🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
🙏 *గంగాస్నానం* 🙏
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
*నాస్తి గంగా సమం తీర్థం*
*కలికల్మషనాశనం*
*నాస్తిముక్తి ప్రదం క్షేత్రం*
*అవిముక్తం సమంహారే*
కలిదోషాల్ని పరిహరించటంలో గంగానదితో సమానమైన తీర్థం మరొకటి లేదు.
అలాగే ముక్తిని ప్రదానం చేసే దివ్యక్షేత్రాలలో అవిముక్త క్షేత్రాన్ని మించిన క్షేత్రం లేదు .
*గంగానదిలో తిథివార నక్షత్ర నియమాలు లేకుండానే స్నానం చేయవచ్చు .
*కాశీలో ఉన్న గంగని సేవించినవాడు , గంగా దేవికి మందిరాన్ని నిర్మించినవాడు సమస్త సుఖభోగాల్ని పొందుతాడు .
*పితృదేవతల్ని ఉద్దేశించి వారి పేర్లు స్మరిస్తూ గంగలోని నీళ్లతో ఏ శివలింగానికి అభిషేకం చేసినా , వారి పితురులకి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి .
*గంగాజలంతో సూర్యుడికి అర్ఘ్యలు సమర్పిస్తే ఆరోగ్యం బాగుంటుంది .
*గంగాస్నానం చేసే వారిజోలికి యమదూతలు ఎప్పుడు రారు .
*కాశీలోని గంగా తీరంలో గోదానం , భూదానం , సువర్ణదానం , అన్నదానం చేసినవారికి పునర్జన్మ ఉండదు .
*మకరసంక్రమణం ,
ఉత్తర , దక్షిణాయనాలు ,
సూర్య చంద్రగ్రహణాలు
తదితర పర్వదినాలలో..
కాశీ గంగలో చేసే స్నానం అనంతమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది .
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
No comments:
Post a Comment