కులము లేని వాడు కలిమిచే వెలయును
కలిమిలేనివాని కులము దిగును
కులముకన్న భువిని కలిమి ఎక్కువ
సుమీ విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: తక్కువ కులము వాడైనప్పటికి ధనమున్నట్లయితే అతడు గౌరవాన్ని పొందును. ధనము లేనట్లయితే ఉన్నత కులస్థుడు కూడా రాణింపదు. కాబట్టి కాలముకంటే ధనము ఎక్కువ.
ఏమి గొంచువచ్చె నేమితాఁ గొనిపోవుఁ
బుట్టువేళ నరుడు గిట్టువేళ
ధనము లెచటికేగు దానెచ్చటికినేగు
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం: మనిషి పుట్టీంపుడు తన కూడా తీసికొని రాలేదు. చనిపోయినప్పుదు కూద ఏమి తీసికొని వెళ్ళలేడు తానెక్కదికిపోతడో, సంపదలు ఎక్కడికి పోతాయో తెలియక లోభియై గర్వించటం వ్యర్ధము.
తనువ దెవరి సొమ్ము తనదని పోషించి
ద్రవ్య మెవరిసొమ్ము దాచుకొన cగ
ప్రాణ మెవరిసొమ్ము పారిపోవక నిల్వ
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: తనస్వంతమని పోషించుటకు ఈ సరీరము ఎవరిదీకాదు. దాచినపెట్టుటకు ధనము ఎవరిదీకాదు. పారిపోకుండ నిలుచుటకు ఈ ప్రాణము ఎవరిదీకాదు. ఇవి ఏమియు శాశ్వతములు కావు.
No comments:
Post a Comment