Saturday, December 21, 2024

 🔥అంతర్యామి 🔥

# పరిణతికి సోపానం...

🍁ఈ శతాబ్దాన్ని శాస్త్రవేత్తలు 'ఆలోచనల శకం' అంటున్నారు. ఆలోచనల ప్రవాహాన్ని జలధారతో పోలుస్తారు. నీరు పోస్తుంటే కొసల్లో కోసుముత్యాల్లాంటి బిందువులు ఏర్పడతాయి. ఆలోచనలూ అంతే. తెగిపోతూ కొనసాగుతూ ఉంటాయి. ఒకదానికి మరోదానికి మధ్య లిప్తపాటైనా శూన్యస్థితి ఉంటుంది. ఆ వ్యవధి పెరిగేందుకు యోగులు ధ్యాన సాధన చేస్తారు. ఆలోచనలు లేని స్థితిలో ఎక్కువసేపు నిలిచేందుకు ప్రయత్నిస్తారు.

🍁ధ్యానం సిద్ధించినప్పుడు నూనె ధారలా ఎక్కడా తెగిపోకుండా సాగుతుంది. ధ్యాత(ధ్యానం చేసేవారు), ధ్యానం, ధ్యేయం ఒక్కటయ్యే స్థితి పరమానందమయమని చెబుతోంది గీత. ఆరో అధ్యాయంలో పేర్కొన్న 'ఆత్మ సంయమయోగ'మే ధ్యానానికి గమ్యం. సాధన ద్వారా మచ్చిక చేసుకొన్నప్పుడే- మనసు మనకు సహకరిస్తుంది.

🍁సాధన లేకపోతే మనసుకొక ప్రత్యేక అస్తిత్వం ఏర్పడుతుంది. మనకన్నా వేరుగా ఉండి మనపై పెత్తనం చేస్తుంది. ఆ సమయంలో మనసు ఏ వృత్తిలో ఉంటే- మనిషీ అదే వృత్తిలో దానికి లోబడి ఉంటాడు. ధ్యాన సాధన అలవడితే- ఇంద్రియాలు, మనసు వాటి ఇష్టానుసారంగా కాకుండా- మనయందే, మనతోనే, మనలోనే ఉంటాయి.

🍁క్రోధావేశాలను చాలామంది అణచిపెడతారు, ధ్యానులు విడిచి పెడతారు. అణచివేత ఉన్నచోటే తిరుగుబాటు ఉంటుంది. కడుపులో మంట, గుండెదడ, రక్తపోటు.. వంటివి అలా అదిమిపెట్టిన కోపతాపాల ప్రతిరూపాలు. తిరుగుబాటు చిహ్నాలు. ధ్యానంలో అవి క్రమంగా సమసిపోతాయి.

🍁జీవక్రియలు నెమ్మదిస్తాయి. ధ్యానం కారణంగా మెదడు నుంచి విడుదలయ్యే డోపమైన్, సెరిటోని వంటి ఆహ్లాద రసాయనాలు దేహాన్ని ఉల్లాసంగా ఉత్తేజంగా ఉంచుతాయి. ధ్యానం మనిషికి చేసే మహోపకారమది. దానివల్ల శారీరక మానసిక ఆధ్యాత్మిక స్థితుల్లో సాధికారత, పరిపక్వత ఏర్పడతాయి. భావోద్వేగ సంయమనం కుదురుతుంది. దాని రుచి మరిగిన మనసుకు- ధ్యానం 'మంచి వ్యసనం'గా మారుతుంది. క్రమంగా అది స్వభావంగా రూపొందుతుంది. బతుకు యాంత్రికంలోంచి- ఆస్వాదనలోకి మారుతుంది. ఏకాగ్రతతో నడుస్తుంది. జీవనశైలిలో అలవోకగా కుదురుకొనే మానసిక సంయోగం (మైండుల్నెస్)- బతుక్కి పరిపూర్ణతను ప్రసాదిస్తుంది.

🍁అలా పరిణతిని సమగ్రతను ప్రతిబింబించే వ్యక్తిత్వాన్ని ఎపిక్టేటస్ అనే మనస్తత్వవేత్త 'స్ట్సొజం'గా పేర్కొన్నాడు. నిన్నటి దిగుళ్లో, రేపటి బెంగలో కాకుండా నేటి వర్తమానంలో... అంటే, స్వీయ వాస్తవిక స్థితిలో మనసును నిలపాలి. ధ్యానం బతుకులో భాగమైనప్పుడే అది కుదురుతుంది. 'యోగీభవ అర్జున!' అని గీతాచార్యుడు నిర్దేశించిన యోగస్థితి అలాంటిది.. అది రుషీత్వపు స్థాయి. స్వభావరీత్యా మనిషి పరిపూర్ణుడై జీవితంలో ప్రతి క్షణాన్ని అనుభూతించాలి.. ఆస్వాదించాలి.. ఆనందించాలి. దానికి ధ్యానం అద్భుత ఉపకరణం. అది ఎదుగుదలకు సోపానం! ప్రార్ధన అంటే దైవానికి నివేదన. ధ్యానమంటే దైవమిచ్చే దీవెన!🙏

-✍️ ఎర్రాప్రగడ రామకృష్ణ

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

# Stairway to Maturity...

*** Scientists call this century 'Age of Ideas'. The flow of ideas is compared to a stream. When water is poured, drops like pearls are formed in kosal. Thoughts are the same. They keep breaking off. There is a gap between one and the other. Yogis practice meditation to increase that duration. They try to remain in a state of no-thoughts for a long time.

When meditation is done, it flows like a stream of oil without breaking anywhere. The Gita says that the state of union of dhyata (meditator), meditation and meditation is blissful. The goal of meditation is 'Atma Sanyamayoga' mentioned in the sixth chapter. Only when tamed through practice - the mind helps us.

* If there is no Sadhana, the mind becomes a separate entity. It is separate from us and dominates us. Whatever profession the mind is in at that time - man is subject to it in that profession. If we practice meditation - the senses and the mind are not at their will - we are, with us, in us.

** Anger is suppressed by many, the meditator abandons it. Where there is oppression there is rebellion. Stomach burning, heart palpitations, blood pressure, etc. are the replicas of such pent-up anger. Symbols of Rebellion. In meditation they gradually disappear.

Metabolism slows down. Due to meditation, the brain releases feel-good chemicals like dopamine and serotonin which keep the body happy and excited. Meditation is a great thing for man. It results in empowerment and maturity in physical, mental and spiritual states. Emotional restraint is lost. To the mind whose taste is boiled - meditation becomes a 'good addiction'. Gradually it becomes natural. Life changes from mechanical to enjoyable. Runs with concentration. Min

No comments:

Post a Comment