Friday, March 27, 2026

 -----------------------------------                     *🕉 శ్రీరామనవమి 🕉️*----------------------------------
  *శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి,గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే 'మధ్యాహ్మం 12' గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు.*
*ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు.*
--------------------------------------
*పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము,రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో* *పట్టాభిషిక్తుడైనాడు.*
*ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే* *జరిగినదని ప్రజల విశ్వాసము,*
*శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది.*
---------------------------------------
*ఈ చైత్ర శుద్ధ నవమి నాడు భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.*
---------------------------------------   *‘రామ’ యనగా రమించుట అని అర్ధం,కాన మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న                        ఆ 'శ్రీరాముని’ కనుగొనుచుండవలెను.*
--------------------------------------    *ఒకసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని, విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది,*
*దానికి పరమేశ్వరుడు,                            “ఓ పార్వతీ! నేను నిరంతరము ఆఫలితమ కొరకు జపించేది ఇదే సుమా!”అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు.*
--------------------------------------
*శ్లో శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే*
------------------------------------
*ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు,భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.*
--------------------------------------
*దుష్టశిక్షణ,శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై                                                 ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం‘శ్రీరామ నవమి’గా విశేషంగా జరుపుకుంటాం.*
---------------------------------------
*ఏ భక్తులు కాశీలో జీవిస్తూ             ఆ పుణ్యక్షేత్ర మందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్త వశంకరుడే ఈ తారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి,వారికి సధ్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.* 
--------------------------------------
*ఇక భక్త రామదాసు అయితే,శ్రీరామనామ గానమధుపానాన్ని భక్తితో సేవించి, శ్రీరామ నీనామ మేమి రుచిరా… ఎంతో రుచిరా… మరి ఎంతో రుచిరా… అని కీర్తించాడు.*
-------------------------------------   *మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు‘రా’ అనగానే మన నోరు* *తెరచుకుని మన లోపల పాపాలన్ని బయటకు వచ్చి               ఆ రామ నామ అగ్నిజ్వాలలో పడి దహించుకు పోతాయట!*
*అలాగనే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే                            ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట,*
*అందువల్లనే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట!*
--------------------------------------
*శ్రీరామ నవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి,సీతారామ కళ్యాణం చేస్తారు,ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు.*
-------------------------------------
*( చాగంటి కోటేశ్వరరావు )*              -------------------------------------            *మనం పాటించగలిగే రాముని లోకోత్తర గుణం!*      
-------------------------------------- 
*రామాయణంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. అంతకు మునుపే,రాముని జీవితంలో దురదృష్టకరమైన సంఘటనలు చాలా జరిగాయి,అతని రాజ్యం చేజారిపోయింది, అరణ్యవాసం అనుభవించవలసి వచ్చింది,ఇంకా చాలా కఠినమైన జీవితం గడపలసి వచ్చింది,అతని భార్యను రావణాసురడు అపహరించాడు. ఆమె  మీద తనకు ఉన్న ప్రేమ ,  అనురాగాల వల్ల దక్షిణభారతం చివరి వరకూ వచ్చి, ఒక సైన్యంను ఏర్పరచుకుని, సముద్రం దాటి,లంకకు చేరి, యుద్ధం ప్రకటించి, రావణాసురుని ఓడించి, అతనిని వధించాడు.*
---------------------------------------
*రావణాసురుడికి పదితలలు ఉండేవని మీకు తెలుసు,రాముడు రావణాసురుడిని చంపటానికి వాటినన్నింటినీ నరకవలసిందే,యుద్ధం గెలిచిన తరువాత రాముడు“నాకు హిమాలయాలకు పోయి తపస్సు చేయాలని ఉంది, ఎందుకంటే నేను గొప్ప పాపం చేశాను, నేను ఒక పరమ శివ భక్తుడిని,ఒక అసాధారణమైన పండితుని,ఒక గొప్ప రాజుని, ఒక ఉదారస్వభావిని వధించాను’’అన్నాడు, మిగిలిన వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు, అతని తమ్ముడైనటువంటి లక్ష్మణుడు,“మీరు ఏమంటున్నారు? అతను మీ భార్యను అపహరించాడు”* *అన్నాడు. అప్పుడు రాముడు,“అతనికి ఉన్న పదితలలలో చాలా గొప్ప విజ్ఞానం,భక్తి కలది మరియు ఉపాసన చేసినది అయిన ఒకతల ఉంది, దానిని వధించినందుకు నేను చింతిస్తున్నాను”* *అన్నాడు.*
------------------------------------
 _*ప్రజలు చేసే తప్పు ఏమిటంటే, ఒక గుణాన్ని గుర్తించే బదులు,వారు                                                  ఆ మనిషినే పూర్తిగా ఖండిస్తారు.*_
---------------------------------------
*అందరికీ పది లేదా అంతకన్నా ఎక్కువ తలలే ఉన్నాయి,ఒక రోజు  మీ తల అంతా అత్యాశతో నిండి ఉంటుంది,మరొక రోజు అసూయతో, ద్వేషంతో,ప్రేమతో, మోహంతో,అందంతో లేదా వికారంగా ఉంటుంది,లేదా ఒకే రోజు మీలో ఇవన్నీ ఉండవచ్చు,మీరు ఒకరిని ఒక క్షణం అసూయతో చూసినట్లయితే అతను అసూయాపరుడు అని నిర్ధారణకు వస్తారు,కానీ నిజంగా,అనేక సమయాలలో,అనేక రకాల తలలు ప్రతివారిలో పని చేస్తూ ఉంటాయి, ప్రతివారికీ ప్రేమతో నిండిన తల, అలానే అందంతో, ఉదారస్వభావంతో  లేదా కరుణతో నిండిన తల ఉంటాయి,ప్రజలు చేసే తప్పు ఏమిటంటే, ఒక గుణాన్ని గుర్తించే బదులు, ఆ మనిషినే వారు పూర్తిగా ఖండిస్తారు.*
--------------------------------------
*రాముడు చెప్పేది ఏమిటంటే రావణాసురడు ఎంత ఘోరమైన పనులు చేసినా,అతని యందు  బ్రహ్మాండమైన సంభావ్యత కలిగిన ఒక అంశం ఉంది, ఈ ప్రాథమిక సూత్రాన్ని ఆచరించండి-మీరు ఎవరిలోనైనా ఏదైనా తప్పు చూసినట్లైతే ఆ తప్పును ఖండించండి, కానీ ఆ మనిషిని కాదు,మీరు ఈ జ్ఞానాన్ని మీ జీవితంలోకి తీసుకొచ్చినప్పుడు,మీరు అనవసరమైనటువంటి  వాటినుంచి విముక్తులవుతారు,మీరు ఇతరులకు ఇలా చేస్తే, మీకూ అదే జరుగుతుంది.*_
--------------------------------------  *“ప్రేమ అనేది ఒకరంటే ఒకరికి తెలియని స్త్రీ, పురుషుల మధ్య జరుగుతుంది”అని ఎవరో అన్నారు,అది కేవలం అల్పమైన,ప్రతి క్షణం నిర్దారణలు చేసే,జ్ఞానం లేని వారి జీవితంలోనే యదార్ధం,లేకపోతే మీకు ఎవరి గురుంచి ఎంత ఎక్కువగా తెలిస్తే మీకు వారి పట్ల,అంత ఎక్కువ ప్రేమ,కరుణ కలుగుతాయి, మీకు వారి కష్టనష్టాలు అన్నీ తెలిసినట్లయితే, వారూ మీలాంటి మానవత్వం ఉన్న మనిషే అని తెలుసుకుంటారు.*
---------------------------------------
*రాముడు తన భార్యను అపహరించి,ఇంకా ఎన్నో ఘోరమైన పాపాలు చేసిన వానిని వధించినందుకు తపస్సు చేస్తానన్నాడు ఇంత జరిగినా,రాముడు అతని యందున్న ఒక అందమైన తలను చూడగలిగాడు,అతను  ఒక్క గొప్ప జ్ఞానం కలవాడు,అందుకే రాముడిని అందరూ ఆరాధిస్తారు, పూజిస్తారు, అతను జీవితంలో ఎన్నో వాటిలో ఓడినప్పటికీ, అతని ఓటమి ఎన్నడూ అతని గుణాలను, జ్ఞానాన్ని మార్చలేకపోయింది, జీవితం అతనికి ఏమి చేసినా వాటికి అతను లొంగలేదు.*
--------------------------------------
*దయచేసి మీ చుట్టూ ఉన్నవారందరితో ఈ పని చేయండి,భరించలేనివారు అనుకునే వారిలోనూ మీరు ఒక  రవ్వంతైనా తియ్యదనాన్ని గుర్తించండి.*
---------------------------------------   *మీరు రాముని ఈ గుణాన్ని సంవత్సరమంతా గుర్తుంచుకోవాలని నా కోరిక,మీరు ఈ చిన్ని జ్ఞానాన్ని గ్రహించినట్లైతే, మనిషిని ఖండించే బదులు ఆ గుణాన్ని గుర్తించగలిగితే గురు పౌర్ణిమ వచ్చి దక్షిణాయానికి వెళ్ళకముందే మీరు మంచి పంట పండించుకోగలరు, ఒక గులాబి మొక్కలో గులాబి పూలకన్నా ముళ్ళు ఎక్కువుగా ఉంటాయి, అయినా మనం దానిని రోజా మొక్కే అంటాము, ఎందుకంటే మనం దానిలోని అందాన్ని గుర్తించాం కాబట్టి,ఒక మామిడి చెట్టులో పండ్లకన్నా ఆకులే ఎక్కువ ఉంటాయి,అయినా మనం దానిని మామిడి చెట్టే అంటాము,ఎందుకంటే మనం ఆ పండ్లలోని మాధుర్యాన్ని గుర్తించాం కాబట్టి.*
--------------------------------------
*ప్రతి మనిషిలోను కనీసం ఒకటైనా తియ్యని అంశం ఉంది,మనం దానిని ఎందుకు చూడకూడదు? దయచేసి ఈ పని చేయండి – మీరు భయంకరమైన వారిగా భావించే వారిలోనూ ఒక  రవ్వంతైనా తియ్యదనాన్ని గుర్తించండి,మీరు ఇతరులలో అది ఎప్పుడు గుర్తిస్తారో అప్పుడు మీలో కూడా అది గుర్తించబడుతుంది, అదేవిధంగా,మీరు ఇతరులలో భయంకరమైనవి చూస్తున్నట్లైతే,                    మీవిషయంలోనూ అదే జరుగుతుంది,దీని అర్ధం మీరు అన్నింటికీ అంధులు కావాల్సిన అవసరం లేదు, మీరు మామిడి చెట్టుకు ఉన్న ఆకులను చూస్తారు, గులాబి మొక్కకు ఉన్న ముళ్ళను చూస్తారు కానీ      ఆమామిడి పళ్ళను,గులాబి పూలను గుర్తిస్తారు,మీరు చేయవలసినది అంతే పదండి,ఈ  ఆశయాన్ని సాధిద్దాం.*
------------------------------------   
                *🙏🏻సర్వే జనాః సుఖినోభవంతు🙏🏻* 
-----------------------------------    
                🙏🏻 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*🙏🏻                     
---------------------------------------
 ఆధ్యాత్మిక సమాచారంతో పాటు astrology  సంబంధ పోస్ట్లు వస్తాయి. ఆసక్తి కలవారు జాయిన్ అవగలరు.                                                       🪷⚛️✡️🕉️https://aratt.ai/@teluguastrology

https://chat.whatsapp.com/DhZBkR4z4pB8E7asGxgjkj

https://www.facebook.com/teluguastrology

 TeluguAstrology channel  https://whatsapp.com/channel/0029Va9d4z5EquiIi18jEp12

No comments:

Post a Comment