Monday, January 6, 2025

 🌿మన పల్లెలు నేర్పిన జీవిత పాఠాలు🌿

🌾పొలం గట్లపై నడిపించి,  
తడబడకుండా నిలదొక్కుకోవటం  నేర్పింది.🌾

🌿అకాల వర్షాలకు, గాలి దుమారాలకు పంటలు పాడై పొతే,
నష్టాలకు నిలదొక్కుకునే స్థైర్యం నేర్పింది.🌿

🌿వాగు పక్కన నీటి  చెలిమలు తీయించి,
శోధించే తత్వం నేర్పింది.🌿

🍃సీతాఫలాల కోసం చెట్ల చుట్టూ తిరిగించి,
అన్వేషణ నేర్పింది.🍃

🌿తుమ్మ ముల్లు, పల్లేరు గాయాల గుచ్ఛులతో,
జీవితం పూలపాన్పు కాదని నేర్పింది.🌿

🌾వేరుశనగ కాయ కొట్టించి, సోలెడు పల్లీలు  తీయించి,
ఐదు పైసల సంపాదన నేర్పింది.🌾

🐂ఆవులతో, 🐃గేదెలతో, 🐓కోళ్లతో స్నేహం🐔 చేయించి,
ప్రాణికోటి పై బాధ్యత పెంచింది,  ప్రేమతత్వాన్ని నేర్పింది.♥️

🕊️వేలాడే పిచుక గూళ్ళు, చెట్ల కొమ్మల పంగల మధ్య కొంగ గూళ్ళు చూపించి
బొమ్మరిల్లు కట్టించి, 
చిన్నప్పుడే సివిల్ ఇంజనీరింగ్ నేర్పింది.🕊️

🍂పొలం పనుల్లో చిన్న చిన్న దెబ్బలు తగిలితే,
నల్లాలం  ఆకు పసరు పోయించి,
చిన్న చిన్న ఇంటి వైద్యం చిట్కాలు నేర్పింది.🍂

🌳చెట్టుమీద 🍋మామిడికాయ
గురిచూసి కొట్టడం,  లక్ష్యాన్ని ఛేదించడం నేర్పింది.🌳

☝️నిండు బిందెను నెత్తి మీద పెట్టి, నీళ్లు మోయించి,
జీవితమంటే బరువు బాధ్యత అని నేర్పింది.☝️

🏵️బావి నుండి బొక్కెనతో నీళ్లు తోడించి,
బాలన్స్ గా బరువు లాగటం నేర్పింది.🏵️

🍀ఇంటి ముంగిటకు  అతిథి దేవతలు
హరిదాసులు గంగిరెద్దులను రప్పించి,
ఉన్న దాంట్లో కొంత  పంచుకునే గుణం నేర్పింది,🍀

🌾ఇసుకలో పిట్ట గూళ్ళు కట్టించి,
ఒక ఇంటి వాడివి కావాలి అనే స్పృహను నింపింది.🌾

🍀పచ్చపచ్చని నిగనిగలాడే మోదుగాకుల  విస్తరిలో,
అన్నం అంచులు దాటి కింద పడిపోకుండా తినే
ఒద్దికను నేర్పింది.🍀

🍃మోదుగాకులు తెంపించి, ఎండబెట్టించి, 
కట్టలు కట్టించి, విస్తరాకులు కుట్టించి,
అతిథులకు ఎంగిలి కాని పాత్రల్లో భోజనం వడ్డించడం నేర్పింది.🍃

👬ఉన్న ఒక్క పిప్పర్మెంట్ ను, అంగీ బట్ట వేసి, కొరికి ముక్కలు చేసి,
కాకి ఎంగిలి పేరుతొ దోస్తులతో పంచుకోవటం నేర్పింది.👬

👨‍❤️‍👨ముళ్ళు గుచ్చుకోకుండా,  ఒక్కటొక్కటిగా రేగ్గాయలు తెంపే 
ఓర్పును నేర్పింది.👨‍❤️‍👨

👬ఎండా కాలంలో తుమ్మ చెట్ల బంక సేకరణ,
స్వయం సంపాదన ధోరణి నేర్పింది.👬

🏹వాయిలి బరిగెలతో, సుతిలి దారంతో విల్లును చేయించి,
వస్తు తయారీ మెళకువలు నేర్పింది.🏹

👨‍👩‍👦‍👦అత్తా, మామా, అన్నా  వదినా,  అమ్మమ్మా, నాయినమ్మా, తాతయ్యా వరుసలతో,
ఊరు ఊరంతా ఒక కుటుంబమనే ఆత్మీయత నేర్పింది.👩‍👩‍👧‍👧

👌మా ఊరు నాకు ఎంత ఇష్టం అంటే,
మా అమ్మా బాపు ఎంత ఇష్టమో, అంత ఇష్టం 👌

👍ధైర్యంగా  బ్రతికే  పాఠాలను నేర్పిన
మా ఊరుకు పల్లెకు మేము జీవితాంతం రుణపడి ఉంటాం.👍

🌳నేను గ్రామం లో (పల్లెలో) పుట్టి పెరిగాను అని చెప్పటానికి సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా..🌳

Sekarana

No comments:

Post a Comment