Neem Karoli Baba Life Story Part 3: The Baba Who Inspired Steve Jobs & Ram Dass | #neemkarolibaba
https://youtu.be/PVzfRSt6vYg?si=V7DEpzsIzYLnBU5Q
హాయ్ ఫ్రెండ్స్ నా పేరు భార్గవ రెడ్డి నేను గత కొన్ని సంవత్సరాలుగా మెడిటేషన్ చేస్తున్నాను నాకు యోగులన్న యోగుల జీవిత చరిత్ర అన్నా చాలా ఇష్టం అయితే ఈ మధ్యనే భారతదేశ సుప్రసిద్ధ గురువుల్లో ఒకరైన శ్రీ నీమ్ కరలి బాబా గారి జీవిత చరిత్రను చదవడం జరిగింది గమనిక ఈ వీడియో మొదలు పెట్టే ముందు శ్రోతలకు నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే నేను చెప్తున్న ఈ నీమ్ కరులి బాబా గారి జీవితం ఇదేదో కల్పిత కథనో లేదా నా సొంత పాండిత్యాన్ని జోడించి చెప్పడం లేదు నేను చెప్తున్న ప్రతి మాట నిజం బాబా గారి జీవితంలో జరిగినవే నేను మీతో పంచుకుంటున్నాను ఇక నేమ్ కలలి బాబా గారి జీవిత చరిత్ర మూడవ భాగాన్ని మొదలు పెడదాం ఈ మూడవ భాగంలో బాబా గారి మరికొన్ని మహిమల గురించి తెలుసుకోబోతున్నాం అవేంటంటే బాబా మంచి నీటిని నెయ్యిగా ఎలా మార్చారు అదేవిధంగా హార్వర్డ్ యూనివర్సిటీలోని ఆల్బర్ట్ రిచర్డ్ అనే ప్రొఫెసర్ బాబాకి ఎలా భక్తుడు అయ్యాడు అదేవిధంగా ఆర్మీలో ఉన్న సైనికుడిని బాబా తన కంబలితో ఏ విధంగా కాపాడారు అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి 1937 వ సంవత్సరంలో నేను కొరలి బాబా గారికి మరియు రామ్ బేటికి గారికి రెండవ సంతానంగా ఒక కొడుకు జన్మిస్తారు ఆయన పేరు ధర్మనారాయణ శర్మ అదేవిధంగా 1945 వ సంవత్సరంలో వీరికి మూడవ సంతానంగా ఒక ఆడబిడ్డ జన్మిస్తుంది ఆవిడ పేరు గిరిజా దేవి ఇక్కడ నేను ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను అదేంటంటే మనం చాలా మంది యోగుల జీవితాలను చదివి ఉంటాము లేదా విని ఉంటాము కానీ ఈ నేమ్ బాబా గారి జీవితంలో ఏంటంటే ఒకవైపు ఈయన స్పిరిచువల్ గురువుగా ఉంటూ మరోవైపు ఈయన్ని గ్రామ పెద్దగా కూడా ఎన్నుకోబడతారు ఒకవైపు ఆధ్యాత్మిక జీవితం మరోవైపు ప్రాపంచిక జీవితం ఒకసారి ఏమవుతుందంటే ఆ అక్బర్ బూర్ కు కొంత దూరంలో ఉన్న ఒక ఊర్లో ఒక వ్యక్తికి ఒక సమస్య వస్తుంది ఈ వ్యక్తి ఆ నీమ్ కరోలి బాబా గారిని వెతుక్కుంటూ వస్తారు వచ్చి నేమ్ కరోలి బాబా గారిని కలుస్తారు నీకలి బాబా గారు ఆ వ్యక్తి యొక్క సమస్యకు పరిష్కారం చెప్తారు ఇలా నేమ్లి బాబా గారు ప్రాపంచిక జీవితాన్ని మరియు ఆధ్యాత్మిక జీవితాన్ని రెండింటిని సమానంగా ముందుకు తీసుకెళ్లేవారు ఒకసారి ఏమవుతుందంటే కెంచిదాం అనే ఒక ఊర్లో పూనానంద్ తివారి అనే ఒక వ్యక్తి ఉంటారు ఈయన గత కొన్ని రోజులుగా ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారు సో ఆ కెన్ ధామ్ కి కొంత దూరంలో నయనత అనే ఒక టౌన్ ఉంటుంది ఈ పూనానంద్ తివారి గారు అక్కడికి వెళ్లి అక్కడ ఒక డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని తిరిగి తన ఇంటి వైపు వస్తుంటాడు సో అప్పటికే చీకటి పడి ఉంటుంది ఉత్తరాఖండ్ మొత్తం కూడా లోయలు కొండలతో ఉంటుందన్నమాట ఈయన చాలా స్పీడ్ గా నడుచుకుంటూ వెళ్తుంటాడు వెళ్తుంటే ఒక రోడ్డు మలుపు దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఓ పూర్ణానంద్ ఓ పూర్ణానంద్ అని అరుస్తుంటాడు ఈ పూర్ణానంద్ గారు భయపడతారు ఏంటంటే ఆ పిలుస్తున్న వ్యక్తి ఎవరో ఈయనకు తెలియదు సో భయపడుతుంటే ఆ పిలిచిన వ్యక్తి ఈయన దగ్గరికి వస్తాడు వచ్చి రాంగానే ఈయన చెప్తాడు నువ్వు భయపడకు నువ్వు ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నావు కదా అతి తక్కువ కాలంలోనే ఆ సమస్య మటుమాయమై నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు అని చెప్తాడు ఈ మాట వినగానే ఈ పూర్ణానంద్ తివారి గారు చాలా సంతోషపడతారు మళ్ళీ బాబా గారు పూర్ణానంద్ తివారి గారితో చెప్తారు నేను నీ ద్వారా ఒక పని చేయాలి కాకపోతే అది ఇప్పుడు కాదు 20 సంవత్సరాల తర్వాత అని చెప్పి మళ్ళీ నేను నిన్ను 20 సంవత్సరాల తర్వాత కలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ పూర్ణానంద్ తివారి గారికేమో ఎక్కడ లేని సంతోషం ఎందుకంటే ఆయన చాలా తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఉండి కొద్ది రోజుల్లోనే ఆయన చనిపోతాను అనే ఫీలింగ్ లో ఉంటాడు అన్నమాట అప్పుడు ఈ నీమ్ కరులి బాబా గారు వచ్చి ఈ విషయం అని చెప్పడంతో ఆయన ఎంతో సంతోషిస్తాడు అలా నేమ్ కరోలి బాబా గారు చెప్పినట్లే కరెక్ట్ గా 20 సంవత్సరాల తర్వాత అంటే 1962 వ సంవత్సరంలో బాబా గారు వచ్చి ఈ పూర్ణానంది వారి గారిని కలుస్తారు ఈ 20 సంవత్సరాల్లోనే ఈ బాబా గారి పేరు ప్రఖ్యాతలు మన దేశమంతా వ్యాపిస్తాయి అన్నమాట బాబా వచ్చి పూర్ణానంద్ గారిని కలవగానే పూర్ణానంద్ తివారి గారు కూడా చాలా సంతోషిస్తారు బాబా ఈ పూర్ణానంద్ తివారి గారిని ఒక ప్లేస్ కి తీసుకెళ్లి ఆ ప్లేస్ ని చూపిస్తూ ఇక్కడ నేను గుడి కట్టాలనుకుంటున్నాను దీనికి నీ సహాయం నాకు కావాలి అని చెప్తాడు అప్పుడు ఈ పూర్ణానంద్ తివారి గారు ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులందరిని తీసుకొచ్చి ఈ బాబా గారికి పరిచయం చేస్తారు అప్పుడు ఆ పెద్ద మనుషుల్లో ఒక వ్యక్తి బాబా గారితో చెప్తారు బాబా గారు మీరు ఏ ప్లేస్ లో అయితే గుడి కట్టాలనుకుంటున్నారో ఆ ప్లేస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది కాబట్టి మన మనం గుడి కట్టాలనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అయినా లేదా అటవీ శాఖ మంత్రి నుంచి కానీ మనం అనుమతి తీసుకోవాలి అని చెప్తారు అప్పుడు బాబా ఎవరు ఈ అటవీ శాఖ మంత్రి అని అడుగుతారు అడిగితే ఆ పెద్ద మనిషి చెప్తాడు శ్రీ చరణ్ సింగ్ గారు అని చెప్తారు అప్పుడు బాబా ఒక నిమిషం కళ్ళు మూసుకొని తర్వాత కళ్ళు తెరిచి చెప్తాడు అన్నమాట సరేలే రేపు చరణ్ సింగ్ ఇక్కడికి వచ్చి మనకు పర్మిషన్ ఇస్తానులే అని చెప్తాడు బాబా గారు చెప్పినట్లే మరుసటి రోజు పొద్దున్నే శ్రీ చరణ్ సింగ్ గారు పెద్ద కాన్వా వేసుకొని ఈ కెంజిదాంకి వచ్చి బాబా గారిని కలుస్తారు కలిస్తే బాబా గారు ఆయన ఎక్కడ గుడి కట్టాలనుకుంటున్నాడో ఆ ప్లేస్ ని చూపిస్తారు చూపించి ఇలా నేను గుడి కట్టాలనుకుంటున్నాను అని చెప్తారు చెప్పిన వెంటనే శరణ్ సింగ్ గారు అంటారు గురువుగారు మీరు గుడి నిర్మాణాన్ని మొదలు పెట్టండి నేను మీకు కావలసిన అనుమతి పత్రాలన్నిటిని మీకు నేను పంపిస్తాను అని చెప్తారు అప్పుడు బాబా ఈ చరణ్ సింగ్ గారితో నువ్వు ప్రధానమంత్రి అవుతావులే పో అంటాడు బాబా చెప్పినట్లే అతి తక్కువ కాలంలోనే ఆయన మన దేశ ప్రధానమంత్రి అవుతాడు అలా బాబా చెప్పే ప్రతి వాక్కు నిజమయ్యేది సో ఆ రోజు నీమ్ కరోలి బాబా గారు కట్టిన గుడే ఈరోజు కెంచిద్దాం నీమ్ కరోలి బాబా ఆశ్రమం ఇలా బాబా గారి జీవిత కాలంలో 108 గుడులను నిర్మించాడు అందులో ముఖ్యంగా ఒకటి కెంచిదాం అయితే రెండవది బృందావన్‌లో ఉన్న గుడి అలా బాబా కొద్ది రోజులు కెంచిదాంలో కొద్ది రోజులు బృందావన్‌లో ఉండేవారు ఇక్కడ నేను ఒక అనుభవం చెప్తాను అదేంటంటే ఒకసారి నేమ్ కలి బాబా గారు పెద్ద యజ్ఞం చేస్తుంటారు యజ్ఞం చేస్తుంటే ఈ యజ్ఞానికని అప్పట్లోనే కొన్ని లక్షల మంది వస్తారు అయితే అందరికీ ప్రసాదం వండుతుంటారు వండుతుంటే వారి దగ్గర ఉన్న నెయ్యి అయిపోతుంది అయిపోతే అక్కడున్న భక్తులు వెళ్లి నీకలి బాబా గారికి చెప్తారు స్వామి ఇలా లక్షల్లో భక్తులు వచ్చారు కానీ మన దగ్గర ఉన్న నెయ్యి అయిపోయింది ఇప్పుడు ప్రసాదం ఎలా వండాలి అని అడుగుతారు అడిగితే అప్పుడు బాబాగారు ఇద్దరు భక్తులను పిలిచి అక్కడున్న కుండలను తీసుకొని వెళ్లి ఆ యజ్ఞానికి కొంత దూరంలో నది ప్రవహిస్తుంటుంది ఆ నదిలో ప్రవహించే నీటిని తీసుకురమ్మంటారు తీసుకురమ్మని ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇప్పుడు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ నీటిని తెచ్చేంతవరకు కంటిన్యూగా రామ జపాన్ని జపిస్తూ వెళ్ళాలి అని చెప్తారు అలా బాబా చెప్పినట్లే ఆ ఇద్దరు భక్తులు ఆ కుండల్ని తీసుకొని రామ నామాన్ని జపిస్తూ నదిలో నీటిని తీసుకొచ్చి బాబా చెప్పిన ఒక పెద్ద పాత్రలో పోస్తారు పోస్తే ఆ విచిత్రం ఏంటంటే వీరు తెచ్చిందేమో నీళ్లు కానీ ఇక్కడికి తెచ్చి ఆ పాత్రలో పోయంగానే ఆ నీరు నెయ్యి అయిపోయి ఉంటుందన్నమాట అలా బాబా గారు నీటిని నెయ్యిగా మారుస్తారు మార్చి ఆ నెయ్యితో ప్రసాదాన్ని వడ్డించి అక్కడున్న భక్తులందరికీ పంచుతారు మళ్ళీ బాబా ఆయన ప్రియ భక్తుని పిలిచి రేపు పొద్దున్నే మార్కెట్ నుంచి రెండు టిన్నుల నెయ్యిని తీసుకురమ్మంటాడు కానీ ఆయనకేం అర్థం కాదు ఎందుకు బాబా అలా చెప్తున్నాడు అని బాబా చెప్పినట్లే మరుసటి రోజు పొద్దున్నే ఆ భక్తుడు రెండు పెద్ద టిన్నుల నెయ్యిని తీసుకొస్తాడు తీసుకొస్తే ఈ బాబా ఆ నేని తీసుకెళ్లి ఆ నదిలో కలిపేస్తాడు ఇలా ఈయన అనుభవాలు చాలా అద్భుతంగా ఉండేటివి ఇంకొక అనుభవం చెప్తాను అదేంటంటే హార్వర్డ్ యూనివర్సిటీలో ఆల్బర్ట్ రిచార్డ్ అనే ఒక ప్రొఫెసర్ మరియు సైంటిస్ట్ ఉండేవారు ఈయన ఏంటంటే ఎల్ ఎస్ టి అనే డ్రగ్ పైన పరిశోధనలు చేస్తుంటారు ఈ ఎల్ ఎస్ టి అనే డ్రగ్ ఏంటంటే ఇదొక మారక ద్రవ్యం అది తీసుకోగానే వీళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు ఏదో తెలియని ఒక మంత్లోకి వెళ్ళిపోతారు సో ఈ వ్యక్తి ఏంటంటే ఈ డ్రగ్స్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు అయితే ఆ యూనివర్సిటీ యొక్క రూల్ ప్రకారం ఆ డ్రగ్ ని అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి ఇవ్వకూడదు అయితే అనుకోకుండా ఈ రీచార్జ్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కి ఇస్తాడు అన్నమాట ఈ విషయం తెలిసిన హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఆయన్ని డిస్మిస్ చేస్తారు అలా డిస్మిస్ అయిన ఈ రీచార్ట్ ఏం చేయాలో తెలియక కొన్ని నెలల తర్వాత ఇండియాకి వస్తాడు ఇండియాలో భగవాన్ దాస్ అనే ఒక యోగా టీచర్ ని కలుస్తాడు ఆ యోగా టీచర్ ఈ రీచార్డ్ ని నేమ్ కలి బాబా గారి దగ్గరికి తీసుకొస్తారు తీసుకొచ్చిన వెంటనే బాబా గారు ఈ ఆల్బర్ట్ రిచార్డ్ ని చూసి హే నీ దగ్గర ఏదో యోగి మెడిసిన్ ఉంది కదా ఇదో నాకు ఇవ్వు అంటాడు ఈ ఆల్బర్ట్ రిచర్డ్ కి ఏం అర్థం కాదు అదేంటి యోగి మెడిసిన్ ఏంటి అంటాడు హే అదే నీ దగ్గర ఏదో ఉంది కదా మాతర్లు అది నాకు ఇవ్వు అంటాడు అప్పుడు ఓ ఈయన అడుగుతుంది ఎల్ ఎస్ డ్రగ్ అని రీచార్డ్ దగ్గర ఉన్న ఒక టాబ్లెట్ ని తీసి బాబా చేతిలో పెడతాడు బాబా అది చూసి అరే ఇంకోటి ఇవ్వు అంటాడు మళ్ళీ ఆ రీచార్డ్ ఇంకోటి ఇస్తాడు అలా ఆయన దగ్గర సిక్స్ టాబ్లెట్స్ ఉంటే ఆ సిక్స్ టాబ్లెట్స్ తీసుకొని ఒకేసారి వేసేసుకుంటాడు ఈ ఆల్బర్ట్ కేమో ఎక్కలేని టెన్షన్ ఎందుకంటే ఇంత చిన్న మిల్లీ మైక్రో గ్రామ్ తీసుకుంటేనే మనం మత్తులోకి వెళ్ళిపోతాం ఈయనేమో ఈ టాబ్లెట్స్ అన్నిటిని మింగేస్తాడు ఈయన ఏమైపోతాడు అని టెన్షన్ పడుతుంటాడు టెన్షన్ పడుతుంటాడు బాబా గారేమో ఆ టాబ్లెట్స్ అన్నీ మింగేసి పక్కనున్న భక్తులతో మాట్లాడుతుంటాడు ఇలా కొన్ని గంటలు అయిపోతుంది ఆయనలో ఎలాంటి మార్పు ఉండదు అప్పుడు ఈ ఆల్బర్ట్ రిచర్డ్ కి అర్థమవుతుంది ఈ డ్రగ్ కంటే ఈ ఏదైతే మత్తు పదార్థం ఉంది కదా దీనికంటే గొప్పదైంది ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ మెడిటేషన్ అని ఆయన రియలైజ్ అవుతాడు రియలైజ్ అయ్యి ఆయన పేరుని ఆల్బర్ట్ రిచర్డ్ నుంచి బాబా రామ్‌దాస్ గా మార్చుకుంటాడు మార్చుకొని అలా అమెరికా మొత్తం అనేక సంస్థలను స్థాపించి యోగ మరియు మెడిటేషన్ ని ప్రచారం చేస్తాడు ఈయన అనేక పుస్తకాలు రాస్తారు ఇక మీకు ఇంకొక అనుభవం చెప్తాను ఒకసారి ఏమవుతుందంటే బాబా గారు కీల ఘాటు దగ్గర ఉంటున్నప్పుడు ఆ కీలా ఘాటుకి కొంత దూరంలో వృద్ధ దంపతులు ఉంటారు ఈ ఇద్దరు కూడా బాబా గారికి పరమ భక్తులు ఈ దంపతులకు ఒక్కగాన ఒక కొడుకు ఆర్మీలో పని చేస్తుంటాడు అయితే గత కొన్ని నెలల నుంచి వాళ్ళ కొడుకు నుంచి ఈ తల్లిదండ్రులకి ఎలాంటి సమాచారం ఉండదు అరే నా కొడుకు ఏమైపోయారు అసలు నా కొడుకు ఉన్నాడా వాడికి ఏమన్నా అయ్యిందా అని ఏమి ఎలాంటి సమాచారం ఉండదు ఈ రోజుల్లో అంటే ఫోన్లు ఉన్నాయి మనం ఫోన్ చేయొచ్చు కనుక్కోవచ్చు కానీ ఇది 60 70 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ సో ఇలా ఆ వృద్ధ దంపతులు బాధపడుతుంటే ఒకానొక రోజు నీమ్ కరోలి బాబా గారు వాళ్ళ ఇంటికి వెళ్తారు వెళ్లి అరే నాకు ఆకలిగా ఉంది ఏదో ఒకటి పెట్టు నాకు తినాలని ఉంది అంటాడు ఆ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నది ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి బాబా గారికి ఇస్తారు బాబా దాన్ని తిని ఈ రాత్రికి నేను మీ ఇంట్లోనే ఉంటున్నాను అని బాబా చెప్తారు సో వీళ్ళేమో చాలా పూర్ ఫ్యామిలీ ఒకవైపు వీళ్ళు పడుకొని మరోవైపు బాబా పడుకోవడానికి ఏర్పాట్లు చేస్తారు రాత్రి అవుతుంది బాబా గారు వచ్చి పడుకుంటారు ఈయన ఎక్కడికి వెళ్ళినా ఈయనతో పాటు ఒక కంబలి ఉంటుంది సో ఈయన తెచ్చుకున్న కంబలి ఈయన ముసుకేసుకొని పడుకుంటాడు పడుకున్న తర్వాత ఈ కంబలి లోపల నుంచి ఎవరైనా వ్యక్తి బాగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కొన్ని సౌండ్స్ చేస్తారు కదా అంటే ముక్కుతూ మూలుగుతూ ఏడుస్తూ అలాంటి శబ్దాలు ఆ కంపల్ లోపల నుండి వస్తుంటాయి ఈ వృద్ధ దంపతకి ఏం అర్థం కాదు అరే ఏమవుతుంది ఈయన మన ఇంటికి వచ్చి పడుకున్నాడు చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని వాళ్లకేం అర్థం కాదు ఇలా రాత్రి ఆ వృద్ధ దంపతులకు జాగారం ఆయనేమో కంబల్లో పండుకొని ఈ ఇలా విచిత్ర విచిత్రమైన శబ్దాలు చేస్తూ ఉంటారు ఇలా మొత్తానికి తెల్లవారుతుంది ఈ బాబాగారు లేచే కంబల్ని నీట్ గా చుట్టుతారు చుట్టి ఆ వృద్ధ దంపతుల చేతుల్లో ఇచ్చి మీరు గత కొంతకాలంగా మీ కొడుకు గురించి బాధపడుతున్నారు కదా ఏం కాలేదులే సరిగ్గా నెల రోజుల్లో మీ కొడుకు మీ ఇంటికి వస్తాడులే అని చెప్పంగానే ఈ వృద్ధ దంపతులు ఇద్దరికి ఎక్కడ లేని ఆనందం వస్తుంది తర్వాత బాబా ఆ చుట్టిన కంబలిని వాళ్ళకి ఇచ్చి ఈ కంబలిని తీసుకొని వెళ్లి ఆ నదిలో పడేయండి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కంబలి లోపల ఏముంది అని మీరు చూడకూడదు అంటారు సరే గురువు చెప్పినట్లే ఈ వృద్ధ దంపతులు ఇద్దరు చెరో వైపు పట్టుకొని నది వైపు వెళ్తూ ఉంటారు అయితే ఆ కంబలి చాలా బరువుగా ఉంటుంది వీళ్ళకి డౌట్ వస్తుంది అరే ఈ కంపల్ లోపల ఏముంది ఒకసారి విప్పి చూద్దామని కానీ ఆయన గురువు కదా ఆయన చెప్పిన మాట గుర్తుకొచ్చి అలాగే తీసుకెళ్లి నదిలో పడేస్తారు సరిగ్గా ఇది జరిగిన నెల రోజులకు ఆర్మీ నుంచి కొడుకు ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి అమ్మ నాన్న మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే సరిగ్గా నెల రోజుల క్రితం మేము జపాన్ వాళ్ళ పైన యుద్ధానికి వెళ్ళాం అయితే ఆ జపాన్ సైనికులు మేము ఉంటున్న క్యాంప్ పైన అటాక్ చేశారు ఆ అటాక్ లో నాతో పాటు ఉన్న సైనికులందరూ చనిపోయారు కాకపోతే వాళ్ళు నా వైపు గన్స్ తో కాలుస్తున్నారు కానీ బుల్లెట్లు తగలకుండా నా వైపు నుండి ఇటు అటు వెళ్ళిపోతున్నాయి కాసేపు తర్వాత నేను సృహ తప్పి పడిపోయాను తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు పొద్దున్నే మా సీనియర్ ఆఫీసర్ వచ్చి ఆఫీస్ కి తీసుకెళ్లాడు అని చెప్తాడు అప్పుడు ఈ తల్లిదండ్రులు ఏ రోజు జరిగిందో ఆ డేట్ అడుగుతారు అప్పుడు చూస్తే అదేంటంటే ఈ అబ్బాయి పైన అటాక్ జరిగింది ఆ బాబా వచ్చి వీళ్ళ ఇంట్లో పడుకున్న రోజు రెండు ఒకటే అంటే ఏదైతే ఆ కొడుకు అనుభవించాలో ఆ అబ్బాయి అనుభవించాలో ఆ బుల్లెట్లు గాయాలు ఆ నొప్పులను ఈ బాబా అనుభవించి ఆ అబ్బాయిని కాపాడాడు బాబాను నమ్ముకున్న భక్తుల్ని బాబా ఈ విధంగా కాపాడేవారు ఈ అనుభవాన్ని బుల్లెట్ ప్రూఫ్ కంబల్ అని బాబా రామదాస్ గారు మిరాకిల్ ఆఫ్ లవ్ అనే పుస్తకంలో రాశారు మళ్ళీ మనం నేమ్ కరలి బాబా గారి జీవిత చరిత్ర నాలుగవ భాగంలో కలుసుకుందాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు
No comments:
Post a Comment