Friday, March 27, 2026

 అప్పిచ్చు వాడు వైద్యుడు!
కాఫీ కప్పిచ్చు వాడు సర్వరుడు!
తిని టిప్పిచ్చు వాడు కస్టమరుడు!
కరీం బీడీకి నిప్పిచ్చు వాడు నిజమగు మిత్రుండు!
బాకీ తీర్చక తిప్పించు వాడు  
బతక నేర్చినవాడు!
వండి పెళ్ళామును మెప్పించు  వాడు అసలు మొగుడు!
మామిడికాయ పప్పులో ఇంగువ గుప్పిచ్చు వాడు గొప్ప వంటగాడు! 
ముప్పూటా స్విగ్గీ తెప్పించువాడు భార్యా బాధితుడు!
ఇంట్లో ఉండీ లేడని చెప్పించు వాడు దేశ ముదురుడు!
పాటకు పెదాలు కలిపేవాడు  కథానాయకుడు!                       
పోస్టులందు హాస్యము చొప్పించు వాడు  మేటి రాతగాడు!
ప్రేయసి మనసు నొప్పిచ్చువాడు ఆధునిక ప్రియుడు!
ప్రియురాలిని ఒప్పిచ్చువాడు పాత కాలపు ప్రేమికుడు!
ఆపద తప్పించువాడు భగవంతుడు!
కాలము తీరినంత పైకి రప్పించు కొను వాడు యమకింకరుడు, 
మొబైలే లేనివాడు దైవస్వరూపు డు
వాట్సప్ లేనివాడు యోగీశ్వరుడు
ఉండీ ఫార్వర్డ్ లు చేయనివాడు ధృఢచిత్తుడు

చనిపోయాక చితికి నిప్పు పెట్టేవాడు కాదు వారసుడు 
మంచాన పడ్డరోజు  మంచి నీళ్లు ఇచ్చి  మందు బిళ్ళ  వేసేవాడే నిజమైన వారసుడు 

పంచె కట్టుటలో  ప్రపంచాన మొనగాడు 
కండువా లేనిదే గడప దాటని వాడు 
పంచ భక్ష్యాలు తమ కంచాన వడ్డింప 
గుంటూరు గోంగూ ..ర కోసమై  గుటకలేసేవాడు
ఎవడయ్య ఎవడయ్య వాడు ఇంకెవడు  తెలుగువాడు
కదరా సుమతీ!

No comments:

Post a Comment