*జ్ఞానము.....*
మనలోపల గాని, వెలుపల గాని అనేక మార్పులు జరుగుతుంటాయి. ఆ మార్పులు మనకు తెలిస్తే సుఖమో - దుఃఖమో కలుగుతుంది. తెలియకపోతే ఏమీ లేదు.
౧. లాటరీలో కోటి రూపాయల బంపర్ ప్రైజు వచ్చింది. అదొక మార్పు. అయితే ఆ విషయం రెండు రోజుల తర్వాత పేపర్ లో చూచాం. అప్పుడు ఆనందం కలిగింది. అప్పటిదాకా ప్రైజు వచ్చినా ఆనందంలేదు.
౨. తీర్థయాత్రలకని వెళ్లావు. దొంగలు పడి ఇల్లంతా దోచుకున్నారు. అదొక మార్పు. 20 రోజుల తర్వాత వచ్చి చూచావు. అప్పుడు లబోదిబో - దుఃఖం. అప్పటివరకూ నీకు దుఃఖం లేదు. హాయిగా ఆనందంగా క్షేత్ర దర్శనం చేశావు.
అంటే ఏదైనా మార్పు జరిగి, ఆ మార్పు తెలిస్తేనే దుఃఖమో, సుఖమో. మార్పు - తెలియటం (జ్ఞానం) అనే రెండూ కలిస్తేనే సుఖదుఃఖాలు. మార్పు లేకపోయినా - తెలియకపోయినా సుఖం లేదు. దుఃఖం లేదు.
మార్పులన్నింటికి కార్యకారణ సంబంధం ఉంటుంది.
౧. లాటరీ టికెట్టు కొనటం కారణం. డబ్బు రావటం కార్యం.
౨. తీర్థయాత్రలకు వెళ్ళటం కారణం. దొంగలు దోచుకోవటం కార్యం.
కనుక కార్యకారణ సంబంధం అనే నియమాన్ని బట్టే మార్పులు. దీనిని బట్టి ఈ స్థూల సూక్ష్మ శరీరాలు కార్యం. పూర్వ జన్మలలోని వాసనలు కర్మఫలాలు కారణం (కారణశరీరం).
ఈ శరీరం గాని, కర్మఫలాలు వాసనలతో కూడిన కారణశరీరం గాని రెండూ ప్రకృతికి చెందినవే. రెండూ పంచభూతాల నుండి వచ్చినవే. కనుక కార్యకారణాలకు రెండింటికి కర్త ప్రకృతే.
No comments:
Post a Comment