Saturday, December 21, 2024

****ఆప్తవాక్యాలు 🍁☘️ 50. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

50. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్

భాస్కరుని ద్వారా ఆరోగ్యాన్ని కోరుకోవాలి

భూమికీ, భూమిపైనున్న ప్రాణికోటికి ఏకైక శక్తిప్రదాత సూర్యభగవానుడు. ఆయన ద్వారా ప్రాణశక్తినీ, ఆరోగ్యాన్నీ సంపాదించుకుంటున్నాం. అందుకే వ్యాధి నివారణకు వివిధ విధాలుగా సూర్యశక్తిని గ్రహించే విధానాలు మన జీవన పద్ధతుల్లో భాగాలయ్యాయి.

ప్రాతఃకాలాన లేచి సూర్యుని ఉపాసించడం ఈ దేశంలో అనాది ఆచారం. ఆదిత్యుని కేవలం గ్రహంగా, ఒక జడవస్తువుగా కాక చైతన్యమూర్తిగా దర్శించిన అచ్చమైన
వైజ్ఞానిక దృష్టి మన వేదమంత్రాలలో పల్లవించింది. అదే పురాణాలలో, రామాయణాది ఇతిహాసాలలో ఆదిత్యహృదయాన్నిఆవిష్కరించింది.

(సూర్య నమస్కార ప్రక్రియ యోగాభ్యాసంలో ప్రధాన భాగమై, ప్రపంచ దేశాలకు కూడా ఆరోగ్యసేతువుగా మారింది.
సూర్యునిలోనున్న భగవత్ శక్తిని గ్రహించి, తద్వారా ఆరోగ్యాన్ని సాధించే విధానాలు మన పురాణ గ్రంథాలు చాలా అందించాయి.)

హృద్రోగాలనూ, చర్మవ్యాధులనూ, నేత్ర జాడ్యాలను పరిహరించే సూర్యకిరణ శక్తిని గ్రహించే మార్గాలను ఆయుర్వేదం, యోగవిద్య, ప్రకృతి చికిత్సా విధానాలు పలువిధాలుగా ఏర్పరచాయి.

భౌతిక సౌరశక్తినే కాక, సూక్ష్మమైన దైవీయ భాస్కర చైతన్యాన్ని స్పందింపజేసి తద్వారా అద్భుత ఫలితాలను సాధించే సమున్నత ప్రక్రియలు సూర్యోపాసనలో
ప్రస్తావించారు. గ్రహగతుల్ని నిగ్రహించే గ్రహరాజుని అధిష్ఠించి ఆదిదైవమైన
రుద్రచైతన్యం, నారాయణ స్వరూపం, బ్రహ్మలక్షణం దీపిస్తున్నందున 'విరించి
విష్ణుశివాత్మకుని'గా దివాకరుని కీర్తించారు.

ఆదివారం 'రవిహోర'తో సూర్యోదయం చిగురిస్తుంది. కనుక ఆ రోజును
'భానువాసరం'గా పేర్కొన్నాం. ఈ అంశాన్నే ప్రపంచపు అన్ని కాలగణనాలు అంగీకరించి గ్రహించాయి.

ఆదివారంనాడు నియమంగా గడపడం, సూర్యస్తోత్రాలను పారాయణం చేయడం, పాయసాన్ని(గోధుమనూక వాడడం శ్రేష్ఠం) రవికి నివేదించడం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. రక్తచందనం, ఎఱ్ఱనిపూలు సూర్యపూజలో వినియోగించాలి.

స్త్రీ,తైల, మధు, మాంసాలకు ఆదివారం దూరంగా ఉండాలి.

అలాగే తిథులలో సప్తమి, పర్వాలలో సంక్రమణం, మాఘశుద్ధ సప్తమి (రథసప్తమి) రవి ఉపాసనకు శ్రేష్ఠదినాలు.

సూర్య నమస్కార ప్రక్రియ యోగాభ్యాసంలో ప్రధాన భాగమై, ప్రపంచ దేశాలకు కూడా ఆరోగ్యసేతువుగా మారింది.

సూర్యునిలోనున్న భగవత్
శక్తిని గ్రహించి, తద్వారా ఆరోగ్యాన్ని సాధించే విధానాలు మన పురాణ గ్రంథాలు చాలా అందించాయి.

నిత్యం జపించదగిన మంత్రాలు -

"అచ్యుత అనంత గోవింద”

ఈ మంత్రాన్ని అనుక్షణం జపిస్తే రోగాలు నివారణ అవుతాయి. అదేవిధంగా సూర్యగ్రహానికి అధిదేవత రుద్రుడు. అందుకే శివారాధన, శివార్చన, శివనామజపం
ఆరోగ్యప్రదం. క్రమంగా ఐశ్వర్యాన్నీ కైవల్యాన్నీ ప్రసాదిస్తాయి.

మృత్యుంజయునిగా, వైద్యనాథునిగా అర్చింపబడే శివుని ఈ క్రిందినామాలతో నిత్యం స్మరిస్తే ఆరోగ్య సమృద్ధి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

బాలాంబికేశాయ నమః - వైద్యేశాయ నమః
భవరోగహరాయ నమః - మృత్యుంజయాయ నమః||
-
శివ కేశవులకు అభేదం మన భారతీయ వైదిక హృదయం. అందుకే పై విష్ణునామాలు మూడు, ఈ శివనామాలతో కలిపి జపించి ఆరోగ్య సంపదనుసాధిద్దాం.                  

No comments:

Post a Comment