుకునేది వేరే రకంగా ఉంటున్నది. అలాంటివారి అభిప్రాయం ప్రకారం, మనిషి ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలంటే, ‘సరిగా తినకూడదు, సరిగా బట్టలు కట్టుకోకూడదు, సరిగా జీవించకూడదు. అణగిపోయి ఉండాలి లేదా కనీసం అలా కనపడాలి’ అని. మీరు ఆనందంగా, సంతోషంగా ఉంటే, జీవితాన్ని ఆస్వాదిస్తుంటే, మీరు ఆధ్యాత్మికులు కాదని అలాంటివారు అనుకుంటారు. ఎప్పుడూ చిరునవ్వు ఎరుగని మేకపోతులా, గంభీరంగా ఉంటేనే.. మీరు ఆధ్యాత్మికులని వారు అనుకుంటారు. ఇదంతా వైరాగ్య సిద్ధాంతాల మూలంగా వచ్చిన ఆలోచనల పర్యవసానం. మనుషులు ఈ భూమ్మీదికి వచ్చింది జీవించటానికి, తప్పించుకోవడానికి కాదు. ‘ఆధ్యాత్మికత’ అంటే, ‘మీరు జీవితంలోని పైపై మెరుగులతో సరిపెట్టుకునేవారు కాదని, జీవిత మూలాల్లోకి వెళ్లి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారని’ సరికొత్తగా అర్థం చేసుకోవాలి. వైరాగ్యంతో మీరు జీవితాన్ని తెలుసుకోలేరు. పూర్తి ఆసక్తి చూపితేనే జీవితసారాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలరు. జీవితం మీద మీ ఆసక్తి ప్రస్తుతం ఉన్నదానికంటే చాలా ఎక్కువ కావాలి. అప్పుడే అసలైన ఆధ్యాత్మికతకు మార్గం సుగమం అవుతుంది. అంతేకానీ, జీవితాన్ని తప్పించుకుందామనుకుంటే మాత్రం మీరు తప్పు దారిలో ఉన్నట్టే లెక్క.
రవీంద్రనాథ్ ఠాగూర్‌కు ప్రకృతి అన్నా, జీవితం అన్నా చాలా ఇష్టం. ఆయన ముసలితనంతో మంచం పట్టాడు. అప్పుడు కొందరు స్నేహితులు ఆయన చుట్టూ చేరి ఇలా అన్నారు- ‘అవసాన కాలం సమీపించింది. కాబట్టి, భగవన్నామ స్మరణ చేసి భగవంతుణ్ణి ముక్తి కావాలని కోరుకోండి’. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ‘ముక్తిని నేనేం చేసుకోను. నాకు మళ్లీ మళ్లీ ఇక్కడకు రావాలని ఉంది. మీరే చూడండి, ఈ ప్రపంచమెంత అద్భుతంగా ఉందో. ఈ ప్రకృతి ఎంత దయకలదో చూడండి, నిజంగానే భగవంతుడుంటే ఈ ప్రకృతితో ఉండటానికి నన్ను మళ్లీ మళ్లీ ఇక్కడకే పంపమని అడుగుతాను’ అన్నాడు. అంతలా జీవితంతో మమేకమైన వారికే జీవిత పరమార్థం తెలుస్తుంది, మిగతా వారికి కాదు.
ప్రఖ్యాత శాస్త్రవేత్త న్యూటన్కూ ఇలానే జరిగింది. మృత్యువు సమీపించినప్పుడు ఆయన- ‘నాకు ఈ సైన్స్ అంటే ఏమీ తెలియదు. నేను సముద్రపు ఒడ్డున గవ్వలు ఏరుకోవటంతోనే నా జీవితాన్ని వ్యర్థం చేశాను. అసలైన సముద్రాన్ని ఇంకా అన్వేషించనే లేదు. నాకు సముద్రాన్ని అన్వేషించే అవకాశం మళ్లీ వస్తే బాగుండు..’ అన్నాడు. ఇలాంటివారంతా జీవితాన్ని బాగా ఆస్వాదించినవారు. అంతేకానీ, జీవితంపై నిరాసక్తతతో ఉన్నవారు కాదు. కనుక, నిజమైన ఆధ్యాత్మికతలోకి వెళ్లాలంటే, ముందు లభించిన ఈ జీవితాన్ని ఆస్వాదించండి, అప్పుడు ‘సత్యాన్వేషణ’ తేలికవుతుంది!
మనం మన మనస్సులో ఆలోచించేదంతా ఆధ్యాత్మికం కాదు. మీకు ఆధ్యాత్మిక ఆలోచనలు రావు. మీరు దేవుణ్ణి గురించి, స్వర్గం గురించి, మోక్షం గురించి ఆలోచించేదంతా ఆధ్యాత్మికత కాదు. ఆలోచన మానసికమైంది, అదెప్పుడూ ఆధ్యాత్మికత అవ్వదు. ఇది ఎలాంటిదంటే, నాకు ఒక ఆధ్యాత్మికమైన చిటికెన వేలుందనడం లాంటిదది. వేలు ఎప్పుడూ భౌతికమైనదే. అది కేవలం భౌతికం మాత్రమే కాగలదు. నేను నా శరీరాన్ని, నా చిటికెన వేలును, ఆధ్యాత్మిక ప్రక్రియకు అనుకూలమైన సాధనంగా మలచుకోవచ్చు. కానీ అంతమాత్రాన అవే ఆధ్యాత్మికం కాదు. అదొక మంచి భౌతికమైన చిటికెన వేలు మాత్రమే.
[9/3, 06:55] +91 73963 92086: అది అడ్డంక్కి లాగా ఐనా ఉండచ్చు లేదాఆవలికి ఓ ద్వారమైనా కావచ్చు . ఏదైనప్పటికీ, అది భౌతికం మాత్రమే.
భౌతికత ఆధ్యాత్మికతకు వ్యతిరేకం కాదు. మనకీ భౌతిక శరీరం ఉంది కాబట్టే మరో కోణం గురించి ఆలోచించగలుగుతున్నాం. లేకపోతే ఆ అవకాశమే లేదు. మనం ఇక్కడ భౌతికంగా ఉండకపోతే ఆధ్యాత్మిక ప్రక్రియకు అవసరమే రాదు. అందువల్ల ఆధ్యాత్మికతకు భౌతిక శరీరం ఒక ప్రాథమిక మార్గమే కాని అదే ఆధ్యాత్మికత కాలేదు. అదేవిధంగా మానసిక, భావోద్వేగ సంబంధమైనవి కూడా ఆధ్యాత్మికత కాలేవు. అవి జీవితంలోని భిన్నకోణాలు, వాటి విషయంలో తప్పూ లేదు, ఒప్పూ లేదు. వాటిని మనమెలా ఉపయోగిస్తామనే దానిపై అది ఆధారపడి ఉంటుంది. మనం ఈ శరీరాన్ని ఒక నిరోధంగా, ఒక ఉచ్చుగా ఉపయోగించవచ్చు లేదా ఒక ద్వారంగా ఉపయోగించవచ్చు. అదే విధంగా ఈ బుద్ధిని దుఃఖాన్ని సృజించే యంత్రంగా లేదా ఆధ్యాత్మిక సంభావ్యతకు సాధకంగా ఉపయోగించవచ్చు. కాని బుద్ధి, శరీరం, భావోద్వేగం ఆధ్యాత్మికం కాలేవు.
[9/3, 06:56] +91 98666 99774: మనకు బాహ్యంగా వున్న వివిధ వస్తువులు, పదార్థాలు, వనరులు, వీటితో మనం రెండు రకాలుగా వ్యవహారిస్తాము.
1)ఆయా వస్తువుల రూపురేఖలు ఏమిటి, వాటివల్ల లాభనష్టాలు ఏమిటి, ఎలా సొంతం చేసుకోవచ్చు, వాటితో నాకు సంబంధం ఏమిటి ,మొదలగు సమస్త సమాచారాన్ని సేకరించడం, తగు విధంగా వ్యవహరించడం.
ఉదా. పిచ్చి వాడు చెత్త, కాగితాలు ప్రోగేసినటలు, మనం వివిధ ఆస్థులు, వస్తువులు అవసరానికి మించి సమీకరించడం.
2) ఆయా వస్తువులు నాలో ఎలాంటి అనుభూతులు కలిగించ గలవు వాటి వల్ల సుఖకర లేదా దుఃఖకర అనుభూతులు ఏమైనా కలుగు తాయా అని విచారించి తదనుగుణంగా వ్యవహరిస్తాను.ఉదా. పిల్ల వాడు ప్రతీది నోట్లో పెట్టుకో ప్రయత్నిస్తాడు. వ్యసనపరులు, అప్పు చేసి పప్పు కూడు తినే వాళ్ళు.
మొదటిది అస్థిత్వ పర వ్యవహారం, రెండవది అనుభూతిపర వ్యవహారం.
ఇట్లు
వ్యవహారికుడు లేని వ్యవహారాలు
No comments:
Post a Comment