*`చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో..!!`*
*మా మాస్టారు నన్ను కొట్టినప్పుడల్లా ప్రతీదెబ్బ తిన్న వెంటనే నేను చేతులను దులుపుకుని నా లాగుకి రాసుకున్న తర్వాతే రెండో దెబ్బకు చెయ్యి చాచేవాణ్ణి..!*
*శుచి-శుభ్రత అన్నది నాకు అప్పటినుంచే ఉండేది తెలుసా..!*
*అప్పట్లో మా గురువులంతా పాఠం చెప్పినంతసేపూ నిలబడే ఉండేవాళ్ళు,ఎందుకో తెలుసా? గౌరవం...నేనంటే వాళ్ళకి అంత గౌరవం...!*
*నేను చదువుకునే రోజుల్లో*
*మా గురువులు నాలుగురోజులకొకసారి*
*మా నాన్నగారిని తీసుకుని రమ్మనే వారు! ఎందుకంటే వాళ్ళందరూ ఏ విషయమైనా నాకు సూటిగా చెప్పడానికి చాలా భయపడేవారు*
*నేను రాసినవి చదవడానికి*
*మా గురువులంతా చాలా ఇష్టపడేవారు. అందుకే వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలకు కొన్ని వందలసార్లు మళ్ళీ మళ్ళీ రాసి చూపించమని ప్రతీరోజూ అభ్యర్థించేవారు!*
*మా గురువులందరూ నన్ను "వీడొక సింహబలుడు" అన్నట్టుగా చూసేవారు. అందుకే వాళ్ళకి ఏమాత్రం భయం వేసినా క్లాసులో నుంచి నన్ను బయటకు పంపి గుమ్మం దగ్గర కాపలా కోసం నిల్చోబెట్టేవారు.*
*మా గురువులకి నేను చాలా తెలివైనవాడిని అనే భావన బాగా బలంగా ఉండేది.అందుకే వాళ్ళంతా,*
*"ఒరేయ్, నువ్వు స్కూలుకి ఎందుకొస్తావురా.*
*పోయి ఎక్కడైనా పనిలో చేరిపోవచ్చు కదా!", అని కనీసం రోజుకోసారైనా అనేవారు!*
*అంటే... చిన్నప్పుడే నేను ఉద్యోగం చేసే తెలివి తేటలు సమర్ధత ఉన్నాయి అని ముందుగానే గ్రహించారు అన్నమాట..*
*అందుకే, నా చిన్నతనం నిజంగా ఒక స్వర్ణ యుగం...*
No comments:
Post a Comment