Friday, February 6, 2026

 [1/24, 12:48] null: @:ఎంత మందిలో ఉన్నావ్?@
             69వ రోజు
       తేది: 24/01/2026
""""""""""""""""""""""""""""""""""""""""""""
    సంఘం శరణం గచ్చామి 1

రాజేష్ అనేక వాట్సప్ గ్రూపుల్లో సభ్యుడు...
రకరకాల సమాచారాలు చలామణీ చేస్తుంటాడు ఒక రోజు హఠాత్తుగా ఆత్మహత్య
చేసుకున్నాడని తెలిసింది అంతా
ఆశ్చర్యపోయారు...

ఎందుకు అలా చేశాడు? అని ఎవరో వాట్సప్
గ్రూపుల్లో ప్రశ్నించారు.?
ఏ ఒక్కరి నుంచీ సమాధానం రాలేదు ఎవరికి
వారే తమకు తెలియదంటే తమకు తెలియదని
చెబుతూపోయారు
ఇంతమందితో సంబంధ బాంధవ్యాలు ఉన్న ఆమనిషికి ఎవరితోనూ మనసు విప్పి
మాట్లాడుకునేంత బంధం లేదు
అందుకే మనకు కావాల్సింది వందల మందితో
నెట్వర్క్ కాదు నలుగురైనా ఆత్మీయులు ఉండడం చక్కని హృదయపూర్వక సంబంధం
మనసులో విషయాలను పంచుకోగలిగే సాన్నిహిత్యం...
[1/25, 15:20] null: *@ ఊరంతా... ఆమే !@
         70వ రోజు
    తేది:25/01/2026
""""""""""""""""""'"""""""""""""""""
సంఘం శరణం గచ్చామి 2

తూర్పుగోదావరి జిల్లాలో అదో ఊరు
రాత్రి ఏడు అయ్యేసరికి ఆవీధి మధ్యలో
అటు, ఇటు ఉన్న పెద్ద పెద్ద వీధి అరుగుల ఇళ్ల
మీదకు ఆ వీధిలో ఉండేవారంతా చేరేవారు
ముసలి నుంచి చిన్న వాళ్ల వరకు
ఎన్నో కబుర్లు...
అందరి యోగక్షేమాలు...
ఆ ఊరి మంచి చెడ్డలు అందరి విషయాలూ చర్చకు వచ్చేవి
ఒక రోజు ఎవరో అన్నారు వీరమ్మ గారు
ఇంకా రాలేదేమిటి అనీ...

ఈలోపు మరెవరో అన్నారు వాళ్లింట్లో
వాళ్లంతా పెళ్లికి వెళ్లారు ఈవిడ పెద్దదైందని
రాలేనంటే విడిచి వెళ్లారు రాత్రికి
వచ్చేస్తామన్నారు అని...
అమ్మా సుశీలా ఒకసారి వెళ్లి చూసిరా మరో
పెద్దాయన పురమాయించారు
ఆమె వెళ్లి చూస్తే వీరమ్మ సాయంత్రం నుంచి
తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని తెలిసింది
ఒక్కసారిగా అందరూ స్పందించారు
ఎవరో ఒకరి ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోను
ఉంటే డాక్టర్ ఉన్నారో లేదో కనుక్కునేందుకు
పరుగు తీశారు మరొకరు
రిక్షా తీసుకువచ్చేందుకు సైకిల్ ఎక్కారు
మరో ఇద్దరు, ముగ్గురు మహిళలు ఆమె దగ్గరకు వెళ్లి పరామర్శించారు వైద్యుని దగ్గరకు
వెళ్లేలా సిద్ధం చేశారు...

ఆఖరికి ఓ పదిమంది కలిసి ఆమెను డాక్టర్
దగ్గరకు తీసుకువెళ్లారు బండి ఉన్నాయన
దగ్గరలో టౌన్ కు వెళ్లి మందులు తెచ్చారు...

(దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి 'వీధి అరుగు'లో
ఓ భాగం...)

@ కాంటాక్ట్ లిస్ట్ పెద్దగా
ఉండటం కాదు...
కనెక్టివిటీ ఎంతుందనేది కీలకం...@*
[1/26, 20:35] null: *@ మాట... బంధం... @
          71 వ రోజు
      తేది:26/01/2026
""""""""""""""""""""""""""""""""""""""""
     రెండక్షరాల మంత్రాలు
~~~~~~~~~~~~~~~~
   సంఘం శరణం గచ్చామి 3

హెచ్ ఆర్ నుంచి పిలుపు వచ్చిందంటే అంతే సంగతులనే 
దశలో...
రాత్రి పది గంటలకు మెయిల్ వచ్చింది...
రేపు హెచ్ ఆర్ తో మీటింగ్ అనీ...
హార్ట్ బీట్ పెరిగింది నిద్ర పట్టడం లేదు 

ఆ క్షణంలో...
మీ భాగస్వామి ఉద్యోగం పోయినంత మాత్రన జీవితం పోయినట్టు కాదు ఏమైనా ఇద్దరం కలిసి చూసుకుందాం...
టెన్షన్ వద్దు 

@~ ఆ ఒక్క మాట
మనసును 
కుదుట పరిచింది...
జీవితాన్ని గెలవగలుగుతాననే 
ధైర్యాన్ని ఇచ్చింది...~@*
[1/28, 20:51] null: *@ మాట... బంధం...@
         72 వ రోజు
    తేది:28/01/2026
""""""""""""""""""""""""""""""""""
  రెండాక్షరాల మంత్రాలు
~~~~~~~~~~~~~~
సంఘం శరణం గచ్చామి 4

అఖిల్ ఇంటర్వ్యూల్లో బాగా
చేసినా క్యాంపస్ ప్లేస్ మెంట్ రాలేదు
ఫోన్ స్విచాఫ్... సోషల్
మీడియా ఎకౌంట్లన్నీ బంద్
ఇంట్లో కంగారు...

ఆ క్షణంలో ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య
అఖిల్ తో మాట్లాడాడు నాక్కూడా
ఇలాగే జరిగింది కొన్నిసార్లు కష్టపడ్డా
ఫలితం రాదు బహుశా ఇంతకంటే
మంచిదేదో నీకోసం వేచి
చూస్తోందేమో...?
అందుకే ఇది రాలేదేమో..!
ట్రై చేసి చూడు...

@~ ఈ సలహా అఖిల్ దారి మార్చింది
వెయ్యి ఏనుగుల బలాన్ని
నింపింది ఈ మార్పు వెనక
మనుషులే ఉన్నారు...~@*
[1/30, 17:45] null: *@ మాట... బంధం@
        73వ రోజు
 తేది: 30/01/2026
""""""""""""""""""""”"""""""""
రెండక్షరాలా మంత్రాలు
~~~~~~~~~~~~~
సంఘం శరణం గచ్చామి 5

నిద్రకు సిద్ధమవుతుండగా..
రాత్రి 11 గంటలకు..
ఫోన్ ట్రింగ్ మంది.
అపార్ట్ మెంట్ వాట్సప్ గ్రూప్ లో ఏదో
మెసేజ్ వచ్చింది...
అపార్ట్మెంటులో అందరికీ తలలో
నాలుకలా మెలిగే రాకేశ్ నుంచి
వచ్చిందది...

ఏమైనా ఆక్సిజన్ కాంటాక్ట్ ఉందా...?
అర్జెంట్- అన్నది సారాంశం
తెలిసిన ఆక్సిజన్ కాంటాక్టు ఇచ్చిన
వారు కొందరైతే...
ఏమైందని వెంటనే రాకేశ్ ప్లాట్ కి
పరుగెత్తినవారు మరికొందరు!
అందుకే బ్యాంక్ బ్యాలెన్స్
కంటే
మన సోషల్ కాంటాక్ట్ బలమైనదై
ఉండాలి..!

పిల్లలు అమెరికాలో...
తల్లిదండ్రులిద్దరూ
హైదరాబాద్ లో
నిమోనియాతో మంచం పట్టింది
పెద్దావిడ...
ఆవిడకు సేవ చేస్తూ కాలుజారి
పడగా, తొంటి ఎముక విరిగింది
పెద్దాయనకు...
రోజూ పొద్దున్నే వాకింగ్ కి
వచ్చే పెద్దాయన రాకపోవటంతో
వాకింగ్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసరికి
కూలబడి ఉన్నాడాయన అద్దె
పోర్షన్ లో వాళ్లను పిలవటంతో
అంతా కలసి ఆసుపత్రికి చేర్చారు

@~ ఇక్కడ ఆదుకున్నది
డబ్బు కాదు బంధాలే..!~@*
[2/3, 16:13] null: *@ మనకు...@
     74వ రోజు
తేది:3/02/2026
""""""""""""""""""""""""""
సంఘం శరణం గచ్చామి 6
~~~~~~~~~~~~~~~

చదువు,ఉద్యోగం సేవింగ్స్,
ఇన్సూరెన్స్ ఉంటే భరోసా!
ఇప్పుడూ ఇవన్నీ అవసరమే
కానీ సరిపోవు...!
ఎందుకంటే కాలం మన ముందుచూపు
ప్లాన్ తో
పాటు బంధాలు,అనుబంధాలు,
సంబంధాలను
కూడా పరీక్షిస్తోంది...
అన్ని సందర్భాల్లోనూ డబ్బు ఉంటేనే
అన్నీ సెట్ అవవు జీవితంలో
డబ్బు ఉన్నా తోటి
మనిషి లేకుంటే సమస్య
మొదలవుతుంది...

బంధాలు,అనుబంధాలు,
సమాజం కల్పించే
భద్రత మనకు కనిపించని సంపద!
ఇది బ్యాంకు పాస్ బుక్కుల్లోనో,
బ్యాంకు స్టేట్ మెంట్ లలోనో
ఏటీఎం కార్డుల్లోనో, ప్రామిసరీ
నోట్లలోనో కనిపించదు కానీ
సంక్షోభ సమయాల్లో
పనికొచ్చే అతిపెద్ద కరెన్సీ
అదే..!

మనింట్లో ఏదో ఫంక్షన్
పెట్టుకున్నాం చుట్టాలు,
పక్కాలు ఎవ్వరూ లేకుండా కేవలం
మనింట్లో సభ్యులే ఉంటే...
బంధువులంతా సమయానికి
అలా వచ్చి ఇలా
వెళ్లిపోతే ఎలా ఉంటుందో
ఒక్కసారి ఊహించుకోండి...
ఏదో అనుకోని ఉపద్రవం ఏర్పడి ఇంట్లో
ఎవరో చనిపోయారనుకుందాం
పలకరించేవారు,పక్కన కూడా
లేకపోతే ఎలా ఉంటుందో
ఊహించుకోవటానికి కూడా
ఇబ్బంది పడతాం..!*

No comments:

Post a Comment