Friday, February 6, 2026

 [1/15, 21:46] null: *@ఊరు...జ్ఞాపకాల ఊటబావి@
               67వ రోజు
         తేది: 15/01/2026
"""""""""""""""""''''''''''""""""""""'''''""""'''''''''""
ఊరు... అచ్చ తెలుగు పదం ప్రతి మనిషికీ ఆత్మీయమైన
మాట చదువు, ఉద్యోగం, ఉపాధి... కారణమేదైనా సొంత
ఊరు విడిచిపెట్టి వెళ్లకతప్పని రోజులివి అందుకే ఎప్పుడు
పండగొస్తుందా అని ఎదురుచూస్తాం, ఆ వంకన ఊరికి
వెళ్లొచ్చని ఎంత పెద్ద నగరంలో ఉంటున్నా ఊరిని తలచు
కుంటే చాలు సంతోషంతో ఒళ్లు పులకరిస్తుంది 
ఊరి మను
షులు కనిపిస్తే గుండెకు హత్తుకుని మాట్లాడాలనిపిస్తుంది
పుట్టి పెరిగిన ఊరి చుట్టూ ఉన్న కొండలు, తోటలు,
పొలాలు, చెరువు...అన్నీ కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి
ఊరి వాళ్లెవరైనా ప్రముఖ స్థానాల్లో ఉంటే మా ఊరివాడే
అంటూ అడిగినవారికీ అడగనివారికీ గర్వంగా చెప్పుకొంటాం 
సొంత ఊరి ముచ్చట్లు ప్రస్తావించకపోతే ఎవరి జీవిత
కథా సమగ్రం కాదు చదువుకున్న బడి, పాఠాలు చెప్పిన
ఆ గురువులు, తోటి పిల్లలతో చేసిన అల్లరి పనులు, ఆడిన
ఆటలు, తోటల్లో చొరబడి చేసిన చిలిపి దొంగతనాలు, పట్టు
బడినప్పుడు తిన్న దెబ్బలు, ఇరుగుపొరుగు అండతో గట్టెక్కిన
ఇబ్బందులు... గుర్తొస్తే పెదాల మీద చిరునవ్వులు విరబూస్తాయి సాయంకాలమైతే పురాణ విషయాలనుంచి ప్రపంచ
రాజకీయాల వరకూ చర్చించేందుకు పెద్దలు కూర్చునే రచ్చ
బండ, కోడి కూయగానే పొలాల్లోకి బయలుదేరే రైతులు,
వాకిళ్లలో కళ్లాపి జల్లి ముగ్గులేస్తూ ఇరుగూ పొరుగూ వారిని
పలకరించే గృహిణులు, రైతుల తగాదాలు తీరుస్తూ గ్రామాధి
కారులు కొలువైన కచేరి, ఇందుమూలంగా యావన్మంది ప్రజలకూ తెలియజేయునదేమనగా... అంటూ సర్కారు వారి
ఉత్తర్వును చాటింపువేసే పంచాయతీ సిబ్బంది... ఊరిని
తలచుకోగానే కళ్లముందు రీలులాగా తిరిగే దృశ్యాలివి
ఇక, పండుగలకు తరలివచ్చేవారితో ఊళ్లకు వచ్చే శోభ
అంతాఇంతా కాదు తెలుగు వారందరివీ అవే పండుగలైనా
వాటిని జరుపుకొనే విధానాల్లో మాత్రం దాదాపుగా ప్రతి
జిల్లాకూ ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా సంక్రాంతి అయితే
చెప్పనక్కరలేదు అందుకే ఏ పండక్కి వెళ్లినా వెళ్లకపోయినా
ఈ పెద్ద పండుగకు మాత్రం పెట్టేబేడా సర్దుకుని నగరాలన్నీ
పల్లెబాట పడతాయి బాగున్నారా, ఇదేనా రావడం...
అంటూ బస్సు దిగినప్పటినుంచీ పలకరింపులు మొదలవు
తాయి అన్నా, వదినా, అక్కా, బావా... అంటూ
ఆప్యాయంగా పిలిచే పిలుపులు వీనులవిందు చేస్తాయి...
అసలు కన్నా వడ్డీ ముద్దన్నట్లు మనవళ్లనీ మనవరాళ్లనీ
చూసుకుని, ఊరివాళ్లకు చూపించుకుని, మురిసిపోయే
తాతయ్యల సంబరమైతే చెప్పక్కరలేదు పిల్లలకు మన
మూలాలను పరిచయం చేయడానికి, సామాజిక సంబంధాల
విలువ తెలియజేయడానికి పండుగను మించిన సందర్భం
ఏముంటుంది? అరిసెలు, జంతికలు, సకినాల ఘుమఘుమలే
కాదు, అరమరికల్లేని బంధుత్వాల గుబాళింపుల్నీ పిల్లలు
ఆస్వాదించేలా చేయాలి. ఉరుకుపరుగుల యాంత్రిక జీవనం
నుంచి, తెరల చాటునుంచి బయటికి వచ్చిన చిన్నారులకు
కుటుంబ జీవన మాధుర్యాన్ని రుచి చూపించాలి వారికీ
ఊరు...తియ్యని జ్ఞాపకాల ఊటబావి... అనిపించేలా
ఈ పండుగ రోజుల్ని గడపాలి అందరూ..!*
[1/19, 11:58] null: *@వెయ్యి జీవితాలు జీవిస్తారా@
              68వ రోజు
       తేది:19/01/2026
""""""""""""""""""""""""""""""""""""""""""""""
జీవితం మీద విరక్తి చెందినప్పుడు లేదా కొత్త జీవితం ప్రారం
భించాలనుకున్నప్పుడు ఒక మంచి పుస్తకం చదివి మొదలు
పెట్టు... అన్నారు ఓ ప్రముఖ రచయిత ప్రపంచపటంలో కని
పించే ప్రతి మూలకూ వెళ్లాలని ఆశపడుతున్నావా, అయితే
గ్రంథాలయానికి వెళ్లు- అన్నారు మరో ప్రసిద్ధ సాహితీవేత్త...
పుస్తకాలు చదివే అలవాటు మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దు
తుంది సాహిత్యానికి సంబంధించి ఏ తరహా పుస్తకాలైనా సరే
మనల్ని వెలుగువైపు నడిపిస్తాయి నిజానికి పుస్తకం చదవడం
ఒక కళ మంచి పుస్తకం చెంతనుంటే వంద మంది మిత్రులు
చేరువైనట్లే..! అంతేకాదు, ఆ అలవాటు వెయ్యి జీవితాలు జీవించిన
అనుభవాన్ని ఇస్తుందంటారు అమెరికన్ రచయిత జార్జ్ మార్టిన్
మాధవ్ తండ్రి ఆటో నడుపుతాడు తల్లి ఇళ్లలో పనిచేసేది
పదో తరగతి చదువుతున్న మాధవ్ బడికెళ్లే దారిలో ఒక పుస్త
కాల దుకాణం ఉంది అతడికదో స్వర్గం లాగా కనిపించేది కానీ
ఒక్కటైనా కొనేందుకు తన దగ్గర డబ్బుల్లేవు. రోజూ కాసేపు ఆ
పుస్తకాలను ఆశగా చూస్తూ నిలబడేవాడు 'నీకు పుస్తకాలంటే
ఇష్టమా?' ఒకరోజు దుకాణం యజమాని రమేశ్ అడిగాడు
లోపలికి రమ్మని పిలిచాడు
మెరిసే కళ్లతో లోపలికి ప్రవేశించిన మాధవ్ ని చూడగానే ఆయ
నకు పరిస్థితి అర్థమైంది 'రోజూ వచ్చి ఇక్కడే గంటసేపు కూర్చుని
నీకిష్టమైన పుస్తకం చదువుకో. కానీ ఒక షరతు. చదివి నువ్వు
నేర్చుకున్న విషయం ఈ నోట్బుక్లో క్లుప్తంగా రాయాలి' అంటూ
ఒక పుస్తకం ఇచ్చాడు రమేశ్...
మాధవ్ ఆనందంగా అంగీకరించాడు రోజూ బడినుంచి నేరుగా పుస్తకాల దుకాణానికి వెళ్లేవాడు
చదువుకున్నాక నోట్ బుక్ లో ఒక వాక్యం రాసేవాడు 'ప్రతి ప్రశ్నకు
సమాధానం ఉంది, కేవలం మనం వెతకాలి' అంటూ సైన్స్
పుస్తకం గురించి, 'చరిత్ర మనకు నేర్పుతుంది, తప్పులు మళ్లీ చేయ
కుండా' హిస్టరీ గురించి, 'పదాలు భావాలకు రూపం ఇవ్వగలవు'
కవితల పుస్తకం గురించి... ఇలా రాసుకుంటూ పోయాడు
'నువ్వు చదివిన పుస్తకాల సారాన్ని కొద్దీ పదాల్లో అద్భుతంగా
రాశావు దీన్నే పుస్తకంగా ప్రచురిస్తాను' అని మెచ్చుకుంటూ
'మా అబ్బాయికి కూడా చదువు పట్ల ఆసక్తి కలిగించగలవా? '
అడిగాడు రమేశ్ 'తప్పకుండా' ఆత్మవిశ్వాసంతో చెప్పాడు
మాధవ్ కథలు, ఆటలు, పాటలు, పజిల్స్ లాంటి వాటి ద్వారా
కుతూహలం కలిగించేలా ఆ పిల్లాడికి పుస్తకాలను అలవాటు
చేశాడు కొద్దిరోజులకే ఆ అబ్బాయి నాకు ఫలానా పుస్తకం తెచ్చి
పెట్టమని తండ్రిని అడగడం మొదలెట్టాడు రమేశ్ చాలా
సంతోషించి మాధవ్ కి పై చదువుల ఖర్చులో కొంత తాను భరి
స్తానని హామీ ఇచ్చాడు పుస్తకాల మీద ప్రేమ మాధవ్
భవిష్యత్తుకు అలా ఒక దారి చూపించింది
పుస్తకాలు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం! అవి
జ్ఞానాన్ని, వివేకాన్ని, అనుభవాలను అందిస్తాయి ఆలోచనలకు
పరిణతినిస్తాయి మనసును విశాలం చేస్తాయి శారీరక
ఆరోగ్యానికి వ్యాయామం ఎంత అవసరమో, మనసుకు పుస్తక
పఠనం అంతే అవసరం...!*

No comments:

Post a Comment