*మనం వెతుక్కుంటూ వెళ్లిన ప్రేమ ఎంతకాలం మనకు తోడు ఉంటుందో తెలీదు కానీ మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ మాత్రం మన మరణం వరకు తోడు ఉంటుంది...*
*పదునైన వ్యక్తిత్వానికి పదిహేడు సూత్రాలు:-*
1. 🦋 *విలువ లేని చోట మాట్లాడకు...*
2. 🦋 *గౌరవం లేని చోట నిలబడకు...*
3. 🦋 *ప్రేమ లేని చోట ఆశ పడకు...*
4. 🦋 *నీకు నచ్చని ఇష్టం లేని విషయాలకి క్షమాపణ చెప్పకు...*
5. 🦋 *నువ్వు మెచ్చని వాటికి సంజాయిషీలు ఇవ్వకు...*
6. 🦋 *నిర్లక్ష్యం వున్న చోట ఎదురు చూడకు...*
7. 🦋 *అలక్ష్యం వున్న చోట వ్యక్త పరచకు...*
8. *😎 వ్యక్తిత్వం తాకట్టు పెట్టి పాకులాడకు...*
9. 🦋 *ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు...*
10. 🦋 *చులకనగా చూసే చోట చొరవ చూపకు...*
11. 🦋 *జాలి పడి ఇచ్చే పలకరింపులకి, ప్రేమకి జోలె పట్టకు...*
12. 🦋 *భారం అనుకునే చోట భావాలు పంచుకోకు...*
13. 🦋 *దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు...*
14. 🦋 *నిజాయతీని గుర్తించని చోట నిముషం కూడా వృధా చేయకు...*
15. 🦋 *ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి వుంటుందని భ్రమ పడకు...*
16. 🦋 *ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు...*
17. 🦋 *నీది కాని దేని మీదా నిన్ను తినేసేంత ప్రేమ, అభిమానం ఏదీ పెంచుకోకు...*
*అధ్యాత్మికం ఆనందం*
🪷🦋🪷 🦋🪷🦋 🪷🦋🪷
No comments:
Post a Comment