Monday, January 27, 2025

 దేశాన్నికాపాడతాం!
******************
సామాన్యులు మీరు
మీకు రాజకీయాలేల?
మాకు ఓట్లేసారు 
మమ్మల్ని గెలిపించారు!
మేంచూసుకుంటాం!

కృష్ణంవందే!జైశ్రీరామ్!
అనుకుంటూ కూర్చోండి!
అంతకీ కాకపోతే 
ఓం నమ:శివాయ!
వాళ్ళే చూసుకుంటారు!

తురకల్ని క్రిస్టియన్ ల్ని 
దేశంనుంచి గెంటేస్తాం!
డబలింజన్ సర్కార్!
పని ఎప్పుడో మొదలైంది
మాది ఏకచ్చత్రాదిపత్యం!

టెక్నాలాజీ రాబట్టి 
తెలిసిపోతోంది మీకు!
ఆనాడు విద్యలేకుండా 
ఎంతోకాలం మిమ్మల్ని 
పాదసేవ చేయించాం!

ఆ ఇంగ్లీషోడు రాబట్టి 
మా కొంపమునిగింది!
వాడే కాని రాకపోతే 
మీకు మూతికి ముంత 
ముడ్డికి చీపురే ఉండేవి!

మనది ప్రాచ్య దేశం!
చదువులకోసంమనోళ్లు 
పాశ్చాత్యం వెళ్లారు!
"అప్రాచ్యులారా"అంటూ 
వెళ్లకుండా ట్రై చేసాం!

ఇది జంబూద్వీపం!
తెల్లోడే రాకపోతే 
ఇక్కడ కులవృత్తులతో 
సూద్రపోళ్ళు అడుక్కుంటూ 
హాయిగా ఉండేవాళ్ళు!!

ఇప్పుడేమైంది?
గుట్టు రట్ట యింది!
డిజిటల్ టెక్నాలజీ 
ఎలక్ట్రానిక్ యుగం 
ఆ తెల్లోళ్ల వల్లే!

ఇవేవీ రాకుండావుంటే 
దేశాన్ని కాపాడే వాళ్ళం!
కూలీనాలీ చేసుకుంటూ 
కాయా కసరూ తింటూ 
ఆరోగ్యంగా ఉండేవాళ్ళు!

చక్కగా చదువుల్లేకుండా 
బాల్య వివాహాలతో 
బాలవితంతువులతో 
సతీసహగమనాలతో 
దేశం ఎంతబాగుండేది!

మించిపోయింది లేదు 
నాటి 'మను'వులమే 
నేటి పాలకులం!
రేపటి ఫాసిస్టులం!
వెనక్కి తీసుకుపోతాం!

ముక్కోటిదేవుళ్ళతో 
మంత్ర తంత్రాలతో 
వేశ్యలు దేవదాశీలతో 
యంగ్ విడోలతో 
దేశాన్ని కాపాడతాం!
        ********
-తమ్మినేని అక్కిరాజు 
       27-1-2025

No comments:

Post a Comment