Thursday, January 30, 2025

 ప్రతిరోజూ…
శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…    
నడిచే దేవుడు…
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
పరమాచార్య పావన గాధలు…


         *చిన్నపిల్లల దేవుడు*
             ➖➖➖✍️
```
అప్పటి రోజుల్లో చిన్నపిల్లలు ఆడుకునే ఆటల్లో కూడా మన సంప్రదాయం కొట్టొచ్చినట్టు కనబడేది. సామాజిక జీవితాలను నాశనం చేసే ఇప్పటి పిల్లల ఆటలు వచ్చిచేరిన సమయం కాదది.

మరి అలాంటి సమయంలో ఎన్నో దేవాలయాలతో, ఎన్నో ఆలయ ఉత్సవాలతో, నిరంతరం దేవతల ఊరేగింపులతో ఉండే కుంభకోణం పిల్లలకు ఆటవిడుపు ఏమిటి? వారికి ఆటలు ఏవి?

నిజమైన స్వామి ఊరేరిగింపుల్లో ఉండే సందడి ఆటల్లో కూడా ఉండేది.

ఒక బుట్ట నిండుగా బంకమట్టి తెచ్చి, నలుగురూ చేతులు వేసి కలిపి, స్వామిని సిద్ధం చేసేవారు. వెన్న కుండ, గరుడ వాహనం, అశ్వ వాహనం ఇలా మొత్తం సరంజామా సిద్ధం చేసేవారు.

ఇక పూలకు కొదవ లేదు. కావేరీ తీరంలో ఎన్నో పూల చెట్లు వున్నాయి.

ఇక మంత్రాలా, అందుకోసం వేదపాఠశాల నుండి శిక్షణ పొందాలా? శివాయ నమః, విష్ణువే నమః, సుబ్రహ్మణ్యాయ నమః, వినాయకాయ నమః.


ఇలా ఒక స్వామివారిని ఊరేరిగింపుగా తీసుకునివచ్చారు, కుంభకోణంలోని శ్రీమఠం వీధిలోనికి. స్వామి వచ్చి శ్రీమఠం ముందు నిలబడ్డారు. ఎవ్వరూ ఊహించని సంఘటన. పరమాచార్య స్వామివారు బయటకు వచ్చారు. అది చిన్నపిల్లల ఆట అని తేలికగా తీసుకోలేదు స్వామివారు.

ఆ చిన్నపిల్లల దేవునికి దండ నమస్కారం చేశారు; రెండు చేతులు జోడించి నమస్కరించారు. కొబ్బరికాయ, అరటిపళ్లతో నైవేద్యం చెయ్యమని మఠం వారికి చెప్పారు. పిల్లలకు అరటిపళ్లు, పటికబెల్లం పంచమని ఆదేశించారు. తరువాత చెయ్యెత్తి వారిని ఆశీర్వదించి, స్వామి ఉత్సవం ముందుకు వెళ్లడానికి అనుమతిచ్చారు.

ఆ పిల్లలకు ఎంతటి సంతోషమో!!!

ఆ చిన్నపిల్లల భక్తిని గౌరవించి, అది వారిలో ఇంకా పెరగడానికి స్వామివారు చేసిన పని ఎంతో అపూర్వమైనది.

పరమాచార్య స్వామివారు రోజూ ఏకాగ్రతతో ఎంతోసేపు, విస్తారంగా పూజ చేస్తారన్న విషయం మనందరికీ తెలిసినదే. అలాగే, స్వామివారు ఇతరులు చేసే పూజను కూడా గౌరవిస్తారు.

శ్రీమఠానికి వచ్చే భక్తులలో, రోజూ పంచాయతన పూజ చేసేవారు ఎందరో వున్నారు. స్వామివారు వెళ్ళి ఆ పూజలను చూసి, భగవంతుణ్ణి ప్రార్థిస్తారు.

స్వామివారు బయటకు వెళ్లినప్పుడు ఎక్కడైనా వినాయకుని మందిరం కనబడితే - అది చిన్నదైనా, పాడుబడినదైనా లేదా ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించకపోయినా, ఆ గణపతులకి తప్పక కొబ్బరికాయ సమర్పించాల్సిందే.✍️```

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥
 "కంచిపరమాచార్యవైభవం"!!!🙏

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment