*మనం ఎంత గొప్ప వాళ్ళయినా...ఏదో ఒక రోజుకి మనం ఉన్న ఇల్లు,* *స్థలము,మనుషులు.అందరూ వదిలేసి* *వెళ్లిపోవాల్సిందే.మనకంటూ సంబంధించింది ఏది మనతో రాదు.*
*ఈ మనుషులు. ఈ ఆలోచన.. ఈ జీవితం. అంతా....మాయ సంకల్పం.*
*కోరికలు ఉరవడిలో కొట్టుకుపోయే మనసుకి ఆలోచించే సమయం అసలే దొరకట్లేదు.*
*కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక అదేంటి అప్పుడే నా లైఫ్ ఇంత* *అయిపోయిందా...అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే.... జ్ఞాపకాలు గా మిగిలిన గుర్తులు మాత్రం ఉంటాయి.*
*కొంతమంది స్వార్థపరులు మిగిల్చిన కన్నీరు. మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మనం పడిన కష్టం. గుర్తుకు వచ్చిన ప్రతీ సారి గుండెను పిండేస్తూ ఉంటాయి.*
*అవి మనకు తప్ప ఇంకెవరికి గుర్తుండదు.వారికి ఏదైతే అవసరమో దానికోసమే వాళ్ళ కోరుకున్నది జరిగేవరకు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. దాన్ని ప్రేమ, ఆప్యాయత అనుకుని పొరపడితే... ఆఖరికి బాధపడేది, గాయపడేది శూన్యమై మిగిలిపోఏది మనమే.*
*వీడు నావాడు, వాడు నావాడు, అనుకున్న వాళ్లు మనలని ఏదో ఉద్ధరిస్తారనుకోవటం మన పిచ్చి, మన పొరపాటు.*
*మనసు పిచ్చిది. అది సాగరంలా పరుగులు పెడుతూనే ఉంటుంది. కోరికలు కెరటాలై ఎగసిపడుతూనే ఉంటాయి.*
*ఆ సముద్రాన్నికి కూడా ఆనకట్ట ఉనట్టే నీ ఆలోచనలకు కూడా ఒక అనకట్టు వేసుకో. అందులో మంచి ఏంటో,చెడేంటో అన్నది విచక్షనతో నిర్ణయం తీసుకుని అడుగులు వెయ్యి.*
*నీ జీవిత పయనం లో ఎంతమందిని చూసావో...ఎంతమందితో మాట్లాడావో....ఎన్నో వేల కోట్ల కిలోమీటర్లు దాటుకుంటూ ప్రయాణం చేసావో.....*
*నీకు తెలియని,నువ్వు చూడని వసంతాలేమున్నాయ్.*
*రుతువులు ఎన్ని* *మారినా....మారని మన* *తలరాతలు*
*అలానే ఉన్నాయ్.*
*మనిషి జీవితంలో కొన్ని ఇవ్వాలి ,మరికొన్ని తీసుకోవాలి.*
*స్వార్థం ఉండొచ్చు.కోరికలు ఉండొచ్చు. మోసంతో కూడిన ప్రవర్తన ఉండకూడదు...*
No comments:
Post a Comment