రామనామం.. అతి మధురం......!!
శ్రీరామ నామ జపమే సమస్త తాపాలను నివృత్తి చేసే
ఏకైక ఔషదం.
శ్రీరామ నామం త్రిమూర్తులకు ప్రతీక.
అందుకే పార్వతీ వల్లభుడు కూడా
శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.!
అంటూ శ్రీరామనామం విష్ణుసహస్రనామాలకు సమానమైనదని చెప్పాడు.
విష్ణుమూర్తి యొక్క ఒక్కొక్క నామం సర్వదేవతల కంటే అధికమైంది.
అటువంటివి వేయినామాలు ఒక్క రామ నామానికి సమం.
రామనామం బ్రహ్మహత్యాది అనేక పాతకముల నుండి రక్షిస్తుంది.
'రామ నామాత్పరో మంత్రః నభూతో న భవిష్యతి' అంటే, రామనామాని కంటే గొప్పమంత్రం ఇదివరలో లేదు. భవిష్యత్తులో కూడా ఉండబోదని చెప్పబడింది.
మంత్రాలలోకెల్లా గొప్పదైన గాయత్రీ మంత్రానికి, రామమంత్రానికి మధ్య భేదమేమీ లేదు.
'రామ' నామాన్ని చెబితే గాయత్రీమంత్రాన్ని చెప్పినట్లే.
అ, ఉ, మ ల సంగమమే ఓంకారమని మనకు తెల్సిందే.
అ= విష్ణువు,
ఉ= మహాలక్ష్మీ,
మ= జీవుడు.
రామనామం ప్రణవం నుంచే ఉద్భవించిందని రామాయణం పేర్కొంది.
శ్రీరామ జయరామ జయ జయరామ..!!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!
No comments:
Post a Comment