Sunday, September 4, 2022

ఎందుకీ జన్మ?ఎప్పుడు విముక్తి?

 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః 👏
🚩🚩నమః శుభోదయం 🚩🚩
విమలానంద బొడ్ల మల్లికార్జున్ 

*ఎందుకీ జన్మ?ఎప్పుడు  విముక్తి?* 
             
              జీవితం మీద మనకు విసుగు పుట్టినప్పుడు ‘ఛీ మనిషిగా ఎందుకు పుట్టాను రా బాబూ’ అని మనం అనుకుంటూ ఉంటాం. 
అసలు మనిషి జన్మ ఏమిటి, దీనికి విముక్తి ఎప్పుడు అనే విషయాలను తెలుసుకుందాం...

నిజంగా మానవ జన్మ అంత నీచనికృష్టమైనదా, అసలు మనం ఈ భూమ్మీద ఎందుకు పుట్టాం…? 
ఎందుకు చనిపోతున్నాం? చనిపోయాక ఎక్కడికి పోతాం? ఇలాంటి ప్రశ్నలన్నీ మనిషికి సర్వసాధారణంగా వస్తుంటాయి...

మనం అనుకున్నట్లుగా మనిషి జన్మ నీచమైనది కాదు, ఉత్తమోత్తమమైనది. 
‘పునరపి జననం, పునరపి మరణం’ అంటారు. 
జన్మ అంటే మళ్లీ పుట్టడం… అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టడమే జన్మ...
కానీ తిరిగి మానవ జన్మే వస్తుంది అని మాత్రం చెప్పలేం. ఎందుకంటే మనం ఎలాంటి జన్మ ఎత్తాలో మనం సంపాదించుకున్న జ్ఞానం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. 
కర్మ ఫలాలను బట్టే మనిషి జన్మ ఉంటుంది, మనిషి జన్మ అనేది దేవుడికి మనిషి చేరువ కావడానికి దొరికిన ఓ అపూర్వమైన అవకాశం. 
భక్తి మార్గంలో ఉండి వైరాగ్యం చెంది భగవంతుడిని చేరుకోవడానికి మనిషి జన్మ తప్పితే మరో జన్మలో ఆ అవకాశం లేదు. 
అయినా పూర్వ జన్మ పుణ్య ఫలంతో సాలీడు, ఏనుగు, పాము, నెమలి వంటివి దేవుడిని పూజించి ముక్తి పొందినట్టు మన పురాణ గ్రంథాలు తిరగేస్తే తెలుస్తుంది...

కానీ మనిషిగా పుట్టిన వారంతా భగవంతుడికి దగ్గరయ్యే మార్గాన్ని నిజంగా ఉపయోగించుకుంటున్నారా లేదా అనేది మనకు మనం ఆలోచించుకోవాలి. 
మనిషి పుట్టినప్పటి నుంచి తాను చెయ్యాల్సిన మంచి పనులు చేయక తప్పదు, సంసార సాగరంలో ఈదుకుంటూ పోవడం తప్ప మనకు మరో దారి లేదు, ఇందులో మరో దారి లేదు...

’మనుషులకేనా చెట్లకు ఉండవా.....ఇవన్నీ మానవ మాత్రులకేనా చెట్టూ చేమలకు ఉండవా?’ అని మీరనుకోవచ్చు. 
అక్కడికే వద్దాం, ఒక చెట్టుకు మొగ్గ వచ్చింది, అది పువ్వై ఆ తర్వాత కాయగా మారింది, పండిపోయి కొంతకాలానికి అది నేల రాలిపోతుంది. 
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే పిందెగానో, కాయగానో ఉన్నప్పుడు దానిని కొమ్మ నుంచి కోసి వేరు చేస్తున్నప్పుడు అది ఉన్న చోటు నుంచి నీరు కారుతుంది.

కాయ మొదలు లోనూ ఆ నీటి తడిని మీరు చూడవచ్చు, కానీ పండు రాలినప్పుడు కొమ్మలో ఎలాంటి నీటి తడి ఉండదు, పండు రాలిన చోట కూడా నీటి తడి ఉండదు. 
కానీ కాయ కోస్తున్నప్పుడు నీటి తడి ఉండటానికి కారణం, ‘అయ్యో మరిన్ని రోజులు నన్ను అంటిపెట్టుకుని ఉంటే అది పండు అయ్యేది కదా’అని చెట్టు కొమ్మ కంట తడి పెడుతుంది...
కాబట్టి అక్కడ నీటి తడిని మనం చూస్తుంటాం...

అలాగే కాయ మొదలులోనూ ఆ నీటి తడి ఉంటుంది,
 ‘అయ్యో ముందుగానే నన్ను చెట్టు కొమ్మ నుంచి వేరు చేసేశారు కదా’ అని కాయ కూడా బాధపడుతుంది. 
కానీ పండు విషయంలో అలా కాదు…. కాయ పండి రాలుతున్నప్పుడు చెట్టు కొమ్మన నీటి తడి కనిపించదు,
 పండు మొదలు లోనూ నీటి తడి ఉండదు. రెండింటిలోనూ ఓ పరిపక్వత వస్తుంది. 
దాని బంధం అయిపోయింది కాబట్టే పండు రాలిపోయిందని చెట్టు కొమ్మ అనుకుంటుంది, పండు కూడా తన కాలం ముగిసినట్టు అనుకోవడంతో అటూ ఇటూ రెండువైపులా బాధ అనేది ఉండదు.. అలాంటిదే మనిషి జీవితం కూడా...
..... 

    జై గురుదేవ్

No comments:

Post a Comment