Thursday, January 30, 2025

 *మంచుకొండల్లో ఉంటారు..* *కుంభమేళాకు మాత్రమే వస్తారు..!*
*భారత ఆధ్మాత్మిక జీవన* *ప్రవాహంలో నాగసాధువులు*
*రూపం దిగంబరం.. దేహమంతా విభూది.. చేతిలో ఆయుధం.. జడలు కట్టిన శిరోజాలతో ఎర్రటికళ్లతో భయానకంగా ఉంటారు.. చీమకు కూడా అపకారం చేయరు. కానీ, ధర్మానికి అపచారం కలిగితే ప్రళయకాలరుద్రులవుతారు. ఎక్కడో హిమాలయాల్లో ఉంటారని వినడమే కానీ ప్రత్యక్షంగా చూసినవారు లేరు. పవిత్ర కుంభమేళా సమయాల్లో మాత్రమే వారు పవిత్ర స్నానాలకు వస్తారు. ఎంత నిశ్శబ్దంగా వస్తారో అంతే మౌనంగా వెళ్లిపోతుంటారు. వారే నాగ సాధువులు..!*

*ఎలా వచ్చింది ఈ సంప్రదాయం..?*
*దీనిపై భిన్నమైన సిద్ధాంతాలున్నాయి. శంకర భగవత్పాదులు దేశంలోని నాలుగు దిక్కులా బదరీనాథ్‌, పూరి, ద్వారకా, శృంగేరిల్లో పీఠాలను ఏర్పాటు చేశారు. సనాతన ధర్మానికి పరిరక్షకులగా ఈ సైన్యాన్ని ఏర్పాటు చేసినట్టు కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి. దీన్నే దశనామి సంప్రదాయగా పరిగణిస్తున్నారు. శైవ, వైష్ణవ సంప్రదాయాలకు చెందిన అఖాడాల్లో నాగ సాధువులున్నారు. మొదట్లో యుద్ధవిద్యలో ప్రవీణులైనా ఆధునిక కాలంలో పూర్తిగా ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారు. అయితే యుద్ధవిద్యల శిక్షణ మాత్రం కొనసాగుతోంది..!*

*ఎలా చేరాలి..?*
*ఇది క్షిష్టతరమైన ప్రక్రియ.  ‘శంకరం శంకరాచార్యం కేశవం ’ అని నినదిస్తారు.  దీని అర్థం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే . ‘నాగ’ అనే పదానికి భౌతికమైన వాంఛలను పరిత్యజించి ఎలాంటి బంధాలు లేని కఠోరమైన జీవితాన్ని ప్రారంభించాలనుకునేవారు ఇందులో చేరవచ్చు. సాధారణంగా కుంభమేళాల్లో కొత్తవారిని చేర్చుకుంటారు. అనేక వడపోత కార్యక్రమాల అనంతరం ఇందులో చేరేవారు శిరోముండనం చేసుకొని ఎవరికి వారే సొంతంగా పిండ ప్రదానం చేసుకోవాలి. దీంతో ఈ ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. మౌని అమవాస్యనాడు అమృతస్నానం చేస్తారు. ఏ అఖాడాలో చేరితే ఆ ఆచార్య మహామండలేశ్వరుడు తమ శాఖలోకి స్వీకరించే ప్రక్రియ చేపడతారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించేవారు అఖాడాలో ఎలా ఉండాలో వివరిస్తారు..!*

*వీళ్లు ఏం భుజిస్తారు..*
*పండ్లు, దుంపలు భుజిస్తారు. ఎక్కువకాలం ఉపవాసదీక్షలో ఉంటారు. ఇహలోక అంశాలతో వారికి ఎలాంటి సంబంధం ఉండదు. అందుకే రాగద్వేషాలకు అతీతంగా ఉంటారు..!*

*అఘోరాలకు వీరికి సంబంధం ఉందా..?*
*లేదు.. అఘోరాలు వామాచారాలను పాటిస్తారు. నాగసాధువులు కుంభమేళాలకు మాత్రమే హాజరవుతారు. ఎంత దూరమైనా ఎలాంటి పాదరక్షలు లేకుండా విభూతిధారులై నడుస్తారు. కుంభమేళాకు హాజరయ్యే వీరిని దర్శించుకుంటే మంచిదని కోట్లాదిమంది భక్తుల విశ్వాసం..!*

*అన్నింటిని అధిగమించి..!*
*ఎముకలు కొరికే చలిలోనూ, నిప్పులు చెరిగే భానుడి తీవ్రతలోను వీరు చలించరు. యధాప్రకారం తమ నిత్య కార్యాలు  నిర్వహిస్తుంటారు. వీరి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. కుంభమేళాలు జరిగే తీర్థాలకు మాత్రమే వస్తారు. అనంతరం వెళ్లిపోతారు. ఎవరితోనూ సంబంధాలు ఉండవు. వందల సంవత్సరాలుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశానికీ లేని ఆధ్యాత్మికత ఘనకీర్తి మనకు ఉంది. లోకకల్యాణం కోసం తరతరాల ఆచారాలను ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా దివ్యప్రభను అందిస్తున్న నాగసాధువులకు అనంత ప్రణామాలు చెప్పాల్సిందే...*

No comments:

Post a Comment