Friday, December 20, 2024

*🙏శాంతి - శాంతి - శాంతి: - అనగా అర్థం ఏమిటి??*


🌸మన వేదాలలో తెలుపబడిన ఏ మంత్రం లోనైనా శాంతి మంత్రాలన్నీ కూడా చివర్లో ఓం శాంతి.. శాంతి.. శాంతిః అని ముగుస్తాయి, 
దాని అర్థం ఏమిటి??? - దాని వలన లాభం ఏమిటి??? - ఒకసారి పరిశీలిద్దాం..

🌿ఏదో ఒక సందర్భంలో ... వేద పండితులు ... ఈ శాంతి మంత్రాల్ని పఠించడం మనందరం వినే ఉంటాం ... శాంతి మంత్రంలో " శాంతి " పదాన్ని మూడు సార్లు ఎందుకు ఉచ్చరిస్తారో  తెలియదు..

🌸కానీ అది విన్నప్పుడల్లా మనం కూడా ఉచ్చరిస్తాము, కానీ ఎందుకో తెలియదు...మనుషులకు మూడు రకాల ఉపద్రవాలనుండీ ప్రమాదం ముంచుకొస్తుంది

🌿1.ఆది దేవిక, 2.ఆది భౌతిక, 3.ఆధ్యాత్మిక..ఇక వీటి వివరాలు పరిశీలిద్దాము...

🌸మొదటి "శాంతి" పదం మనం మన చుట్టూ ఉన్నవారు, పరిసరాలు, అంతా బావుండాలని, శారీరిక , మానసికపరంగా సంభవించే ఉపద్రవం ( అనారోగ్యం ) నుంచీ ఉపశమనం పొందడానికి, అందరికీ దేవుని అనుగ్రహ, ఆశీస్సులు ఉండాలని, ప్రార్థించేదే... దీన్ని "ఆదిదేవిక" అంటారు.

🌿రెండవ "శాంతి" పదం ఇతర జీవరాశులనుండీ, మనుష్యులు నుండీ ఏవిధమైన ఆపదలు / ముప్పు సంభవించకుండా సురక్షితంగా ఉండటానికి, దీన్ని "ఆదిభౌతికము" అంటారు,

🌸మూడవ "శాంతి" పదం ప్రకృతి పరంగా సంభవించే (భూకంపాలు / అగ్నిప్రమాదాలు / వరదలు / తుఫాన్లు మొదలగునవి) ఉపద్రవాలు వలన ఏవిధమైన ఆపదలు / ముప్పు కలగకుండా ఉండటానికి. దీన్ని "ఆధ్యాత్మిక" అంటారు,

🌿ఈ మూడు ఉపద్రవాలనుండీ రక్షించమని వేడుకుంటూ "శాంతి" మంత్రం చివర్లో "శాంతి" పదాన్ని మూడు సార్లు ఉచ్చరిస్తారు..స్వస్తి..🚩🌞🙏

 🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

No comments:

Post a Comment