Friday, October 21, 2022

ప్రార్థన అనేది ఒక మానసిక భోజనం లాంటిది.

 🕉️ *జై శ్రీమన్నారాయణ🕉️* 🌺🙏 *ఓం నమో భగవతే వాసుదేవాయ* 🙏🌺

*_🌴 ప్రార్థన అనేది ఒక మానసిక భోజనం లాంటిది. శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని చేకూర్చడానికి ఆహారం ఎలా తీసుకుంటున్నామో, మనస్సు కూడా ఆరోగ్యముగా, శక్తివంతముగా స్వచ్ఛముగా ఉండడానికి ప్రార్థన కూడా అంతే అవసరముగా చేస్తుండాలి. ప్రార్థన అనేది దేవుని నిర్ణయాన్ని మార్చలేదు కానీ మన మనస్సుని ప్రభావితం చేసి శాంతిని చేకూరుస్తుంది. కోరికలతో చేసే ప్రార్థనలు దైవమును కదిలించలేవు. అవి వృథాగా పోవాల్సిందే! కానీ దిక్కుతోచని, అతి క్లిష్ట పరిస్థితుల్లో హృదయాంతరాళం నుండి పొంగిపొరలి వచ్చే ప్రార్థనలు వెనువెంటనే దేవుని చేరతాయి. ఫలితాలు కూడా వెనువెంటనే అనుగ్రహించబడవచ్చు కూడా. అయితే కొన్నిసార్లు ఫలితాలు సమయ సందర్భాలకు అనుగుణముగా ఇవ్వడం జరుగవచ్చు. అది కూడా మన మంచికే తప్ప చెడు ఏమీ ఉండదు. ఏది ఏమైనా సరే ప్రార్థనను మన జీవితంలో ఒక భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. దీని వలన ఇహలోక శాంతులే కాక పరలోక శాంతులు కూడా సొంతమవుతాయి. 🌴_*🌺✍️

No comments:

Post a Comment