Friday, December 20, 2024

 🪷 సత్సంగ మహిమ 🪷

మహాత్ములు ఎక్కడైతే ఉంటారో ఆ వాతావరణం యొక్క ప్రభావము అసంఖ్యాక మనుష్యులు పై పడుతుంది. అలాగే మహా పురుషులతో ఏమాత్రం సరితూగని సామాన్య వ్యక్తీ అయినప్పటికీ ఆ వ్యక్తి యొక్క దృడవిరోధ భావమువలన మహా పురుషుడి ప్రభావము ఆ వ్యక్తి మీద ఉండదు.
ఎవరి ప్రభావం ఎవరిమీద ఎంత?, ఎలా ఉంటుంది? అనేది ఒక రకమైన కుస్తీ లాంటిది. ధారణ శక్తి, యోగ్యత, ఆకర్షణ శక్తి అధికంగా ఉన్న వ్యక్తి ఇతరులను తన వైపు ఆకర్షించి ప్రభావితం చేస్తాడు. ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలనే దృష్టితో ఏకాగ్రతతో సత్సంగం చేసినట్లయితే దాని ఫలితము చాలా అద్భుతంగా ఉంటుంది.

సత్సంగం యొక్క లాభాన్ని వినయంతో పొందవచ్చు. ఉత్తమ ఆలోచన పరులు ఉత్తమ మనస్కులైయిన వ్యక్తుల దగ్గరగా ఉండే అవకాశం కోసం వెతుకుతూ ఉంటారు. ఎక్కడ ఇలాంటి ప్రసంగాలు జరిగినా వాటి లాభాన్ని పొందే ప్రయత్నాలు చేయ్యాలి. ఒకవేళ నీ పని పాటలు, ఉండడానికి కావలసిన ఏర్పాట్లు గొప్ప పురుషుల వద్దనే కుదిరితే, ఎన్ని కష్టాలు కలిగిన సహించి వారివద్దనే ఉండాలి. ఎందుకంటే దీనివల్ల కలిగే లాభము గుణించలేనిది. సత్సంగం యొక్క మహిమను వర్ణించడం మన శక్తికి మించిన పని. స్పర్శమనితో సత్సంగం వలన ఇనుము బంగారంగా మారుతుంది. ఆత్మ సత్సంగం వల్ల జీవాత్మ పరమాత్మగా మారుతుంది. ఇదే మహాపురుషుల మహిమ, వాక్ శక్తి.

🪷 యుగ ఋషి 🪷పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్య గారు 🪷
🕉️🪷🙏🙏🙏

No comments:

Post a Comment