Friday, March 27, 2026

 *_అమెరికా అధ్యక్షుడైనా_*
*_అంతకు మించి..!_*
**********************
   _లింకన్ జయంతి_
       12.02.1809

+++++++++++++++++

*_అబ్రహం లింకన్.._*
అమెరికా అధ్యక్షుడిగా 
ఎంత గుర్తింపో..
మానవతావాదిగా 
అంతకు మించిన గౌరవం..
మామూలు మనిషిగా 
ఉన్నప్పుడు గుణం  
ఎంత ఉదాత్తమో..
అధ్యక్షుడయ్యాక 
అంతే ఔదార్యం..
ఎలా ఉన్నా 
ఆయన ఆహార్యం..
అదెంత గొప్ప 
హృదయ సౌందర్యం..!

బిచ్చగత్తెకు చెల్లని నాణెం ఇచ్చిన పొరపాటు..
భారీ వర్షంలో పరుగులు
తీయించింది మంచి నాణెం 
ఇచ్చేందుకు..
*_తప్పు చెయ్యలేదనే భావన.._*
*_మోసం చేశాననే బాధ_*
*_రూపుమాపుకునేందుకు.._*
రూపు దాల్చిన మానవత్వం..
ఆ క్షణాన దాని పేరు
*అబ్రహాం లింకన్..*
తర్వాత చేరింది ఆ పేరు
ముందు కాసుల పేరు
ప్రెసిడెంట్ అని..
తలవంచింది అవని..!

అగ్రరాజ్యంలో బానిసత్వాన్ని
రూపుమాపిన అబ్రహాం..
ఆ దేశానికి ఎంత గొప్ప
జవసత్వాలు ఇచ్చాడో..
ఎన్ని మనస్తత్వాలు చదివాడో..
జోళ్ళు కుట్టేవాడి మనవడని
హేళన చేసిన జనం..
మా తాత తప్పు చేసి ఉంటే
నేను మళ్లీ కుట్టి
సరిదిద్దుతానన్న
*_సంస్కారమెంత ఘనం.._*
అందుకే అమెరికా అంది
వందనం..
*_అడుగుపెట్టినంతనే_*
*_మురిసిపోయింది_*
*_శ్వేతసదనం..!_*

అంతటి అమెరికాలో
అంతర్యుద్ధం..
ఎదుర్కోడానికి లింకన్లోని
యోధుడు సిద్ధం..
దేశాన్ని గట్టెక్కించినా
పొంచి ఉన్న విపత్తు నుంచి
బయటపడని వైనం..
అది కానే కాదు
అబ్రహాం లింకన్ హత్య..
నీతినిజాయితీల హననం..
మానవతా విలువల ఖననం!

************************

*_సురేష్ కుమార్ ఎలిశెట్టి_*
        9948546286
        7995666286

No comments:

Post a Comment