Thursday, January 30, 2025

 నేటి నుండి…


       *మాఘ మాసం ప్రారంభం*


#మాఘ మాస విశిష్టత:

మన పంచాంగం ప్రకారం, కార్తీక మాసం తర్వాత అంత ప్రాముఖ్యత మాఘ మాసానికి ఇస్తారు.

మఘ నక్షత్రంలో చంద్రుడు ఉండే కాలం కనుక కూడా దీనికి మాఘ మాసం అనే పేరు వచ్చింది.

అంతేకాదు, ఈ నెలలోనే ఆ పరమేశ్వరుడు లింగ రూపం ధరించాడని ప్రతీతి, 
ఇక సంస్కృతంలో మాఘం అంటే యజ్ఞం అని అర్థం, అందుకే యజ్ఞయాగాది క్రతువులకు 
ఈ మాసం ఎంతో శ్రేష్ఠమైనదిగా పండితులు చెబుతుంటారు. 

ఈ నేపథ్యంలో మాఘ మాసం విశిష్టత తెలుసుకుందాం…


#మాఘ మాసంలో నదీ స్నానం విశిష్టత:

మాఘ మాసంలో నదీ స్నానం ఎంతో పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. మాఘస్నానాలు సకల కల్మషాలను హరిస్తాయని విశ్వసిస్తారు. 
మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణంలో సైతం వివరించారు.
 మృకండు మహర్షి-మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలం వల్లే వారి కుమారుడైన మార్కండేయుడు మృత్యువును జయించాడని చెబుతారు. 

మరో పురాణ కథనం ప్రకారం... పూర్వం ఓ గంధర్వుడు ఉండేవాడు. 
ఆ గంధర్వుడికి అన్నీ బాగానే ఉన్నా ముఖం మాత్రం పూర్వజన్మ కర్మ వల్ల వికారంగా ఉండేది. 
ఆ గంధర్వుడు భృగుమహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకొన్నాడు. 


#మాఘ మాసంలోని పండుగలు:

*1. వంసత పంచమి:
మాఘ శుద్ధ పంచమి రోజున హిందువులు వసంత పంచమి జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఈ రోజున సరస్వతీ దేవి జన్మించిందని చెబుతుంటారు.
శ్రీ రామచంద్రమిషన్ ఆదిగురువు గారు…శ్రీరామచంద్ర(లాలాజీమహరాజ్)
ఈ వసంతపంచమి రోజున పుట్టారు.


*2.రథసప్తమి:
ఈ రోజున సూర్య భగవానుడు జన్మించాడని చెబుతారు. రథ సప్తమి రోజు సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే మంచిదని హిందువులు నమ్ముతారు.


*3. భీష్మాష్టమి:
మాఘశుద్ధ అష్టమి నాడు భీష్ముడు స్వచ్చంద మరణం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మాఘస్నానానంతరం భీష్మునికి తర్పణం చెయ్యాలి.


*4. భీష్మ ఏకాదశి:
 భీష్ముడు చనిపోయిన వెంటనే వచ్చిన ఏకాదశి అని అర్థం. భీష్ముని మీద గౌరవం వల్ల ఈ ఏకాదశిని ఆయన పేరుతో పిలుస్తారు.


 *5. మాఘపూర్ణిమ:
సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ 'మాఘ పూర్ణిమ' అత్యంత విశేషమైనది. దీనిని ‘మహామాఘి’ అని కూడా అంటారు. ఈ రోజు శివ, కేశవులిద్దరికీ ప్రీతికరమైనది.


#మాఘమాసంలో చేయాల్సిన, చేయకూడని పనులు:

ఈ మాసంలో ముల్లంగి దుంపలను తినకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. వీలైనంత వరకు మంచంపై పడుకోకూడదు. ఇక ఈ మాసంలో నువ్వుల్లో చక్కెరను కలుపుకునే తింటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు నువ్వులను ఇతరులకు దానం చేస్తే పుణ్యం దక్కుతుంది.

No comments:

Post a Comment