Friday, December 20, 2024

 *భక్తుడు - భగవంతుణ్ణి కోరికలు కొరవచ్చా??*

*మనకు నిర్మలమైన నిశ్చలమైన మనస్సుతో పూజ చేయాలి, స్తోత్రాలు పటించాలి, కానీ మనము భగవంతుడుని అది కావాలి, ఇది కావాలి అని అడగవద్దు".*

*మనసులో భక్తి, ప్రేమ, విశ్వాసాలు వృద్ధి చేసుకోవాలి, అయన ఇచ్చినది స్వీకరించడానికి సిద్ధపడి ఉండాలి!!!.*🙏🙏🙏

*రాముడు వచ్చి తన అంత్యక్రియలు నిర్వహించాలని జటాయువు కోరుకుందా?* 

*శబరి అడిగిందా రాముడు తన దగ్గరకు రావాలని, తన కోరిక ఫలించాలి అని!!!.*

*కృష్ణుని కుచేలుడు అడిగాడా తనకు సంపదలు ఇవ్వమని ?* 

*వారిలో ఉండిన ప్రేమ, భక్తి, విశ్వాసాలే భగవంతుణ్ణి వారి చెంతకు రప్పించాయి.*🙏🙏🙏

*మన మనసులో భగవంతుని పట్ల దృఢమైన భక్తి, ప్రేమ విశ్వాసాలు ఉంటే మనము ఎదీ అడగనవసరం లేకుండానే ఆయనే స్వయంగా అన్నీ సమకూరుస్తాడు.*🙏🙏🙏

*యాచించడం నిజ భక్తుని లక్షణం కాదు...!!*
*తల్లి, తండ్రి తన బిడ్డలకు ఏమీ కావాలో అడిగితేనే ఇస్తారా!! కాదు కదా !! ...*

 అలానే సర్వస్వం ఆయనే అనుకున్నప్పుడు ఇంకా ఎందుకు అడగాలి??...

*"మన మనసులో భగవంతున్ని నిలుపుకొంటే - సమస్తమూ మన చెంతకే వచ్చి చేరుతుంది...!!" ఇది సత్యం. ఇదియే సత్యం.*

No comments:

Post a Comment