🙏🌺🌿🌸🌴🌼🌺🌿🌸🌼🌸🌿🙏
#పంచారామాలు" అనగా ఏమిటి
#ఈ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి మరియు ఈ దేవాలయాల విశిష్టత గురుంచి విపులంగా "హితోక్తి" ప్రేక్షకుల కోసం...
#మీరు నలుగురుతో పంచుకోండి....
"ఓం నమః శివాయ నమః"...
#ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధమైన "శైవక్షేత్రాలను", "పంచారామాలు' అని పిలుస్తారు. 'పంచారామాలు' ఏర్పడుటకు, స్కందపురాణంలో ఇలా వివరించబడి యున్నది..
#పూర్వం.. తారకాసురుడు అను రాక్షసుడు, 'శివుని' గురించి ఘోర తపస్సు చేసి 'శివుని' ఆత్మలింగము సంపాదిస్తాడు. #దీనితో వీర గర్వముతో, దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా, ఇందుకు దేవతలు, విష్ణుమూర్తిని ప్రార్ధించగా, 'శివపార్వతుల' వల్ల కలిగిన కుమారుడు "కుమారస్వామి" వల్లనే తారకాసురుని వధించుట సాధ్యపడుతుందని తెలిపి "కుమారస్వామిని" యుద్ధానికి పంపుతారు. #యుద్ధమునందు "కుమారస్వామి", తారకాసురుని కంఠంలో గల 'ఆత్మలింగమును' చేధిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ 'లింగమును' చేధిస్తాడు. #దీనితో తారకాసురుడు మరణిస్తాడు.
#చేధిoచే సమయంల్లో, ఆ.. 'ఆత్మలింగము' వేరై, ఐదు ప్రదేశములలో పడుతాయి. తరువాత వాటిని ఆ...యా...ప్రదేశాలలో, దేవతలు లింగ ప్రతిష్ఠ కావిస్తారు.. కనుక ఈ అయిదు 'క్షేత్రాలను', 'పంచారామాలు' అని పిలుస్తారు..
#1. దాక్షారామము :
#పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని "భీమేశ్వరుడు" అని పిలుస్తారు.
స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పై అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు. #ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు మరిఇయు సగభాగం నలుపుతో ఉంటుంది.
#ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు. #ఈ ఆలయం చాళుక్యరాజయిన, భీముడు నిర్మించాడని పురాణాలలో చెప్పబడి యున్నది. # అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వకాలంలో ఎంతో మంది దేవతలు, రాజులు స్వామి వారిని దర్శించుకొని, తరించారని తన 'భీమేశ్వర పురాణంలో' చెప్పబడి యున్నది. #ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ "మహాశివరాత్రి" పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
#2. అమరారామము :
#పంచారామల్లో రెండవదైన 'అమరారామము', గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానదీతీరమునందు వెలసినది. ఇక్కడ స్వామిని "అమరేశ్వరుడు" అని పిలుస్తారు. గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో, తెల్లగా మెరుస్తూ ఉంటుంది.
#ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది.
అమరేశ్వరుడైన 'ఇంద్రుడు' చేత ప్రతిష్టించి ఈ ఆలయానికి తన నగరమైన అమరావతి పేరునే పెట్టారు అని పురాణాలలో చెప్పబడి యున్నది.
#3. క్షీరారామము :
#క్షీరారామము, పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ 'శివుని' మూర్తిని "శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి" అని పిలుస్తారు. #ఇక్కడ స్వామివారిని త్రేతాయుగ కాలంలో 'సీతారాములు' కలిసి ప్రతిష్ఠించారట. #ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది.
'శివుడు' తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమి నుండి పాలధార వచ్చిందట. క్షీరం అనగా పాలు, దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది.
#క్రమంగా 'క్షీరపురి' కాస్తా 'పాలకొల్లుగా' మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. #ఆలయం 125 అడుగుల ఎత్తులో '9' గోపురాలుతో కట్టబడింది.
#4. సోమారామము :
#పంచరామాల్లో నాల్గవదైన "సోమారామము". పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని "సోమేశ్వరుడు" అని పిలుస్తారు. #ఇచ్చట 'శివలింగానికి' ఒక ప్రత్యేకత ఉంది. మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే 'శివలింగం', అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది.
#ఇక్కడ స్వామిని 'చంద్రుడు' ప్రతిష్టించాడు. చంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి 'సోమారామము' అని పేరు వచ్చింది.
#5. కుమారభీమారామము :
#పంచారామాల్లో చివరిది, 5వది అయిన 'కుమారభీమారామము', తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు. #ఇక్కడ స్వామిని "కాల బైరవుడు" అని పిలుస్తారు.
#ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన, చాళుక్య రాజయిన భీముడు ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి 'శివలింగం' సున్నపురాయితో చేసినదిలాగా ఉంటుంది. #ఈ ఆలయంలో "మహశివరాత్రి" ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
#ఈ అయిదు ఆలయాలను, ఒకే రోజు, అంటే, సంధ్యా సమయంల్లో మొదలుబెట్టి, సాయంకాలం లోపు దర్శించుకొన్న మోక్షము లభిస్తుంది అని పెద్దలు చెబుతారు.
#"ఓం నమః శివాయ నమః"... "ఓం నమః శివాయ నమః"...🙏🙏🙏
శుభోదయం🌹🌹🌹
#సర్వోజనా సుఖినోభావంత్🙏
🙏🏼🌼🌴🌸🌿🌺🙏🌻🍀🙏🌻🙏
No comments:
Post a Comment