మన పండుగల గొప్పతనం
ఉగాది - కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.
శ్రీరామ నవమి - భార్య భర్తల అనుబంధాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.
అక్షయ తృతీయ - విలువైన వాటిని కూడబెట్టుకోమని.
వ్యాస (గురు) పౌర్ణమి జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.
నాగుల చవితి - ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా ఆదరించమని.
వరలక్ష్మి వ్రతం - నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.
రాఖీ పౌర్ణమి - తోడబుట్టిన బంధం ఎప్పటికీ విడరాదు అని.
వినాయక చవితి (నవరాత్రులు) - ఊరంతా ఒక్కటిగా కలవడానికి,
పితృ అమావాస్య - చనిపోయిన వారిని ఎప్పటికీ మరువకు అని.
దసరా (ఆయుధ పూజ) ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని " గౌరవించమని తెలిపేది.
దీపావళి - పది మందికి వెలుగు చూపే జీవనం నీదవ్వాలని.
కార్తీక పౌర్ణమి - చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.
సంక్రాంతి - మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం, అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.
మహాశివరాత్రి - కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.
హోలీ - వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అనుభూతులను పిల్లలు, పెద్దలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.
No comments:
Post a Comment