*హంసః*
*హంస అనెడి పదమునందు ‘హ’ యనెడి అక్షరము ‘బిందువు’ ‘స’ యనెడి యక్షరము ఈ మూడును జేరి యున్నది. ఇందులో ‘హ’ యనగా పరమాత్మ యనబడును. ‘స’ యనగా జీవుడనబడును. ‘హస’ లనెడి రెండు వర్ణంబుల మధ్యనుండు బిందువు పరమాత్మయే జీవాత్మయు, జీవాత్మయే పరమాత్మ యనియు నైక్యమును బోధించుచున్నది. ఇందుకు కారణ మేమనగా ( శ్రుతిః స్వప్రకాశచిదానందం -స- హంస ఇతి గీయతే) అనురీతిని స్వప్రకాశమై పరంజ్యోతియై జ్ఞానానంద స్వరూపమై సర్వ సాక్షియై వెలుగుచుండు పరబ్రహ్మమగు యాత్మయే హంస యనబడును. ఇట్టి హంస ధ్యానమే ధ్యానము గాని తక్కినవన్నియు బక ధ్యానములే యగును.( అనగా కొంగ జపములు అగునని తెలియవలెను ).
No comments:
Post a Comment