Thursday, January 9, 2025

 వైరస్ కు కూడా సీక్వెల్స్ ఉంటాయి .

కరోనా - 1 ..
 కరోనా -2 ..
 ఈ రెండు ...    పాండెమిక్ దశలు .
అటు పై కరోనా - ౩ అంటే ఓమిక్రాన్ వచ్చింది .
 మనం లెక్క వేసుకోలేదు కానీ...  ఇప్పటికి కరోనా 4 , 5 , 6  వచ్చి పోయి ఉంటాయి . ఇది ఎండెమిక్ దశ . 

రెండు దాటితే..  పాండెమిక్ ... ఎండెమిక్ అయిపోతుంది .

 పాండెమిక్   కు...  ఎండెమిక్ కు తేడా తెలుసుకోవడం అవసరం .

వైరస్ తొలిసారిగా పుట్టినప్పుడు { కరోనా విషయం లో పుట్టించినప్పుడు అని వాడాలి } అది పాండెమిక్   అయ్యే అవకాశముంది .
 గాలి ద్వారా వ్యాపించేది..  అంటే శ్వాసకోస సంక్రమణ . సహజంగానే వేగంగా విస్తరిస్తుంది .

వైరస్ ను చంపే మందు ఇప్పటి వరకు రాలేదు . 
భవిషత్తు లో రావడం అంత ఈజీ కాదు . 
వైరస్ వేగంగా సంతానోత్పత్తి చేయకుండా...  ఇతర కణాలకు చొరబడకుండా చేసే మందులు మాత్రం  వచ్చాయి .

కాబట్టి అది వందేళ్ల నాటి స్పానిష్ ఫ్లూ కావొచ్చు . మొన్నటి కరోనా కావొచ్చు .
 వైరస్ ను చంపింది మనుషుల శరీరంలోని ఇమ్మ్యూనిటి వ్యవస్థే .
 అదే సోలో హీరో .

వ్యక్తి ఇమ్మ్యూనిటి...  బాహుబలి లా బలీయంగా ఉంటే...  కనీసం  మాదిరిగా ఉంటే..  వైరస్ చచ్చి ఊరుకుంటుంది. ఇమ్మ్యూనిటి బలహీనంగా ఉన్న వారు పండెమిక్ దశలో మరణిస్తారు .

పండెమిక్ దశలో వైరస్ ఇంచు మించు జనాభా మొత్తానికి సోకుతుంది . { ముఖ్యంగా గాలి ద్వారా వ్యాపించే కరోనా లాంటివి } కనీసం ఎనభై శాతానికి సోకినప్పుడు హెర్డ్ ఇమ్మ్యూనిటి వస్తుంది . 

వైరస్  సోకినప్పుడు...  ఇమ్మ్యూనిటి కనీసం ఒక స్థాయిలో ఉన్నవారు బతుకుతారు అని చెప్పుకొన్నాము కదా .
 వీరి ఇమ్మ్యూనిటి వైరస్ తో పోరాడి విజయం సాధించింది .

 ఇమ్మ్యూనిటీ కి సెల్ఫీ పిచ్చి . 
అదే మానవాళిని కాపాడేది .

మనకైతే సెల్ఫీ పిచ్చి... ఇటీవలి కాలం లో వచ్చింది . 
మన ఇమ్మ్యూనిటీ కి అనాదిగా ఉంది.

వైరస్ అంటే శత్రువు కదా . శత్రువు ను చంపుతున్నప్పుడు  అది సెల్ఫీ తీసుకొని భద్ర పర్చుకుంటుంది .
సెల్ఫీ అంటే సెల్ఫీ కాదు లెండి .
 సైన్స్ విషయాలు మీకు ఆసక్తి కరంగా సులభంగా అర్థం అయ్యేందుకు ఆలా చెప్పాను. 
ఇమ్మ్యూనిటి కి ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంటుంది . ఇమ్మ్యూనిటి లోని మెమరీ - బి సెల్స్ , మెమరీ-  టి సెల్స్ వైరస్ ను గుర్తు పెట్టుకొంటాయి .

దీన్నే ...టి సెల్స్ రక్షణ...  అని అని నేను కరోనా కాలంలో పుంఖానుపుంఖాలుగా రాసాను .
ఒక్కసారి వైరస్/బాక్టీరియా   సోకితే టి సెల్స్ రక్షణ వచ్చేస్తుంది . 
టి సెల్స్ ఆ రోగకారక జీవిని  గుర్తుపెట్టుకొని ఇంకో సారి సోకితే టక్కున చంపేస్తాయి . 
అంటే వైరస్,  బాక్టీరియా లాంటి రోగకారక జీవులకు ఒకే ఒక  ఛాన్స్. అప్పుడే దాని బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ . 
సీక్వెల్ తీసి రెండో సారి మూడో సారి సోకితే ప్లాప్ అయ్యే అవకాశం ఎక్కువ  
 అందుకే పాండెమిక్  దశ దాటితే వచ్చేది ఎండెమిక్ దశ .

   పాండెమిక్ లో ఒకటా?  రెండా?
 ఎన్ని వేవ్ లు ?
 అనేది మొదటి దశలో వ్యాధి ఎంత మందికి సోకింది?  అనే దాని పై ఆధారపడుతుంది . కరోనా మొదటి వేవ్ లో పెద్దగా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ... పాకిస్థాన్ ... హైదరాబాద్ పాతబస్తీ లాంటి చోట్ల ఎక్కువ మందికి సోకడం .. హెర్డ్ ఇమ్మ్యూనిటి రావడం జరిగిపోయింది . ఇక్కడ తొలి దశలోనే ఎక్కువ నష్టం జరిగింది .
 రెండో దశ ఇక్కడ పెద్దగా ప్రభావం చూపలేదు . అదే ఎక్కువ జాగ్రత్తలు తీసుకొన్న చోట్ల హెర్డ్ ఇమ్మ్యూనిటీ రాక రెండో దశ అరివీర భయంకరం అయ్యింది .
ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే ముందుగా   పాండెమిక్   దశ .
 అటు పై ఎండెమిక్ దశ .

 ఎండెమిక్ దశ అంటే వైరస్ పోదు .
 వైరస్ పోతుంది అనుకోవడం మన అమాయకత్వం . 

పండెమిక్ దశ తరువాత అది మన మధ్య స్థిరపడిపోతుంది . 
మన శరీరాల్లో అప్పటికే దానికి సంభందించిన సహజ ఇమ్మ్యూనిటి ఉంటుంది .
 అదేనండి టి సెల్స్ రక్షణ . 
దానితో వైరస్ తోక ముడిస్తుంది . 

మరీ బలహీనమయిన ఇమ్మ్యూనిటి వ్యవస్థ వున్నవారిని తప్పించి అది సీక్వెల్ లో  ఎవరినీ ఏమీ చేయలేదు  .. 
అంటే వారి ఇమ్మ్యూనిటీ ఇటీవల బాగా బలహీనం   అయి ఉంటే టి సెల్స్ రక్షణ కూడా ఏమీ చేయలేదు . అలాంటి వారే ఎండెమిక్ దశలో కూడా చనిపోతారు .

HMPV  - దీన్ని గుర్తించింది 2001 . దానికి కనీసం యాభై ఏళ్ళ ముందు నుంచి ఇది ఉందని శాస్త్రవేత్తల  అంచనా.

ఇది గాలి ద్వారా    సోకే వైరస్ . 
మన దేశం లో జనాభా,  జనసాంద్రత ఎక్కువ .
ఇన్నాళ్లు ఇది చాప వేసుకొని  పడుకొని ఉంటుందా ?

అప్పట్లో సరిగా రికార్డు చేయలేదు కానీ ఇది ఏనాడో ... అంటే మన తాత గారి కాలం లోనే పాండెమిక్ దశ దాటి ఎండెమిక్ అయిపోయుంటుంది ?

2  తరువాత...  1  ఎలా వస్తుంది పుష్పా?
HMPV   ఇప్పుడు పండెమిక్ కాబోతుంది అని ప్రచారం .
ఎండెమిక్ అయ్యింది...  పండెమిక్ ఎలా అవుతుంది ?

ఇది మనందరికీ ఏనాడో సోకి ఉంటుంది .
 ఒకటి కాదు...  అనేక సార్లు సోకివుంటుంది .
 దీనికి సంభందించిన టి సెల్స్ రక్షణ మనకు ఉంది . 

ఇంకో మాట .

హీరో గారు పిల్లి గడ్డం పెట్టుకొని వస్తే...  విలన్ గుర్తించలేడు... . ఇది సినిమాల్లో .
కానీ ఇది నిజజీవితం . ఇక్కడ ఉన్నది బాహుబలి ఇమ్మ్యూనిటి హీరో . 
వైరస్ ఎన్ని వేషాలు వేసినా.. అంటే  ఎన్ని మ్యుటేషన్ లు  పొందినా బి సెల్స్,  టి సెల్స్ టక్కున పట్టేస్తాయి .
ఇది ఖాయం . 

కాబట్టి HMPV  పండెమిక్ కాబోదు .
 టెస్ట్ లు చేస్తే కేవలం నాలుగు నగరాల్లో కాదు.   ఊరువాడా   దీని ఆనవాళ్లు కనిపిస్తాయి .
ఇప్పుడు .. ఆ మాటకొస్తే ఎప్పుడూ...  కావలసింది  బలమైన ఇమ్మ్యూనిటి వ్యవస్థ . 
అదే శ్రీరామ రక్ష.  

1 . భయానికి ... స్ట్రెస్ కు దూరంగా ఉండండి. 
ఇవి ఇమ్మ్యూనిటి ని చంపేస్తాయి . 
టీవీ గొట్టాలముందు కూర్చుని" కరోనా చంపేస్తుంది" అని భయపడిన వారిలో చాలా మంది నేడు మన మధ్య లేరు .
 అదే తప్పు చెయ్యొద్దు .
2 . డి విటమిన్ కీలకం . కనీసం అరగంట ఎండలో నడవండి . సాయంకాలం లేదా పొద్దున్న వాకింగ్ . 
వీలు కాకపోతే డి విటమిన్ టాబ్లెట్ .

3 . వ్యాయామం తప్పని సరి . జిం లేదా యోగ . కనీసం నడక . సెల్ ఫోన్ లో మాట్లాడుతూ కాదు . వేగంగా నుదుట చెమట పట్టేలా నడవాలి . లేదా కనీసం ఇంటి పని..  వంటపని చెయ్యండి .

4 . సి విటమిన్ కోసం .. నిమ్మ నారింజ . జింక్ కోసం మూడు నాలుగు ఎండు ద్రాక్ష లేదా గుమ్మడి విత్తనాలు . ప్రోటీన్ కోసం చికెన్,  ఎగ్...  శాఖాహారులు పన్నీర్ , పుట్టగొడుగులు 
.పురుషులు నాలుగు..  స్రీలు మూడు లీటర్ ల నీరు .
5 . కనీసం ఏడు గంటల నిద్ర .
6    తెల్లనం తగ్గించండి . మైదా వద్దు . రాగులు జొన్నలు దంపుడు బియ్యం . ఆదీ పరిమితంగా . ఆకుకూరలు కాయగూరలు సమృద్ధిగా .

ముక్కు దిబ్బడ , ముక్కునుంచి చీమిడి కారడం , దగ్గు , గొంతు నొప్పి 102 డిగ్రీ ల దాక జ్వరం , తలనొప్పి నీరసం . ఇవి HMPV  మైల్డ్ లక్షణాలు .

 దగ్గు బాగా పెరిగి ఊపిరి తీసుకోవడం కష్టం అయినప్పుడు...  102  దాటిన జ్వరం...  కండరాల నొప్పలు...  పెదాలు,  వేళ్ళు నీలంగా మారడం...  వాంతి ... పైకి లేవలేనంత నీరసం .. ఇవి వ్యాధి బాగా ముదురుతోంది అని చెప్పే లక్షణాలు . 
ఇలాంటి స్థితి లో డాక్టర్ ను సంప్రదించడం అవసరం . 
ఈ అవసరం  బహుశా  వెయ్యిలో ఒకరికి ఏర్పడొచ్చు . 

సర్వే జనా సుఖినోభవంతు !

No comments:

Post a Comment