*సంసారం-భవ బంధసాగరం*
మాయలో పుట్టిన శిశువు పూర్వజన్మ వాసనలు వీడక తాను పెరగుతున్నకొలదీ తనలో తాను ఆధ్యాత్మిక దోరణితో ఆలోచిస్తూ యుక్తవయసులో కూడా తన బాధ్యత గ్రహించక ఆధ్యాత్మిక చింతనలోనే ఉండటం గుర్తించిన తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి పెళ్లిచేస్తేనైనా దారిలో పడతాడని సన్నాహాలు చేస్తున్నారట.
అది గమనించిన అతడు ఆశ్రమానికి వెళ్లి అక్కడ గురుగారిని ఇలా అడిగాడట.
“గురువుగారూ నాకు మంత్రోపదేశం చెయ్యండి.
నాకు ఈ సంసారము ఇతిబాధలు అక్కర్లేదు.
నేను ఎందరి జీవితాలనో చూస్తున్నాను.
వారి బాధలు నాకు చాలా తెలుసు.
కనుక తెలిసి తెలిసీ నేనా ఊబిలోకి దిగను.
దయచేసి నాకు ఉపదేశం ఇవ్వండి.
నన్ను బంధవిముక్తుణ్ని గావించండి” అని వారిపాదాలపై బడి భక్తితో ప్రణమిల్లాడట.
ఆ యువకుని మాటలు విన్న గురువుగారు యితని పై మంత్రించిన జలాన్ని చల్లి ఇలా సమాదానం ఇచ్చారట..
“చూడునాయనా…
నీవు బంధవిముక్తుడవు కావాలన్నా
నీవు పరమేశ్వరుని అనుగ్రహం పొంది మోక్షంపొదాలంన్నా
నీ మనసుకి స్తిరత్వం ఉండాలి.
అందుకు భక్తి ఒక్కటే సరైన మార్గము. అట్టి భక్తి నీలో జనించాలంటే దానిపై నీకు గురి కుదరాలి. అలాంటి గురి నీకు సాధ్యపడాలంటే అందుకు ఎంతో సాధన నీవు చేయాలి. ఇవన్నీ నీకు అనుభవం కావాలంటే సంసారమొక్కటే సరియైన మార్గము. అది ఎలాగో చెబుతాను విను… నీవు బాధలు బాధ్యతలు లేని జీవితం నుండి తప్పించుకోకూడదు.
సంసారం అతిపెద్ద జీవిత సాగరం.
ఇందులో మొదటగా తల్లిదండ్రులు
తరువాత అన్నదమ్ములు, అక్కా చెళ్ళెళ్ళు ఆతరువాత బార్యా , పిల్లలు., ఆ తరువాత మనుమలు, మనవరాళ్లూ, ఇలా ఎన్నో బంధాలు నిన్ను అల్లుకొని వాటిని సరియైన మార్గంలో నడిపించడానికి నీవు పడే బాధల వలన సమస్యలతో నీవు రాజీ పడుతూ, ఒక్కొక్క కోరికనూ నీలో నీవు చంపుకొంటూ నీ ముందు వారు ఒక్కొక్కరుగా నీకు దూరమౌతున్నవేళ వారిపైన ప్రేమలు చంపుకొంటూ, నీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి వారి కాపురాలను వారు సరిదిద్దుకొనే వేళ నిన్ను మరచి వారు దూరమౌతూ ఎన్నో సమస్యలతో నీవు అలసి, సొలసి, విసిగి వేసారిపోయి ఇక్కడ ఏదీ నీకు శాశ్వతం కాదని తెలుకొని నీలోని కోరికలు వాంచలు అన్నీ నశించిపోతాయి.
అప్పుడు నీవు దేవుడే దిక్కు అని పరిపూర్ణమైన భక్తితో, పూర్తి ఏకాగ్రత నీకు లభిస్తుంది.
అటువంటి సమయంలో నీవు సంపూర్ణమైన భక్తితో భగవంతుని ప్రార్దిస్తావు.
అందుకే అంటారు పెద్దలు: ఒక్క సంసారి వందమంది సన్యాసులతో సమానం.
సరియైన మోక్షానికి సంసారమే చక్కని మార్గమని.
మనసు పరిపక్వత సాధించడంలో సంసారం అనుభవాల మార్గదర్శి అని.
సంసారం నిజమైన భవ బంధాల గల్గిన సాగరమని.
దీనిని సమర్దవంతంగా ఈదగల్గిన వారికి మోక్షం దానంతట అదే లభిస్తుందని. *ఆధ్యాత్మిక కుటుంబం 4*
No comments:
Post a Comment