Thursday, January 1, 2026

మ్యూజిక్ వల్ల మెదడులో ఏం జరుగుతోంది? Music and Brain telugu #facts #factsintelugu #brainfacts #brain

మ్యూజిక్ వల్ల మెదడులో ఏం జరుగుతోంది? Music and Brain telugu #facts #factsintelugu #brainfacts #brain

https://youtu.be/LnR113S4ESU?si=MblYi-mrVUnH4t61


https://www.youtube.com/watch?v=LnR113S4ESU

Transcript:
(00:00) మీరు వినే పాటలు మీ బ్రెయిన్ ని ఎలా రీప్రోగ్రామ్ చేస్తాయి మీరు మీకు నచ్చిన పాట వింటున్నారు. అదే సమయంలో మీ కళ్ళు మూసుకుంటాయి. మీ శ్వాస నెమ్మదిస్తుంది. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇలా జరగడం మ్యాజిక్ కాదు దీని వెనక న్యూరో సైన్స్ ఉంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఇవి తెలుసుకుంటారు. ఎందుకు కొన్ని పాటలు మనల్ని ఏడిపిస్తాయి?ఎ ఎందుకు కొన్ని పాటలు మనకి ఎక్కడ లేని కిక్ ఇస్తాయి మ్యూజిక్ మన ఐక్యూ మెమరీ ఫోకస్ ని ఎలా పెంచుతుంది? హలో ఫ్రెండ్స్ మ్యూజిక్ మన బ్రెయిన్ కి ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ లాంటిది.
(00:45) మన బ్రెయిన్ ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. దానిలో జరిగే ఎలక్ట్రికల్ యాక్టివిటీ కారణంగానే మన బాడీ పార్ట్స్ అన్నీ కరెక్ట్ గా పనిచేస్తాయి. బ్రెయిన్ లో ప్రసరించే ఈ ఎలక్ట్రికల్ తరంగాలను బ్రెయిన్ వేవ్స్ అంటారు. ఈ బ్రెయిన్ వేవ్స్ కి ఉండే ఫ్రీక్వెన్సీ ఆధారంగా వీటిని ఐదు రకాలుగా విభజించారు. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఉండే బ్రెయిన్ వేవ్స్ ని డెల్టా వేవ్స్ కాస్త మగతగా లేదా మెడిటేషన్ లో ఉన్నప్పుడు θీట వేవ్స్ రిలాక్స్డ్ గా ఉన్న లేదా కాస్త ఫోకస్డ్ గా ఉన్న ఆల్ఫా వేవ్స్ అలర్ట్ గా ఉండి యక్టివ్ గా ఆలోచిస్తున్నప్పుడు బీటా వేవ్స్ బాగా ఎక్కువగా ఏదైనా విషయంపై ఫోకస్
(01:28) చేస్తున్నప్పుడు గామా వేవ్స్ ఇలా మన మెంటల్ స్టేజ్ ని బట్టి బ్రెయిన్ వేవ్స్ పనిచేస్తాయి అయితే మనం మన ఇష్టమైన సంగీతం వింటున్నప్పుడు ఏమవుతుంది? మంచి మ్యూజిక్ వింటున్నప్పుడు మన బ్రెయిన్ బీటా నుంచి ఆల్ఫా మరియు తీటా కి షిఫ్ట్ అవుతుంది. అంటే మన స్ట్రెస్ తగ్గుతుంది. ఫోకస్ పెరుగుతుంది. కొత్త కొత్త ఐడియాలు బ్రెయిన్ లో పుడతాయి.
(01:59) అందుకే గొప్ప గొప్ప రైటర్స్ స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ కోడింగ్ చేసేవాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో ఏదో మ్యూజిక్ వింటూనే ఉంటారు. ఎందుకు మంచి మ్యూజిక్ మనల్ని ఎక్కువగా ఫోకస్ చేసేలా చేస్తుంది. మనం సైలెంట్ గా ఉన్నప్పుడు మన బ్రెయిన్ వేల ఆలోచనలతో నాయిసీగా ఉంటుంది. కానీ సంగీతం మన ఆలోచనలకు ఒక లైన్ ఇస్తుంది.
(02:31) దీనినే ఆడిటరీ ఎంటర్టైన్మెంట్ అంటారు. అంటే మీ బ్రెయిన్ ఆ పాట రిథం కు సింక్రనైజ్ అవుతుంది. స్లో మ్యూజిక్ వింటే బ్రెయిన్ కామ్ అవుతుంది. ఫాస్ట్ బీట్స్ వింటే బ్రెయిన్ అలర్ట్ గా ఉంటుంది. లోఫై క్లాసికల్ ఇన్స్ట్రుమెంటల్ ఇవన్నీ ఫోకస్ పెంచే మ్యూజిక్లు అయితే కొన్నిసార్లు మనం కనెక్ట్ అయ్యే లిరిక్స్ ఉన్న పాటలు మనల్ని చేస్తున్న పని నుంచి డిస్ట్రాక్ట్ చేస్తాయి.
(03:04) మ్యూజిక్ కి డోపమైన్ కి సంబంధం ఏంటి? మీరు ఇష్టమైన పాట వింటే మీ బ్రెయిన్ లో ఒక కెమికల్ విడుదల అవుతుంది. అదే డోపమైన్ ఇదే మనలో మోటివేషన్ కి ఆనందానికి క్రియేటివిటీకి ఏదైనా నేర్చుకోవాలనే తపనకి కారణం. అంటే మనం వినే మ్యూజిక్ ఒక నాచురల్ బ్రెయిన్ బూస్టర్ అని చెప్పాలి. నిజంగా మ్యూజిక్ ఇచ్చే కిక్ గురించి తెలుసుకుంటే మనుషులు టీ కాఫీల జోలికి పోరు.
(03:40) క్రియేటివ్ గా ఆలోచించే వ్యక్తులు మ్యూజిక్ ఎందుకు వింటారు? మీకు ఇది తెలుసా ఐన్స్టీన్ వైలెన్ వాయించేవాడు.ఆపిల్ ఐఫోన్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ ఒక గొప్ప క్లాసికల్ మ్యూజిక్ ఫ్యాన్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ రోజు మెడిటేషన్ మ్యూజిక్ వింటాడు. ఎందుకంటే మ్యూజిక్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండిటిని కలుపుతుంది.
(04:10) అంటే లాజిక్ ని ఇమాజినేషన్ ని కలిపినట్టు బ్రెయిన్ లో జరిగే ఈ స్టేట్ నే ఫ్లో స్టేట్ అంటారు. ఈ ఫ్లో స్టేట్ లోనే గొప్ప గొప్ప ఐడియాలు కొత్త ఆవిష్కరణలు అద్భుతమైన ఆర్ట్ పుడుతుంది. మ్యూజిక్ కి బ్రెయిన్ మెమరీకి సంబంధం ఏంటి? మీరు ఎప్పుడో చిన్నప్పుడు విన్న పాట ఈరోజు మళ్ళీ వింటే అదే ఫీలింగ్ వస్తుంది కదా జ్ఞాపక శక్తి సరిగా లేని అల్జీమర్స్ పేషెంట్లు పాత పాటలు పాడగలుగుతారు.
(04:46) సంగీతం మీ జ్ఞాపకాలను ఫ్రీజ్ చేసి ఉంచుతుంది. కాబట్టి మీ జీవితంలో మరుపురాని సన్నివేశాలను గుర్తుంచుకోవాలంటే సంగీతంలో జీవించండి. సంగీతం మన dఎన్ఏ ని కూడా ప్రభావితం చేస్తుందా? ఎస్ కామ్ మ్యూజిక్ స్ట్రెస్ హార్మోన్స్ ని తగ్గిస్తుంది. దీనివల్ల బాడీ తనను తాను నాచురల్ గా రిపేర్ చేసుకునేందుకు తోడ్పడే హీలింగ్ జీన్స్ యక్టివేట్ అవుతాయి.
(05:18) వైలెంట్ మ్యూజిక్ వింటే బాడీలో కార్టిసాల్ పెరుగుతుంది. దీనివల్ల మనకు రోగాలు వచ్చే రిస్క్ పెరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి మీరు వినే పాటలు మీకు హెల్త్ బూస్టర్స్ లాంటివి మీ మెదడుకు సరైన సంగీతాన్ని ఎలా ఎంచుకోవాలి? బాగా చదువుకోవడానికి లోఫై క్లాసికల్ బైనోరల్ బీట్స్ మ్యూజిక్ యక్టివ్ గా పని చేయడానికి ఇన్స్ట్రుమెంటల్ యంబియంట్ మ్యూజిక్ క్రియేటివిటీ కోసం సాఫ్ట్ మ్యూజిక్ లేదా ఏదైనా మంచి మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ స్ట్రెస్ తగ్గడానికి నాచురల్ సౌండ్స్ ఫ్లూట్ మ్యూజిక్ లేదా రైన్ మ్యూజిక్ వినాలి.
(06:02) సాడ్ సాంగ్స్ వింటే మీ బ్రెయిన్ నెగిటివ్ లూప్ లో పడుతుంది. కాబట్టి మీ మ్యూజిక్ మీ మూడ్ ని మాత్రమే కాదు మీ భవిష్యత్తును కూడా డిజైన్ చేస్తుంది. మీ బ్రెయిన్ ఒక లైవ్ ఆర్కెస్ట్రా మీ బ్రెయిన్ లో 86 బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి. ప్రతి ఒక్కటి ఒక వైర్ కాదు ఒక సంగీత వాయిద్యం మీ ఆలోచనలు వైలెన్ అయితే మీ భయాలు డ్రమ్స్ మీ ఆనందం ఫ్లూట్ అయితే మీ జ్ఞాపకాలు పియానో ఇవన్నీ కలిసినప్పుడు మీ మైండ్ సింఫనీ అనే స్టేట్ లోకి చేరుకుంటుంది.
(06:44) అందుకే మనం సంగీతం వింటున్నప్పుడు బయట పాట కాదు లోపల పాట ప్లే అవుతుంది. అందుకే కొన్ని పాటలు మన మనసుని కదిలిస్తాయి. మ్యూజిక్ కి దైవభక్తికి లింక్ ఏంటి? గుడిగంటలు వేదపటణం సూఫీ మ్యూజిక్ టిబెటన్ బౌల్స్ ఇవన్నీ మన బ్రెయిన్ ని తీటా అండ్ గామా స్టేట్ లోకి తీసుకువెళ్తాయి. ఈ స్టేట్ లోనే మనలో ఇన్నర్ పీస్ వస్తుంది. అందుకే సంగీతం మనిషిని దేవుడికి దగ్గర చేస్తుంది.
(07:19) కాబట్టి ఫ్రెండ్స్ మీరు రోజు వినే పాట మీ ఆలోచనల్ని మీ ఫోకస్ ని మీ జీవితాన్నే మార్చేస్తుంది. మీరు తినే ఆహారం మీ శరీరం అవుతుంది. మీరు వినే సంగీతం మీ ఆలోచన అవుతుంది. మీ ఆలోచనే మీ జీవితం అవుతుంది. కాబట్టి మీ మొబైల్ లో ఉండే మీ మ్యూజిక్ ప్లేలిస్ట్ ఈక్వల్ టు మీ డెస్టినీ మీరు సంగీత ప్రియులయితే Amazమon లో ఉన్న బెస్ట్ బడ్జెట్ నాయిస్ కాయాన్సిలింగ్ హెడ్ఫోన్స్ నాయిస్ కాయాన్సిలింగ్ ఇయర్ బడ్స్ బెస్ట్ బ్లూటూత్ స్పీకర్స్ మినీ పోర్టబుల్ స్పీకర్స్ లింక్స్ డిస్క్రిప్షన్ లో షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి.
(07:59) ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ కోసం నోటిఫికేషన్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ వీడియోతో కలుద్దాం.

No comments:

Post a Comment