🔔 ఆణిముత్యాలు 🔔
“దేవుడు కోరుకున్నంత ధనం ఇవ్వకపోవచ్చు,
కానీ కోరుకున్నదానికంటే ఎక్కువ మంచి గుణం ఇచ్చాడు అంటే —
అదే నిజమైన అదృష్టం.” 🌿
“నీవు ప్రసాదం వండి పెట్టడమే నైవేద్యం కాదు.
నీ జీవితమే భగవంతుని ప్రసాదమని తెలుసుకోవడమే —
నిజమైన నైవేద్యం.” 🌸
“ఆలోచనల్లో — విశ్వాసం,
కార్యాల్లో — ధైర్యం,
మాటల్లో — వివేకం,
జీవితంలో — సేవాభావం
ఎప్పుడూ కలిగి ఉండాలి.” 🌼
“కడుపులోకి వెళ్లిన విషం — ప్రాణాలను తీస్తుంది.
చెవిలోకి వెళ్లిన విషయం — బంధాలను చంపేస్తుంది.” 💫
“మన కోసం ఏడ్చేవాళ్లూ,
మన నవ్వు కోసం ఎదురుచూసేవాళ్లూ
ఉండాలి అంటే — పెట్టి పుట్టాలి.” 🌷
“మనిషిలో మంచితనం కనిపించినా
ప్రశంసించడానికి నోరు కదలదు.
కానీ కనపడని చెడుపై చర్చించడానికి —
మూగవాడికీ మాటలు వస్తాయి.” 🌺
🙏 సర్వేజనాః సుఖినో భవంతు 🙏
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
No comments:
Post a Comment