వేటాడుతాం, మట్టిలో కలిపేస్తాం..!!
కలలో కూడా ఊహించని శిక్ష వేస్తాం
______ప్రధాని మోదీ మాస్ వార్నింగ్
పహల్గాం ఘటన పైన మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. బీహార్ లో పర్యటనలో భాగంగా పహల్గాం ఘటన పైన మోదీ స్పందించారు. భారత్ పైన దుస్సాహసానికి దిగిన వారిని వదిలేని లేదని మోదీ స్పష్టం చేసారు.
ప్రధాని మోదీ ఉగ్రవాదులు..వారి మద్దతు దారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ ఆత్మ పైన దుస్సాహసం చేసారని మండిపడ్డారు. దేశం దుఃఖంలో ఉందని చెప్పారు. ఈ దాడి పర్యాటకుల పై దాడి కాదు దేశంపై దాడిగా పేర్కొన్నారు. ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను.. దాని వెనుక ఉన్నవారికి ఊహించిన దానికంటే ఎక్కువ శిక్ష పడుతుందని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది. ప్రపంచానికి తెలియజేస్తున్నా ఉగ్రవాదులను వదిలి పెట్టమని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు.
No comments:
Post a Comment