Tuesday, January 7, 2025

 *పేపర్ టీ కప్ తో క్యాన్సర్ వస్తుందా?వైద్య నిలయం సలహాలు*
ఒక్క పదంలో సమాధానం చెప్పాలంటే అవును అనే చెప్పాలి, ఎందుకంటే పేపర్ కప్స్ పైన మైక్రో ప్లాస్టిక్ లైనింగ్ ఉంటుంది, వేడి టీ అందులో పోసినప్పుడు ఆ మైక్రో ప్లాస్టిక్స్ కరిగిపోయి టీ తో పాటే మన శరీరం లోకి వచ్చేస్తాయి, ఆ మైక్రో ప్లాస్టిక్స్ క్యాన్సర్ కి కారకాలు. అందుకని పేపర్ కప్స్ లో టీ తాగటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.


ఒక పరిశోధన కోసం శాస్త్రవేత్తలు 100ml వాల్యూమ్‌తో కాగితపు కప్పుల్లో వేడి నీటిని పోసారు తరువాత వాటిని 15 నిమిషాలు అలాగే ఉంచారు, ఆ తరువాత పరిశోధకులుమైక్రోస్కోప్‌ను ఉపయోగించి కప్పుల్లోకి పోసిన వేడి నీటిని పరిశీలించారు, ప్రతి కప్పులో సగటున 25,000 మైక్రోప్లాస్టిక్‌లను కనుగొన్నారు. ఇంకా, వారు నీటిలో జింక్, సీసం మరియు క్రోమియం వంటి లోహాల ఉనికిని కూడా గుర్తించారు, ఇది కప్ లోపలి పొర నుండి వచ్చే అవకాశం ఉందట.

ఇక సాధారణంగా మనం రోజుకు మూడు కప్స్ తాగినా అది 75,000 మైక్రోప్లాస్టిక్‌లను మన శరీరంలోకి పంపించినట్టే ..అందువల్ల క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతున్నట్టే ..
వైద్య నిలయం లింక్స్ 

No comments:

Post a Comment