Friday, March 27, 2026

 *సీతారాముల కళ్యాణం ఎప్పుడు జరిగింది? మనం ఎప్పుడు జరుపుతున్నాం?*

వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీ సీతారామకల్యాణం సౌమ్య సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణమాసం, శుక్లపక్షం ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో పౌర్ణమి తిథినాడు జరిగింది.

*ఉత్తర దివసే బ్రహ్మన్! ఫల్గుణీ భ్యాం మనీషిణః* 
*వైవాహితం ప్రశంసం తి భగో యత్ర ప్రజాపతిః*

"ఓ బ్రహ్మర్షీ! వశిష్టా! నేడు మఖానక్షత్రం. రేపు పూర్వఫల్గుణీ (పుబ్బ) నక్షత్రం. ఎల్లుండి ఉత్తర ఫల్గుణీ (ఉత్తర) నక్షత్రం. సంతాన ప్రదుడైన భాగ ప్రజాపతి ఉత్తర నక్షత్రంలో ఉన్నప్పుడు వివాహం జరపడం ప్రశస్తం" అని పండితులు చెప్పారు, అలా జరిగింది. 

కాని మన రాష్ట్రంలో భద్రాచలం ఇతర రామాలయాల్లో శ్రీరాముని జన్మదినం, శ్రీరామనవమినాడే సీతారామ కల్యాణోత్సవం జరుపుతున్నారు. ఎందువల్ల? 

పాంచరాత్రాగమంలోని కపింజల సంహిత ప్రకారం *మహతాం జన్మ నక్షత్రే వివాహః పరికీర్తితః* అని ఆదేశింపబడింది. 

అందువల్ల శ్రీరామనవమి నాడే సీతారాముల కల్యాణం జరపడం ఆచారమైంది.           
*సీతమ్మ అంటే ఎవరు??..!!*             

*జనకుడి కుమార్తే, దశరథుడి పెద్దకోడలు, శ్రీరామచంద్రుడి భార్య, మహాసాధ్వీమణి సీతమ్మ తల్లి ఇంతమాత్రమే మనకు తెలుసు!!*

*కాదు సీతమ్మతల్లి సాక్షాత్ మహా శక్తి స్వరూపిణి!! జనకుడికి నాగేటిచాలులో దొరక్కముందు, రామయ్యను మనువాడక ముందు కూడా ఆమె శక్తి స్వరూపిణియే!!*

*ఐదు వేలమంది బలిష్టులైన సైనికుల చేత  తీసుకరాబడిన శివధనుస్సును సీతమ్మ ఎడమ చేతితో పక్కకు జరిపి బంతిని తీసుకుని ఆటలాడుకున్న తల్లి ఆమె!  మహామాయా స్వరూపిణి మహాశక్తి స్వరూపిణి సీతమ్మ!!*

*అంతే కాదు ఆమె పేరుతో ఒక ఉపనిషత్తే ఉంది!*

*అందులో ఆమె అసలు సిసలైన స్వరూప స్వభావాలు మనకు గోచరిస్తాయి!!*

*సీతోపనిషత్తు అధర్వణ వేదంలో ఉంది! బ్రహ్మదేవుడు తన దగ్గరకు వచ్చిన దేవతలకు సీతమ్మ మహాత్యాన్ని గురించి వివరించిన విషయాలు ఉపనిషత్తుగా మారింది!!*

*"మూల ప్రకృతి రూపత్వాత్                                 సా సీతా ప్రకృతి స్మృతా " !*
*"ప్రణవ ప్రకృతి రూపత్వాత్ సా సీతా ప్రకృతి ఉచ్యతే " !*
*" సీతా" ఇతి త్రివర్ణాత్మా సాక్షాత్ "మహామాయా" భవేత్" !*

*సీతాదేవి అయోనిజ, అసామాన్యురాలు, మూలప్రకృతి స్వరూపిణి ఒక్క మాటలో చెప్పాలంటే సీతమ్మ ప్రకృతి స్వరూరిణి!!*

*లక్ష్మీ అష్టోత్తర శత నామాలలో మొట్టమొదటి నామం ఓంప్రకృత్యైనమః!*

*సీతమ్మతల్లి మహాలక్ష్మీస్వరూపం!!*

*రామయ్య పురుషస్వరూపం!!        సీతమ్మ ప్రకృతిస్వరూపం!!*

*ప్రకృతిపురుషులకుప్రతిరూపాలుసీతారాములు!*

*అంతే కాదు ప్రణవనాదమైన ఓంకారంలో ఉంది కూడా ఆ తల్లే!! *

*సీత సత్వ రజ తమో గుణాత్మకమైంది! ఆమె మహామాయా స్వరూపిణి! సకార, ఇకార, తకారాల సంగమం!*
*సకారం ఆత్మ తత్త్వానికి సంకేతం! ఇకారం ఇచ్ఛా శక్తికి సంకేతం! తకారం తారా శక్తి! తరింప జేసేది! అంటే ఆత్మదర్శనం కలిగించి పరమాత్మతో అనుసంధానం చేసి జీవుడిని తరింప జేసేది ఆ మహాశక్తి అని బ్రహ్మగారు వివరించారు!! ఆ కీట బ్రహ్మ పర్యంతం సమస్త సృష్ఠికీ, సమస్త జగత్తుకూ తల్లి సీతమ్మతల్లి!!*

*సీతమ్మ తల్లి మొదటి రూపం మహామాయ! దీనినే శబ్దబ్రహ్మమయి రూపం అని కూడా అంటారు! అమ్మ జ్ఞాన స్వరూపిణిగా వేదాధ్యయనం చేసే చోట ఈ తల్లి ప్రసన్న రూపంలో ఉండి అత్యున్నతమైన అలౌకికమైన భావాలను కలుగజేస్తుంది!!*

*రెండోరూపం జనకుడు భూమిని  దున్ను తున్నప్పుడు బయటపడిన రూపం! జనకుని కోట్లజన్మల పుణ్యవశంచేత తనకుతానుగా బిడ్డగా లభించిన క్రియాశక్తి రూపం సీతమ్మ!!*

*మూడోరూపం  అవ్యక్త ఇచ్ఛాశక్తి స్వరూపిణిగా జీవులందరిలో ఉంటుంది!జగత్తంతటిలో నిండి ఉండే జగదానంద కారిణిగా లక్ష్మీ స్వరూపంగా విరాజిల్లే తల్లి!!*

*ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మూడు శక్తుల రూపంగా, ముగ్గురమ్మల మూలపుటమ్మగా    సాధకులు, ఉపాసకులు దర్శించవచ్చని బ్రహ్మదేవుడు దేవతలకు బోధించాడు!!*

*రామభక్తులను  హనుమభక్తులను అమ్మ కంటికి రెప్పలాగా కాపాడుతుంది!! అదే విధంగా అమ్మఉపాసకులకు రామకృప, హనుమకృప శీఘ్రంగా లభిస్తాయి!!*

*అందుకే భక్తరామదాసస్వామి భక్తితో పాడారు…*

*నను బ్రోవుమని చెప్పవే సీతమ్మ తల్లి!! నను బ్రోవుమని చెప్పవే! నను బ్రోవుమని చెప్పు నారీ శిరోమణి! జనకుని కూతుర జననీ జానకమ్మా! నను బ్రోవుమని చెప్పవే!!*

*మనందరిపై సీతారామచంద్రస్వామి కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ.
                             
*శ్రీరామనవమి రోజున - వడపప్పు, పానకం, విసనకర్ర.. ప్రాధాన్యత*
        
🙏🪷💐🪷💐🪷🙏

✅ శ్రీరామనవమి నాడు వడపప్పు, పానకం ఇస్తారు. విసనకర్రలు దానం చేస్తారు♪.

🪷 ఉగాది తర్వాత వచ్చే పండగల్లో శ్రీరామనవమి ముఖ్యమైనది. ఆనాడు లోకకళ్యాణార్థం సీతారాముల కళ్యాణం వేదమంత్రాలతో, పాటలతో జరిపించాక వడపప్పు, పానకం ఇస్తారు♪.

🪷 నానబెట్టిన పెసరపప్పునే వడపప్పు అంటారు. శ్రమను హరించే పప్పు వడపప్పు. శ్రమ పడినప్పుడు ఎండాకాలంలో వడ కొడుతుంది. శ్రీరామనవమి చైత్రమాసంలో కొంత వేడి ప్రారంభంలో వచ్చే పండగ. వడపప్పు తినడం చేత చల్లదనం ఏర్పడుతుంది♪.

🪷 పానకం అనేది బెల్లం, మిరియాలతో చేస్తారు. పానకం శుభకార్యక్రమాలలోనే అవసరం♪. పెళ్ళిళ్ళలో పానకం బిందెలు ఇవ్వడం ఒక తతంగం. మాధుర్యమే కాక ఎదుటివారు చల్లగా వుండాలనేది కూడా వుంది♪. *సీతారాముల కళ్యాణం ఒక శుభపర్వం. ఆ సమయాన పానకం పంపకం తీయని సందర్భం*.

🪷 పూర్వకాలంలో వేసవికాలంలో విద్యుచ్ఛక్తి ఉండని కాలంలో, ఫ్యాన్లూ అవీ లేని కాలంలో తాటాకు విసనకర్రలే తాపం పోవడానికి, గాలి రావడానికీ వాడుకునేవారు. విసనకర్రలు గతంలో రెండు రకాలుగా వుండేవి. వెదురుతో చేసిన విసన కర్రలు పొయ్యిలకి, కుంపట్లకీ ఉపయోగించేవారు. తాటాకు విసనకర్రలు గాలి పొందడానికి, తాపాన్ని పోగొట్టుకోవడానికి ఉపయోగించేవారు. మామిడిపండ్ల కాలం రావడంతో మామిడిపళ్ళు, విసనకర్రలు ఇవ్వడం పుణ్యప్రదం. అంతేకాదు, ఇతరులు హాయిగా వుండటం కోరుకోవడం కూడా వుంది. శ్రీరామనవి నాడు విసనకర్రలు దానం చేయడం కూడా అందుకే..!".        ✍️అరుణాచలం        *ఆధ్యాత్మిక కుటుంబం 4*                                                 

No comments:

Post a Comment