🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️```
*“పరోపకారానికి మించిన పుణ్యంలేదు - పరనిందను మించిన పాపం లేదు”
*ఒకరు మీకు కష్టం కలిగించినంత మాత్రాన వారిపై మీరు నిందలు మోపాల్సిన పనిలేదు.
*అలాంటి వారు మీకు ‘సుఖదుఃఖాలు కలిగించటం ద్వారా మీ కర్మ పరిపక్వమయ్యేందుకు తోడ్పడుతుంటారు!’ అనే భావనతో మెలగటమే ఉత్తమమైన జీవన విధానం.
*విజ్ఞులైనవారు తమకు కలిగిన సుఖదుఃఖాలు దైవసంకల్పం వల్ల కలిగినవేనని భావించాలి, భగవంతుడు మీకు ఏది ఇచ్చినా తృప్తి పొందాలి.
*మీకు ‘ఒకటి దక్కటం దక్కకపోవటం అనేది మీ గత జన్మ కర్మఫల సంస్కారాల వల్ల సంభవిస్తుంది!’ అని తెలుసుకోగలగాలి.
*మీకు భగవంతుడు ఇచ్చిన అన్ని శక్తులను పరోపకారం కొరకు వినియోగించాలి.
*మీకున్న ‘మిత్రులు, శత్రువులు ఆ భగవంతుడి చేతిలో కీలుబొమ్మలే!’ అన్నది బాగా అర్థంచేసుకుని ఇతరులని నిందించటం మానేయండి...!✍️```
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment