“ఇంట్లో ఉండే కుక్కనైనా,ఆడదాన్నైనా protection పేరుతో restriction చేయాలి లేదంటే చేయిదాటిపోతారు”
”Sometimes PROTECTION & RESTRICTION both look the same”
-------------------//---------------------
Malaysia లో #యూషియా అనే వ్యక్తి కుక్కల్ని breed చేసే బిజినెస్ చేస్తుంటాడు
కుక్కల్ని తన కనుసగైలతో ప్రవర్తించేలా వాటిని శిక్షణ ఇస్తుంటాడు
అతనికి ఓ అందమైన భార్య కూడా ఉంటుంది ఆమె పేరు #సోయి వాళ్లిద్దరు ఓ అడవిలో నివాసముంటారు ఇంటి చుట్టూ కుక్కలు కాపలా కాస్తుంటాయి.
ఒకరోజు కుక్కల్ని కొనడానికి యూషియా దగ్గరికి ఇద్దరు Indians #కురిచియాన్,#మోహన్ వస్తారు. Womeniser,criminal mindset కలిగిన కురిచియాన్ సోయి మీద కన్నేస్తాడు
ఎలాగైనా సోయిని దక్కించుకోవాలనుకున్న కోరికతో
యూషియాని తప్పుడు కేసులో ఇరికిస్తాడు, కానీ
సోయికి మాత్రం నీ భర్త చనిపోయాడని చెప్తాడు.
కానీ యూషియా లేకుండా కుక్కలు కురిచియాన్ ని మోహన్ ని ఇంట్లోకి రానివ్వవు,
అలాగే సోయిని కూడా ఇంట్లోనుండి బయటకి రానివ్వవు
బయటికొచ్చే ప్రయత్నం చేస్తే సోయిని కుక్కలు కరుస్తాయి కూడా
ఇదంతా చూసిన mohan తిరిగి వెళ్ళిపోతాడు కానీ
కురిచియాన్ మాత్రం రోజుల తరబడి సోయికోసం ఇంటిబయటే నీళ్లలోని పడవలో ఉంటాడు
చివరికీ కుక్కల్ని చంపేసి వాటి పిల్లల్ని,సోయిని తీసుకొని kerala కి ఒస్తాడు కురిచియాన్.
Malyasiaలో యూషియా ఎలాగైతే సోయికి కుక్కలని కాపలాగా పెడుతాడో
keralaలో కూడా కురిచియాన్ కుక్కలతో పాటు ఒక మనిషిని కూడా కాపలాగా పెడుతాడు
దేశం దాటినా,సముద్రాలూ దాటినా సోయి జీవితమ్మీద నిఘా కాపలా తప్పదు
ఒకడు(యూషియా) భర్తగా తనమీద ప్రేమతో తనకి ఏమికావద్దని ఏ హాని జరగొద్దని కుక్కల్ని కాపలాగా పెట్టాడని అనుకుంటే
గడప దాటగానే ఆ కుక్కలు కరిచినప్పుడు తెలిసింది
వాడు పెట్టింది కాపలా కాదు తనపై నిఘా అని
మరొకడు(కురిచియాన్) భర్త చనిపోతే చూడలేక నాకు మళ్లీ జీవితాన్ని ఇచ్చాడనుకుంటే వాడు ఏకంగా కుక్కలతో పాటు మనిషిని కూడా నామీద నిఘా పెట్టాడని
యవ్వనం బందీలోనే గడిచిపోయిన్ది
వృద్ధాప్యం కూడా బందీలోనే గడిచిపోతుంది
అసలు ఏది నా జీవితం అని ఆలోచించుకున్న సోయి ఏం చేస్తుంది అనేదే ఈ సినిమా ఒక్క ఊపిరి.
వీలైతే చూడండి లేదా వీలు చేసుకొని చూడండి
ఇది మామూలు సినిమాటోగ్రఫీ కాదు
ఇది మామూలు సినిమా కాదు
ఇదొక మహాద్భుతం...
కనురెప్పమూస్తే ఏం miss అయిపోతామేమో అనిపించే సినిమా

No comments:
Post a Comment